రాను రానూ షేర్ / స్టాక్ ల ధర కిందకు దిగిపోతూ ... మదుపర్లకు రా రమ్మని ఆహ్వానిస్తున్నాయి .. కొనుక్కోమని కోరుకొంటున్నాయి ...
రిస్క్ తక్కువైన బ్యాంకు షేర్లు ... బాగా తక్కువ ధరకు దొరికే పరిస్తితి ఉంది ... సేవింగ్స్ కోసమైతే మాత్రం ప్రస్తుతం కొనుక్కొనే అవకాశం ఉన్న తరుణమని చెప్పవచ్చు .
ఈ మధ్యనే రూ . 500. 00 ల వరకూ వెళ్ళిన ఎస్ బ్యాంకు స్టాక్ ప్రస్తుత ధర రూ . 379 . 00 మాత్రమె ... చీప్ గా దొరికే సౌత్ ఇండియన్ బ్యాంకు స్టాక్ Rs.22. 00 - Rs.23/- మధ్య ఊగిసలాడు తుంది . ఇక ఆంధ్ర బ్యాంకు అయితే ఈ రోజు రూ. 75. 00 కు చేరుకుంది ... ఇంకా తగ్గ వచ్చని అంటున్నారు ... అయితే ఈ మాటలను పట్టించు కోవలసిన పని లేదు ...
ఎందుకంటె తగ్గుతూ వస్తున్న స్టాక్ రేట్ ఇంకా తగ్గుతుందని ... పెరుగుతూ ఉన్న స్టాక్ ఇంకా పెరుగుతుందని .. జాతక రత్నాలు చెపుతూనే ఉంటారు ... ఇంకా తగ్గాక కొందాములే .. అనుకుంటే సడన్ గా పెరిగి పోవచ్చు ... ఇంకా పెరిగాక అమ్ముకో వచ్చులే అనుకుంటే ... అకస్మాత్తుగా కూలి పోవచ్చు ... ఒక పర్సంటేజ్ అనుకోని ... తరువాత పరిణామాలను ఆలోచించ కుండా ట్రేడ్ చేయడమే ఉత్తమం ..
ఈ రోజు ధరలో ఆంద్ర బ్యాంకు స్టాక్స్ కొంటె ... ఒక లక్ష రూపాయలకు 1333 స్టాక్స్ కొనవచ్చు. ఒక సంవత్సరం లో ఈ స్టాక్స్ పై వచ్చే డివిడెండ్ రూ . 6665. 00 ... అంటే 6. 66% వడ్డీ ని స్టాక్స్ ను కదల్చ కుండా ఒక సంవత్సరం ఉంచితే పొందవచ్చు ... లేదా ఇంత లోగా పెరిగితే అమ్ముకో వచ్చు .. లేదా ఇంకా తగ్గితే average చేసుకోవచ్చు ... dividend (interest) పెరుగుతుంది ... కాబట్టి ఎలాగైనా నష్టపోవడం జరగదు ...
లాంగ్ టైం investment చేసే వారికైతే మాత్రం ఇది వదులుకో రాని అవకాశం .
బై
మురళి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి