ఎక్కడ మీ సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుందో ఎవరూ చెప్పలేరు ... రిస్క్ చేయలేని వారు బుద్ధిమంతు లల్లే సేవింగ్స్ ఎకౌంటు లోనో , ఫిక్స్డ్ డిపాజిట్ లోనో , పోస్ట్ ఆఫీసు సర్టిఫికేట్ ల ద్వారానో , లేదా మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ లోనో , దాచుకోవాలి ... ఇళ్ళూ , స్థలాలు కొనగలిగే స్తోమత ఉంటె గొడవే లేదు .. మరి ... కొద్దిగా రిస్క్ తీసుకుందాము ... ఎక్కువ కాలము ఓపిక పడదాము అనుకుంటే షేర్ మార్కెట్ ఇంకా ఈక్విటీ ఫండ్స్ లో డబ్బును పెట్టేయ వచ్చ్చు .
ఇదిగో ఈ సంవత్సర ఆరంభం లో, షేర్ గురు పత్రిక లో "వన్ టైం ఇన్వెస్ట్మెంట్ "పెట్టుకో మని ఇచ్చిన స్టాక్స్ వివరాలు మీ కోసం
మీరు పెట్టె పెట్టుబడి ఒకవేళ Rs. 10,00,000/- అయితే ఎలా ఎంత శాతం ఏయే స్టాక్స్ కు కేటాయించాలో చూడండి ...
1. మోజర్ బేయర్ - 5 లక్షలు విలువ గల షేర్లు (రికమెండ్ చేసినప్పుడు ధర రూ . 8. 95 , ప్రస్తుత ధర 11 . 80) - 50%
2. మొనేట్ ఇస్పాత్ & ఎనర్జీ - 1 లక్ష విలువ షేర్లు - రిక . ధర 49 . 65 - 10%
3. ఫోర్సు మోటార్స్ - 1 లక్ష - 10%
4. హైడేల్ బర్గ్ సిమెంట్ - 50 వేలు - 5%
5. జిందాల్ స్టీల్ & పవర్ - 50 వేలు - 5%
6. క్లారిస్ లైఫ్ సైన్స్ - 50 వేలు - 5%
7. బజాజ్ ఫైన్ సర్వ లి - 50 వేలు - 5%
8. H S I L Ltd. - 50 వేలు - 5%
9. సెట్ కో ఆటోమోటివ్ - 50 వేలు - 5%
ఇవన్నీ కలిపి న పోర్ట్ ఫోలియో ప్రస్తుతానికి , రికమెండ్ చేసిన నాటి నుండి పెరిగిన శాతం 20
సదరు పత్రిక నిర్వాహకులు సంవత్సరం పూర్తి అయ్యే లోపు దీని విలువ 100 % ఉంటుందని చెబుతున్నారు ...
పది లక్షలు కేటాయించా లేక పోయినా , మీరు పెట్టె పెట్టుబడి లో పర్సంటేజ్ మాత్రం పైన సూచించిన రీతిలో తీసుకోగలరు ....
నా సంగతి ఏమిటంటారా ? ఒక ఏభై వేలు పెట్టాను ... మధ్యలో ఏవి తగ్గితే అవి ఉన్న డబ్బును బట్టి కొంటూ ఉంటాను ... చూద్దాం ... కనీసం 30% వచ్చినా లాభమే కదా ...
మీ
మురళి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి