నమస్కారం !
మొదటగా ఈ వారం షేర్ గురు స్టాక్ ...
నోసిల్ లిమిటెడ్ - ప్రస్తుత మార్కెట్ ధర రూ 65 /-
స్టార్ సిప్ - కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ కంపెనీ లిమిటెడ్
...
మన మల్టిబ్యాగర్ స్టాక్స్ కూడా ఈ పెద్ద నోట్ల రద్దు ప్రభావానికి గురి కావడం జరిగింది
మొత్తం మార్కెట్ డౌన్ లోనే ఉంది ...
...
ఈ మధ్య సరదాగా ఎస్ బ్యాంక్ స్టాక్ పై ఒక ప్రయోగం చేశాను ... ఇది చాల మందికి తెలిసే ఉంటుంది ... ఆ ప్రయోగం ఎదో సినిమా లో బ్రహ్మానందం అన్నట్టుగా "అందితే ఆంధ్రా బ్యాంకు ... కుదరక పోతే కృషి బ్యాంక్ " లాంటిది .. నేనైతే దానికి పెట్టిన పేరు " వీలైతే ఇంట్రా డే ... కుదరకపోతే డెలివరీ ట్రేడింగ్ "
దీని కోసం ఒక అరవై వేలు ఉపయోగించుకోవడం జరిగింది ... నవంబర్ ఒకటి నుండి రోజుకు పదివేల రూపాయల తో ఆ ప్రయోగం ...
ప్రతి రోజు మార్కెట్ ప్రారంభానికి ముందే ఒక పది వేల రూపాయల తో ఎన్ని వస్తే అన్ని ఎస్ బ్యాంక్ షేర్స్ కొనడం జరిగింది ... మార్కెట్ ప్రారంభమయ్యాక ప్రారంభ ధరతో కొనబడిన స్టాక్ ధరకు 0. 5% (ఏభై పైసల శాతం) కలిపితే ఎంత వస్తుందో అంత ధరకు "సెల్" ఆర్డర్ పెట్టేసి నా నిత్య కృత్యాలలోకి వెళ్లిపోవడం జరిగింది ... మళ్ళీ సాయంత్రం వరకు దాని జోలికి వెళ్లనక్కర లేదు ... ఎందుకంటే నేను బయ్ చేసింది "ఇంట్రా డే" లో కాదు కదా ... "డెలివరీ ఆర్డర్ " లోనే ... కాబట్టి అది అమ్మినా, అమ్మక పోయిన పట్టించుకోనవసరం లేదు ...
ఒకవేళ అమ్మిందను కుందాం ... ఇంట్రా డే బ్రోకరేజ్ మాత్రం తగ్గించు కొని మిగిలిన మొత్తం మన ఖాతా లోకి జమ అవుతుంది ... అమ్మకం జరగలేదనుకోండి ... అప్పుడు ఆ మొత్తం మన డీమ్యాట్ ఖాతా లోకి స్టాక్స్ రూపంలో జమ అవుతుంది ... అది పెరిగినప్పుడు బ్రోకర్ శాతం చూసుకొని అమ్ముకోవాల్సి ఉంటుంది ...
సాధారణంగా ఇలా డీమ్యాట్ లోకి జమ అయిన స్టాక్స్ లో ఎక్కువ శాతం నెలాఖరులోగానే అమ్ముకోగలుగుతాం ... లేకపోతే లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చు ... ఉదాహరణకు ఎస్ బ్యాంక్ స్టాకును చూదాం ...
నవంబర్ ఒకటో తారీఖున ఎస్ బ్యాంకు స్టాక్ ప్రారంభ ధర 1275 రూ ; పది వేలతో 7 సంఖ్య లో కొనుక్కోగలిగాం ... 1275 కు అర్థ రూపాయి శాతం కలిపితే 1281. 38 కి అమ్ముకోవాలి ... కానీ ఆ రోజు ఆ స్టాక్ ఎక్కువగా పెరిగిన ధర 1275 మాత్రమే ... దీనిని లాంగ్ టర్మ్ కోసం ఉంచేశాం ...
నవంబర్ రెండో తారీఖున ఎస్ బ్యాంకు స్టాక్ ప్రారంభ ధర 1240 .15 రూ ; పది వేలతో 8 సంఖ్య లో కొనుక్కోగలిగాం ... 1240 . 15 కు అర్థ రూపాయి శాతం కలిపితే 1246. 35 కి అమ్ముకోవాలి ... కానీ ఆ రోజు ఆ స్టాక్ ఎక్కువగా పెరిగిన ధర 1240 . 15 మాత్రమే ... దీనిని ముందు రోజు కొన్న 7 స్టాక్స్ కు చేర్చి లాంగ్ టర్మ్ కోసం ఉంచేశాం ...
నవంబర్ మూడో తారీఖున ఎస్ బ్యాంకు స్టాక్ ప్రారంభ ధర 1203 .10 రూ ; పది వేలతో 8 సంఖ్య లో కొనుక్కోగలిగాం ... 1203 . 10 కు అర్థ రూపాయి శాతం కలిపితే 1212. 13 కి అమ్ముకోవాలి ... ఆ రోజు మనం అనుకున్న ధర కన్నా బాగానే పెరిగింది ... కాబట్టి రూ 48 . 24 లాభం వచ్చింది కాకపోతే బ్రోకరేజ్ ఇందునుండి తగ్గించాలి కదా ... సగమే వచ్చిందనుకుందాం .. అంటే లాభం 24 . 12 అనుకోండి
ఈ విధంగా మొత్తం 18 రోజులలో 9 రోజులు అదే రోజు అమ్మకం (ఇంట్రా డే లా అన్న మాట) జరిగి రూ 426 . 51 వచ్చింది ... బ్రోకరేజ్ పోనూ రూ 213 అనుకోండి ... 9000 రూపాయలకు 213 రూపాయలు ... అంటే 2 % ... ఒక నెలలో ... (ఇంకా నెల పూర్తి కాలేదు)
మరి డీమ్యాట్ లో ఉన్న స్టాక్స్ మాటేమిటి ?
మూడు రోజులకు అమ్మకం కానీ స్టాక్స్ మొత్తం 23 వచ్చాయి ... ఒకటి, రెండు మరియు నాలుగు తారీఖులవి ... వాటి సరాసరి విలువ 1239 . 92 వచ్చింది ... ఒకవేళ 3 % లాభం బ్రోకరేజ్ తో పాటు అనుకుంటే అమ్మాలనుకున్న విలువ 1277 . 12 .. పదో తారీఖున చేరుకుంది ... 855 . 55 రూపాయలకు అమీసుకోవడం జరిగింది ... లాభం సగం అనుకుంటే 427 . 77 రూపాయలు ... ముప్పై వేల రూపాయలకు . ... 1. 43% లాభం అన్నట్టు ...
ఈ రకంగా డీమ్యాట్ లో ఇంకా మిగిలి పోయిన స్టాక్స్ పదవ తేదీన కొన్న 8 స్టాక్స్ ... వీటిని అమ్మకపు విలువ వచ్చేవరకు పక్కన పెట్టుకోవాలి ... తరువాత అదే రోజు అమ్మని స్టాక్స్ ను కలుపుకొంటూ తరువాత పెరిగినప్పుడు అమ్ముకోవాలి ...
ఈ విధమైన ట్రేడింగ్ లో మన దగ్గర ఉన్న మొత్తం సొమ్ములో ప్రతి రోజు ఉపయోగించే సొమ్ము ఆరో వంతు కన్నా ఎక్కువగా మాత్రమే ఉండాలి ... అంటే అరవై వేలు మన దగ్గర ఉంటె రోజుకు పది వేలు మాత్రమే ఉపయోగించాలి ... ఇంకా ఇబ్బంది లేకుండా ఉండాలంటే పదో వంతు వాడితే నో టెన్షన్ ...
ఇది కేవలం మన దగ్గర ఉన్న సొమ్ము నిత్యం రొటేషన్ అవ్వడానికి మాత్రమే ... మొత్తానికి 12 % pa వడ్డీ మినిమమ్ గ్యారంటీ .. మాగ్జిమమ్ అనేది మన కృషి ... అదృష్టం మీద ఆధార పడి ఉంటుంది ...
స్టాక్ మార్కెట్ లో ఆరి తేరిన వారు ఎటువంటి ప్రయోగం అయినా చేస్తారు ... నా లాంటి కొత్త వాళ్లకు "నో రిస్క్ ... నో లాస్" సిస్టం ఇది ... ముఖ్యంగా స్టాక్ మార్కెట్ పై భయాలు , అపోహలు ఉన్న వాళ్ళు ఈ పధ్ధతి పాటిస్తే సమస్య ఉండదు ...
ట్రై చేయండి ... పోయేదేమీ లేదు ... మహా అయితే లాంగ్ టర్మ్ కు మిగలటం తప్ప ....
.....
నేనే ...
చాలా చక్కగా చెప్పారు,ఎప్పటినుండో ఈ విధానం ప్రయత్నించాలని అనుకుంటూ కూడా సరిగా తెలియక ప్రయతించలేదు,మీ టపా తో కాస్త ధైర్యం వచ్చింది.
రిప్లయితొలగించండిThank you...
రిప్లయితొలగించండిDHANQ
రిప్లయితొలగించండి