30, సెప్టెంబర్ 2016, శుక్రవారం

రేపు అక్టోబర్ మల్టిబ్యాగర్ స్టాక్స్ నుండి రికమండేషన్స్ ... ???

భారత్ పాక్ ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం చల్ల బడింది ... శత్రు దేశంపై మన వీర జవాన్లు పై చేయి సాధించారు ...  మంచి తనంగా ఉంటే చేతగాని తనంగా భావించి, రక రకాలుగా కవ్విస్తూ , ఉగ్రవాదులను మన దేశం పైకి ఎగదోస్తూ, రెచ్చగొట్టి ... రెచ్చగొట్టి ... ఆఖరికి మన సత్తా ని రుచి చూస్తే గాని శాంతించ లేక పోయారు ... ఇది ప్రారంభం మాత్రమే నని ... ఇరువురకూ తెలుసు ... ప్రస్తుతానికి అయితే చల్ల బడినట్టే ... 

... 

ఈ యుద్ధ వాతావరణపు మేఘాలు షేర్ మార్కెట్ ని కమ్మేశాయి ... స్టాక్ మార్కెట్ అకస్మాత్తుగా కుప్ప కూలింది ... కానీ ఎప్పుడైతే మేఘాలు చెల్లా చెదురుగా పారిపోయాయో , ఒక్క సారిగా మళ్ళీ స్టాక్ మార్కెట్ ఈ రోజు పుంజు కుంది ... 

నిన్న ఈ నెలకు ఱికమండేషన్స్ లేనట్టే అని ప్రకటించిన మన "మల్టిబ్యాగ్గర్ స్టాక్స్ డాట్ కో డాట్ ఇన్ " అమిత్  గోయంకా గారు  , వాతావరణం అనుకూలించే ధోరణికి చేరడంతో , రికమండేషన్స్ ఇవ్వడానికి సిద్ధ పడుతున్నారు  ... రేపు ... మరి వేచి చూద్దాం ... 

మురళి. 

29, సెప్టెంబర్ 2016, గురువారం

అక్టోబర్ మల్టీ బ్యాగర్ స్టాక్స్


మల్టీ బ్యాగర్ స్టాక్స్ డాట్ కో డాట్ ఇన్ లో ఈ రోజు ప్రచురించిన విషయం ఏమిటంటే అక్టోబర్ కోసం ఏ స్టాక్స్ నూ రికమెండ్ చేయడం లేదు ... 
వివరాలు క్రింద ... 

"We will not be recommending stocks for October due to the current Geo-political scenario as there is a risk of a war between India & Pakistan. Once, the situation improves, we will update. Sell all stocks recommended in September now."

సరిహద్దులో పెరుగుతున్న పాక్‌ కవ్వింపు చర్యలకు ధీటైన సమాధానమిచ్చేందుకు వీలుగా కేంద్ర కేబినెట్‌ భేటీ అయిన నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంకులు, రియల్టీ రంగాలు కుప్పకూలగా చిన్న షేర్లూ విలవిలలాడుతున్నాయి. 

కనుక ప్రస్తుతం సెప్టెంబర్ కోసం సూచించిన స్టాక్స్ లో మిగిలినవి ఏమైనా ఉంటె అమ్ముకోవడం లేదా తక్కువ ధరలో ఉంటె పెరిగే వరకు ఉంచేసుకోవడం చేయండి .... 

మురళి. 

24, సెప్టెంబర్ 2016, శనివారం

సెప్టెంబర్ మల్టి బ్యాగర్ స్టాక్స్ ని సమీక్షిద్దాం ... ఇంకా తరువాతి వారం షేర్ గురు స్టాక్ ....

ఒక్కసారి సెప్టెంబర్ స్టాక్స్ పరిస్థితిని గమనిస్తే ...  


స్క్రిప్ట్ పేరు - 1  /రికమెండ్ ధర-2  /కొన్న సంఖ్య - 3/కొన్న విలువ 4 /ముగింపు ధర 5మరియు విలువ 6 /
ఎక్కువగా పెరిగిన ధర 7 మరియు విలువ 8
వరుసగా చూసుకోండి 
---------------------------------------------------------------------------------------------------------------
               1                          2           3         4                  5               6                  7           8
---------------------------------------------------------------------------------------------------------------
బ్యాంకో ప్రొడక్ట్స్ ఇండియా /  212. 50 / 47 / 9987. 50 /    219. 85 / 10332. 95    /   227 / 10669 .00
దివాన్ హౌసింగ్               / 287. 80 / 34 / 9785. 20 /      292. 75 /  9953. 50    /   296 / 10064 .00
ఇండియన్ బ్యాంక్           / 227. 85 / 43  /  9797 . 55 /    213. 80 /  9193. 40   /    240 / 10320.00
కెమ్ ఫ్యాబ్ ఆల్కలీస్       / 262. 70 / 38 /  9982. 60   /    317. 80 /  12076. 40   /   333 / 12654.00

మొత్తం కొన్న విలువ -  39,552.85 (ఒక్కో స్టాక్ కు రూ . 10,000/- కేటాయిస్తే )
ముగింపు విలువ      - 41,556. 25 (అంటే లాభం రూ 2003/-;   5 శాతం )
ఎక్కువగా పెరిగిన విలువల ప్రకారం - 43,707. 00 (అంటే లాభం రూ 4,154/-;  10శాతం )


ఇక వచ్చే వారానికి షేర్ గురు స్టాక్ ... హైకాల్ లిమిటెడ్ ... 
వివరం క్రింద ..


      
బై
మురళి 

17, సెప్టెంబర్ 2016, శనివారం

ఈ వారం నుండి వచ్చే వారానికి ...

 షేర్ గురు వచ్చే వారానికి అందిస్తున్న స్టాక్ ...
రిచా ఇండస్ట్రీస్

స్టార్ సిప్ 
బి పి ఎల్ లిమిటెడ్ 

***

మల్టి బ్యాగర్ స్టాక్స్ లో "బ్యాంకో ప్రొడక్ట్స్ " 10 శాతానికి అటూ ఇటూ కదులుతోంది ... అమ్మేయాలనుకుంటే అమ్మేసుకోవచ్చు .  
కేం ఫ్యాబ్ కూడా 280 వరకూ వెళ్ళింది ... ఆ రేంజ్ లో అమ్మేసుకుంటే బెటర్ ... 
దివాన్ హౌసింగ్ కొంచెం కొంచెం గా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తోంది ... 
ఇండియన్ బ్యాంక్ ఇంకా ఎరుపులోంచి పచ్చదనం లోకి మారడానికి మారాం చేస్తోంది ... 

***

ఇంకేం సంగతులు ... ??? 
మీ దగ్గర ఏమైనా విశేషాలు ఉంటె కొద్దిగా నాకూ తెలియ పరచండి ... 

ఓ కె ... బై ... 
మీ 
మురళి ... 



13, సెప్టెంబర్ 2016, మంగళవారం

సెప్టెంబర్ మల్టి బ్యాగర్ స్టాక్స్ ...







ఇప్పటికే కొన్న వాళ్లకి లేదా ఇంకా కొనగలిగిన వారికి ... మంచి ఛాన్స్ ... 
బాగా తగ్గిన ధరలలో సెప్టెంబర్ మల్టి బ్యాగర్ స్టాక్స్ లభిస్తున్నాయి ... 

స్టాక్ మార్కెట్ డౌన్ అవ్వడం వలన ఈ అవకాశం . 

వినియోగించుకో గలిగితే మంచిది ... 


10, సెప్టెంబర్ 2016, శనివారం

షేర్ గురు .. ఈ వారం స్టాక్

***
ఎల్ డెకో హౌసింగ్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్
ప్రస్తుత మార్కెట్ ధర
685 రూపాయలు
***
బ్యాంకో ప్రొడక్ట్స్ ... 10% దాటి పెరిగింది ఈ వారం ... కానీ నిన్నటికి 5% కి దిగింది
డివిడెండ్ షేర్ కు 4 రూపాయల చొప్పున ఇస్తారంట ...
***
కేం ఫ్యాబ్ ప్రస్తుతానికి ఎరుపులో ఉంది ...
***
దివాన్ హౌసింగ్ మరియు ఇండియన్ బ్యాంక్ కోసం దిగులే అవసరం లేదు ...

***
రేపు సెప్టెంబర్ 11 మా తేజస్విని పుట్టిన రోజు ...
***
సెప్టెంబర్ 12 ప్రారంభ తేదీ మరియు 15 ముగింపు తేదీతో, 850 -860 రూపాయల మధ్య ధరల శ్రేణితో , కనీసం కొనవలసిన షేర్ల సంఖ్య 16 గా పబ్లిక్ ఇష్యూ "ఎల్ & టి టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ "
***
సెప్టెంబర్ 19 ప్రారంభ తేదీ మరియు 21 ముగింపు తేదీతో, 300 -334 రూపాయల మధ్య ధరల శ్రేణితో , కనీసం కొనవలసిన షేర్ల సంఖ్య 44 గా పబ్లిక్ ఇష్యూ "ఐ సి ఐ సి ఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ "
***

మురళి ఈ రోజు వ్రాసేది ఇంతే ... 

8, సెప్టెంబర్ 2016, గురువారం

క్షమించు గణేశా ...


వినాయక చవితి రోజు మా ఆఫీస్ లో నెట్టూ పని చేయలేదు ... ఇంట్లో నెట్ బాలన్స్ అయిపోయింది ... ఏదో ఫోన్ లో నెట్ ఫెసిలిటీ ఉండటం వల్ల పేస్ బుక్ లో ఐతే శుభాకాంక్షలు చెప్పేసాను కానీ బ్లాగ్ మిత్రులకు చెప్పడం మర్చిపోయాను ... ఇదిగో ... మా తేజస్విని స్వయంగా తయారు చేసిన వినాయక విగ్రహం ... మరియు నా వినాయక చవితి శుభాకాంక్షలు ... ఆలస్యంగా అందిస్తున్నందుకు క్షమించాలి మిత్రులూ మరియు గణేషుడూను ... 

6, సెప్టెంబర్ 2016, మంగళవారం

మ్యూచువల్ ఫండ్ కు ఇన్సూరెన్స్ తోడైతే ...

బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ లో సెంచురీ సిప్ 
రక్షణ మరియు సంపద సృష్టి ఈ రెండూ ఎటువంటి పెట్టుబడి దారుడైనా కోరుకునేవి ...

అయితే రక్షణ కోసం ఇన్సూరెన్స్ మరియు సంపద సృష్టి కోసం మ్యూచువల్ ఫండ్స్ ను ఆశ్రయించాలి ... 

మరి ఈ రెండు ఒకే చోట దొరికితే ... దాని పేరు బిర్లా సన్ లైఫ్ వారి సెంచురీ సిప్. 

సంపద సృష్టి 
క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘ కాలం కొనసాగడం వల్ల మంచి రాబడులు పొందడానికి అవకాశం ఉంటుందని మన అందరికీ తెలిసిన విషయం . మరి దీనిలో రక్షణ అంటే బీమా దీర్ఘ కాలపు పెట్టుబడి దారులకు లభిస్తే, అదనపు ప్రయోజనం పొందే అవకాశం ఉన్నట్టే కదా ... 

రక్షణ 
బిర్లా సన్ లైఫ్ లో సెంచురీ సిప్ దీర్ఘ కాలపు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు, నెలవారీ క్రమానుగత మొత్తానికి 100 రేట్ల వరకూ బీమా రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు ... 

ఈ అవకాశం ఎవరికీ మరియు ఎలా ?

ప్రతి నెలా ఖచ్చితంగా క్రమం తప్పకుండా, మర్చి పోకుండా సిప్ చేయాల్సిందే ... కానీ 45 సం . లోపుగా అయితే ప్రమాద బీమా మాత్రమే వర్తిస్తుంది ... మొదటి సంవత్సరం లో అనుకోని సంఘటన జరిగితే నెలవారీ వాయిదా కు 10 రెట్లు బీమా లభిస్తుంది ... అదే రెండవ సం. లో 50 రెట్లు ; మూడవ సంవత్సరం లో లేదా తరువాత నుండి అయితే 100 రెట్లు బీమా మొత్తం నామినీ కి లభిస్తుంది ... ఫండ్ విలువ తో పాటుగా ...  

ఇందు కోసం పెట్టుబడి దారుడు సి సిప్ లో ఎన్ రోల్ చేసుకొనవలసి ఉంటుందిది మరియు "Declaration of Good Health " ఇవ్వ వలసి ఉంటుంది 

మరిన్ని మరియు ఖచ్చితమైన వివరాల కోసం మీ దగ్గరలో గల బిర్లా సన్ లైఫ్ అడ్వైజర్ ను సంప్రదించి, ముందుకు సాగండి ... 

మురళి .... 


3, సెప్టెంబర్ 2016, శనివారం

షేర్ గురు స్టాక్

ఈ వస్తున్న వారానికి షేర్ గురు స్టాక్

జె కె సిమెంట్ లిమిటెడ్ 

ప్రస్తుత మార్కెట్ ధర ... రూ 796 /-


...