14, ఆగస్టు 2012, మంగళవారం

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు




స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
బ్లాగ్ మిత్రులందరికీ 65 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు...

పరాయి దేశస్తుల పాలన నుండి విముక్తులమై 65 సంవత్సరాలు దాటిపోతున్న ఈ తరుణంలో మనం ఎక్కడున్నాం, మన ఆలోచనలు ఎక్కడున్నాయి, ఈ 65 సంవత్సరాలలో మనం ఏమి సాధించాం ... అని ప్రతీ సారి అనుకుంటూ ఉంటాం... స్పీచ్ లు వినేస్తం.. స్వీట్లు తినేసాక జైహింద్ అని మన రొటీన్ లో పడిపోతాం... స్వాతంత్రం రాకముందు మనపై ఒక్క బ్రిటిష్ వారి ప్రభావమే ఉండేది... కానీ ఇప్పుడు మన దేశ ప్రభావం తప్ప అన్ని దేశాల ప్రభావం మనపై ఉంది... ఇంతకాలమైన మనం వాడుతున్న ప్రతీ వస్తువు పై విదేశీ ముద్ర ఖచ్చితంగా ఉంది... మనం పెంచుకునే కుక్క విదేసీది... తోటలో గడ్డి విదేశీయుల దే.   మన మామిడి, అరటి, కొబ్బరి, తాటి చెట్ల కన్నా క్రోటన్ మొక్కలంటే మనకు ప్రీతీ.  "వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు" లని తీసిపారేసే మనం వాసన లేని గడ్డి పువ్వులను బోకేలంటూ వాడేస్తున్నాం.  వర్షాలు లేకపోతే వర్షాలు లేవో అని ఏడుస్తూ ఉంటాం.. గట్టిగా వర్షాలు పడితే నిలువ చేసుకొనే మార్గాలు లేక సముద్రానికి వదిలేస్తూ ఉంటాం..  నాలుగు రోజుల క్రితం ముప్పై ఐదు రూపాయలకి కొన్న పంచదార ఈ రోజు నలభై దాటిందంటే... మన ఖర్మ అని adjust అయి పోతాం... మనం డాక్టర్ చదువులకు కూడా పెట్టని డబ్బు మన పిల్లలకు ఎల్. కే. జి. కి సునాయాసంగా ఖర్చు పెట్టేస్తూ ఏమి చేస్తాం అనుకుంటూ గడిపేస్తాం... చూస్తుంటే మనకు కావలసింది స్వేచ్చ కాదు... క్రమశిక్షణ అనిపిస్తుంది... వ్యవసాయం కన్నా ఎలక్త్రానిక్స్ వ్యాపారమే లాభదాయకమని ఆలోచించే కాలం ఇది   ప్రజా క్షేమం కంటే తమ పదవులే ముఖ్యమనుకునే నాయకులున్న దేశమిది.. ఎలాగో ఒకలాగా కాలం గడిపేసే పధ్ధతి నుండి మనం బయట పడనంత కాలం ఎన్ని సంవత్సరాలైనా మనం బానిసలమే.. మనకున్న స్వేచ్చ మనం ఇష్టమున్నట్లు బ్రతకడానికే ... కాని అడ్డదిడ్డంగా బ్రతకడానికి కాదు...  స్వేచ్చ తో పాటు క్రమశిక్షణ కావాలి ... రైమ్స్ తో పాటు వేమన పద్యాలు నేర్చుకోవాలి..  ఉపగ్రహ పరిజ్ఞానాన్ని నేల సారవంతానికి ఉపయోగించాలి...  రసాయన మందులతో పాటు, మన వేప, అశ్వగంధ ల ఉపయోగం గుర్తించాలి...   వేదాల్లో మెట్ట వేదాంతం మాత్రమె కాదు, విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానం కూడా ఉందని గ్రహించాలి.. వేరే వాళ్ళతో కలిసిపోతూ మనం మనం గా ఉంటే మన అస్తిస్త్వం నిలుపుకో గలుగు తాం.. ప్రపంచ దేశాల్లో ప్రత్యేకంగా నిలుస్తాం..
జైహింద్...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి