మా తేజస్విని రీసెంట్ ఫోటో ఇది ...
నిన్నటికీ ఈ రోజుకీ నా బ్లాగ్ కి ట్రాఫిక్ పెరిగింది ... ముఖ్యంగా ఐ సి ఐ సి ఐ డివిడెండ్ కి సంబంధించిన పోస్ట్ ఒక 20 మంది చూసారు ... ఓ కే ... అంటే నా పోస్ట్ వృధా కాలేదు ...
ఆంధ్ర బ్యాంకు డివిడెండ్ ...
ఉద్యమాల ఎఫెక్ట్ , రైతుల రుణ మాఫీ , ఎన్ పి ఏ ఎకౌంటు ల పుణ్యమా అని ప్రతి సంవత్సరం షేర్ కు ఐదు రూపాయల డివిడెండ్ ఇచ్చే ఆంధ్ర బ్యాంకు లాస్ట్ ఇయర్ ఒక రూపాయి పది పైసల తో సరిపెట్టింది ... ధర కూడా నేల మీద పాకుతూ పాతాళం లోకి జారుతూ అప్పుడప్పుడూ నేల నుండి అంగుళం ఎత్తు పైకి చూస్తూ ఎనభై రూపాయల గీత దాటడానికి ఇబ్బంది పడుతూ , ఇన్వెస్టర్స్ ను ఇబ్బంది పెడుతూ , చివరకు షేర్ కు రెండు రూపాయల డివిడెండ్ ప్రకటించింది . కాకపోతే దాని కం డేట్ ఎక్స్ డేట్ లు ఎప్పుడో తెలీదు .
మ్యూచువల్ ఫండ్ ...
బిర్లా సన్ లైఫ్ ఇండెక్స్ ఫండ్ ... బాగుంది ఈ ఫండ్ ... ఫిబ్రవరి లో యూనిట్ కి ఐదు రూపాయల డివిడెండ్ కూడా ఇచ్చారు ... డివిడెండ్ ఇచ్చాక దీని NAV ఇరవై రెండు రూపాయల నుండి పదహారు రూపాయలకు దిగింది అనుకోండి ... కాకపోతే ఈ ఫండ్ పోర్ట్ ఫోలియో బాగుంది ...
బ్యాంకింగ్ & ఫైనాన్సు , టెక్నాలజీ , ఆటోమోటివ్ , ఆయిల్ & గ్యాస్ , ఫార్మ మరియూ టొబాకో లకు సంబంధించిన మంచి కంపెనీలలో పెట్టుబడి పెట్టడం జరిగింది ... డిటైల్డ్ గా కావాలంటే ... మనీ కంట్రోల్ డాట్ కాం ... చూడండి ...
ఈ రోజు కి ఇంతే ...
బై