24, ఆగస్టు 2013, శనివారం

బ్యాంకు అఫ్ ఇండియా

ఈ టెక్నికల్ అనాలిసిస్ లు, బాలన్స్ షీట్ లో , ప్రాఫిట్ మరియు లాస్ నిష్పత్తులూ నాకు తెలీదు కానీ , బ్యాంకు అఫ్ ఇండియా స్టాక్ గురించి మాత్రం కొంత పాజిటివ్ ఒపీనియన్  ఉంది ...

1996 లో అనుకుంటాను ... రూ . 45 /- విలువతో ప్రారంభమైన ఈ స్టాక్ డివిడెండ్ శాతం తక్కువ గా ఇచ్చిన ప్పటికీ , అంటే ఆంధ్ర బ్యాంకు తో పోల్చుకుంటే డివిడెండ్ తక్కువ ... కానీ పోర్ట్ ఫోలియో లో ఉండవలసిన స్టాక్ ... 14 సంవత్సరాల లో రూ 45 /- స్టాక్ రూ . 500 /- ను దాటింది అంటే  1111 శాతం పెరుగుదల ... సరాసరి నెలకు 6% వడ్డీ ... ఇన్వెస్టర్ లకు అందించిన స్టాక్ ...

క్రితం సంవత్సరం రూ 300 ల లో లభించిన ఈ స్టాక్ ... ప్రస్తుత పరిస్తితులలో రూ 150 /- ల లో లభిస్తూంది ... ఖచ్చితమైన పెరుగుదల ఈ స్టాక్ లక్షణం ... ఇటువంటి స్టాక్ ఇంత మంచి ధరలో లభిస్తున్నప్పుడు జమ చేసుకోవడం తెలివైన ఇన్వెస్టర్ చేయాల్సిన పని అని నా అభిప్రాయం ... ఇంకా తగ్గితే మరీ మంచిది ... కానీ షేర్ మార్కెట్ లో ఇంకా తగ్గినప్పుడు కొందాం ... బాగా పెరిగితే అమ్ముదాం ... అనుకోవడం కరెక్ట్ కాదనేది మనందరికీ అనుభవమైన సత్యం ...

సో ... బెస్ట్ అఫ్ లక్ ... to  బ్యాంకు అఫ్ ఇండియా ఇన్వెస్టర్స్ ...

మురళి 

14, ఆగస్టు 2013, బుధవారం

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు  ... స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

ముక్కలు ముక్కలు గ ఉన్న సంస్తానలను ఆక్రమించి  ఒకే దేశంగా , హిందూస్తాన్ గా, మార్చిన బ్రిటిష్ వారే, ఇండియా పాకిస్తాన్ గా విడిపోయిన ట్లు చేసుకున్న హిందూ , ముస్లిం మరియు ఇతర మతస్తుల కన్నా ... ఇప్పుడు ఉన్న రాష్ట్రాలను సైతం ముక్కలు చేస్తున్న వారికన్నా ... గొప్ప వారు .... అప్పటికీ ఇప్పటికీ మరి ఎప్పటికి మనం విదేశాలవారికి బానిసలమే ....

మనలను చూసి నేర్చుకున్న వారి నుండి మనం కొత్తగా నేర్చుకుంటున్నాం ... మంచిని కాదు ...

ప్రాంతాలను అభివృద్ధి చేయాలనీ చేయాలి ఉద్యమాలు ... రాష్ట్రాన్ని ముక్కలుగా చేసినంత మాత్రాన  ఒరిగేదేమీ లేదు సామాన్యుడికి ....

కుటుంబాలే విడి పోయి బాగుపడా లేదు .. జాతి విడిపోయి ఏమి ఉద్ధరిస్తుంది ...

జై సమైఖ్యాంధ్ర .... జై హింద్ ....

మురళి 

3, ఆగస్టు 2013, శనివారం

2, ఆగస్టు 2013, శుక్రవారం

ఆంధ్రా బ్యాంకు స్టాక్

ఈ రోజు ఆంధ్రా  బ్యాంకు స్టాక్ ధర రూ . 59 కన్నా తక్కువకి దిగి పోయింది .. ఈ రోజు ధరలో  ఒక లక్ష రూపాయల ఆంధ్ర బ్యాంకు షేర్ లు కొనగలిగితే .... 

  • లభించే షేర్ ల సంఖ్య ... 1694
  • ఇప్పటి వరకు ఇచ్చిన ప్రకారం వచ్చే సంవత్సరం కూడా డివిడెండ్ ఇస్తే లభించే డివిడెండ్ ... రూ . 8470
  • అంటే లక్ష రూపాయల పై వడ్డీ 8. 47% ... మామూలుగా బ్యాంకు fdr పై లభించే వడ్డీ కన్నా ఎక్కువ . 
  • లేదా ఇంత లోగా కనీసం రూ . 10 /- చొప్పున షేర్ కు పెరిగినా లభించేది రూ . 16940 . 00
  • అంటే వడ్డీ 16 % దాటి వస్తున్నట్టే ... 
 కాబట్టి ధర పెరిగినా లాభమే ... ఖర్మ కాలి పెరగక పోయినా లాభమే ... డివిడెండ్ తగ్గితే తప్ప .... ఛాన్స్ కోసం రిస్క్ తీసుకునే వాళ్ళైతే  ఆలోచించాల్సిన సమయం ... 

సో ... బెస్ట్ అఫ్ లక్ ...  

 
మురళి ...