మన దినచర్య గ్రంధం లో (డైరీ) ఒక్కో సంవత్సరానికి ఒక్కో ప్రత్యేకతను ఆపాదించి ... ఈ సంవత్సరం ఇలాంటిది ... పోయిన సంవత్సరం అలాంటిది .. నా జీవితానికి ఈ సంవత్సరం మలుపు ... వచ్చే సంవత్సరం గెలుపు ... ఇంకా రాబోయే సంవత్సరం సలుపు .. అంటూ ఏవేవో రాస్తుంటాం ... ఏ ఒక్కరి డైరీ లో ఏ సంవత్సరం ఒకేలా ఉండదు ... ఒకరిని ఆనందంలో ముంచెత్తే సంవత్సరం, మరొకరికి విషాదం అందించ వచ్చు ... ఇంకొకరికి తీపి గురుతులు జ్ఞాపకాలుగా ఉండే సంవత్సరం ... వేరేవారికి భయంకరమైన అనుభవాలను చవి చూపించ వచ్చు ... సాధారణంగా "ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేనిది ", లేదా "ఇటువంటి అనుభవం మరోసారి రాకూడదు " ఇలాంటి వాక్య ప్రయోగాలు డైరీలలో సర్వ సాధారణం ... కానీ 2016 లో అందరి డైరీలను ఆక్రమించే పేరు ... ఒకరి ఇంట్లో కాదు ... ఒక వీధిలో కాదు ... ఒక ఊరిలో కాదు ... ఒక జిల్లా, ఒక రాష్ట్రము , .... అని కాకుండా ... మొత్తం భారత దేశం ప్రజ అంతా ... ఈ సంవత్సరం ... ముఖ్యముగా ... ఈ నవంబర్ ... పొగుడుతూనో , తిడుతూనో ... ఎదో ఒక విధంగా ... సంచలనం సృష్టించిన పేరు ... ఆశ్చర్య చకితులను చేసే పేరు .. ఆనందింపచేసే పేరు ... భయపెట్టే పేరు ... పిచ్చేక్కించే పేరు ... ఒకటే ... మోడీ ....
నేను సాధారణంగా నా జూనియర్స్ తో అంటూ ఉంటాను ... నేను పాత కాలానికి, కొత్త కాలానికి మధ్య వారధి లాంటి వాడిని ... అని ... నా ముందు వేరు, నా తరువాత వేరు ... అని , 7వ తరగతి నుండి 8 వ తరగతి కి మారే తప్పుడు గణిత శాస్త్రం రెండుగా విడిపోయిన చివరి బ్యాచ్ నాదే ... అదే కాంభోజిట్ మ్యాథ్స్ లేదా జనరల్ మ్యాథ్స్ ... నేను వెళ్లే ప్రతి క్లాస్ సిలబస్ నేను దాటగానే మారిపోయేది ... అంటే నా పుస్తకాలు కిలోల లెక్కన అమ్ముకోవడానికి తప్ప నా జూనియర్స్ కు రిఫరెన్స్ గా కూడా పని చేసేవి కావు ... అలాగే టైపింగ్ స్పెషల్ క్వాలిఫికేషన్ గా గుర్తించింది నా కన్నా ముందు బ్యాచ్ వాళ్లకు మాత్రమే ... నేను టైపింగ్ నేర్చుకున్నాను ... అంతే ... కంప్యూటర్స్ ప్రవేశించాయి ... టైపిస్ట్ అనే ఒక ప్రత్యేక ఉద్యోగి ఉండేవాడు అని ఇప్పటి తరానికి చెప్పినా నమ్మదేమో అన్నంతగా ఈ డబ్బాలు మనిషి ఆఫీస్ లలోకి చొచ్చుకు వచ్చేసాయి ... మౌస్ లేకుండా కంప్యూటర్ ఉపయోగించిన చివరి బ్యాచ్ లో నేనూ ఒకడినే ... టెలిఫోన్ ద్వారా వేరే వారికి కాంటాక్ట్ చేయాలంటే , ఫోన్ చేయగానే టెలిఫోన్ ఆపరేటర్ "నెంబర్ ప్లీజ్" అని అడిగి, నెంబర్ తీసుకుని కనెక్ట్ చేసే కాలం నుండి ... పేజర్ యూజర్ ... ను దాటుకుని ... క్షణం లో ఏ దేశంలో ఉన్నవారితో నైనా తెరపై ముఖం చూస్తూ మాట్లాడే కాలం వరకు ఎన్ని మార్పులు ? ఇన్ని మార్పులూ ఒక ఎత్తైతే ... ఇప్పుడు మోడీ లాంటి ప్రధాని తీసుకున్న నిర్ణయానికి ప్రత్యక్ష సాక్షులలైనా కోట్ల జనాభాలో నేనూ ఒకడిని ... అని నా తరువాతి తరానికి చెప్పగలి గినంత గర్వం గా ఫీలయ్యే మార్పు ఇది ... ఇది నా వ్యక్తిగత భావన ... ఇదే కానీ సత్ఫలితాలిస్తే , ఇదే కానీ చిత్త శుద్ధితో కొనసాగించ గలిగితే, ఇదే కానీ వెనకడుగు వెయ్యకుండా ... ముందుకు పోగలిగితే ... నేనే కాదు ... నా ఈ తరంలో ఉన్న వారందరూ , ఇప్పుడు శాపనార్థాలు పెడుతున్న వారందరూ , తమ తమ వారసులకు ... మన తాతలు "నేను గాంధీ గారిని చూసాను " అని చెబితే మనం ఎలా ఫీలయ్యే వారమో , అలా నేను "మోడీ " ప్రధాన మంత్రిగా ఉండగా జీవించాను అని సగర్వంగా చెప్పుకో గలిగినంత సాహసోపేత మైన నిర్ణయం ... అసలు ఎవడికి ఇటువంటి మొండి ధైర్యం ఉంటుంది ? దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి ? ఇది రాజకీయ కుతంత్ర నిర్ణయమా ? అగ్ర రాజ్యాలకు తలొగ్గి తీసుకున్న నిర్ణయమా ? ధనవంతుడికి కొమ్ము కాసే నిర్ణయమా ? లేక నిజంగానే పేదవాడి పెదాలు కీర్తించే, కన్నీళ్లు తుడిచి, గుండెల్లో ఆశలు నింపే నిర్ణయమా ?
ఏది ఏమైనా కానీ ... ఇలాంటి ఒక విస్ఫోటనా భరితమైన నిర్ణయంతో, ఆత్మ హత్యా సదృశమైన సాహసం తో ముందుకు పోయే నాయకుడు ... ఏ కారణం వల్ల నైనా కానీ ... ఒక అవసరం ... ముందునుండి ప్రణాళిక లేదని కొందరు అనవచ్చు ... ప్రజలు క్యూ లలో చచ్చి పోతున్నారని తిట్టుకో వచ్చు ... నల్ల కుబేరులు తప్పించు కున్నారు .. పేద మధ్య తరగతి వారే ఇబ్బందులు పడుతున్నారని అనవచ్చు ... ఇంకా ఎన్నాళ్ళు ఈ బాధ అనుకోవచ్చు ... ముప్పాతిక శాతం నిరక్షరాస్యులున్న దేశంలో కాష్ లెస్, ఆన్ లైన్ బ్యాంకింగ్ అసాధ్యం అనుకోవచ్చు ... కొనుగోళ్లు నిలిచి పోయి వ్యాపారాలు బావురు మంటున్నాయి అని అనుకోవచ్చు ... ఇలా ఎన్నైనా ,, అనుకోవచ్చు ... అనుకోవచ్చు ... దెబ్బ తగిలితే ఎదో ఒక ఎక్ష్ప్రెషన్ ఇవ్వాలిగా ... అబ్బా అనో , అమ్మ అనో అనుకోమా ? కాబట్టి బాధ అనుభవించే వారికి తిట్టే హక్కు ఉంటుంది ... కానీ ... కానీ ... తప్పదు ... ఘర్షణ లేనిదే మార్పు రాదు ... నొప్పి లేనిదే జీవి పుట్టదు ... శస్త్ర చికిత్స చేయనిదే రోగం తగ్గదు ... అందుకే నేనైతే ఈ చర్యను స్వాగతిస్తాను ... నేనూ క్యూ లో ఇబ్బంది పడ్డాను ... ఇతరుల ఇబ్బందులూ చూసాను ...
అయితే ...
ఇంత చేస్తే, ఈ తిట్టే జనం .... ఇబ్బంది పడే జనం ... సాధారణ జనం లో చాలా మంది , బ్యాంకుల వాళ్ళే కానివ్వండి ... ఉద్యోగులే కానివ్వండి ... రైతులే కానివ్వండి ... కూలీ నాలీ చేసుకునే వారే కానివ్వండి ... బడా బాబుల నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మారడానికి తమ వంతు కృషి చేశారన్నది కూడా ... చూ .... శా ... ను ... ,చూస్తున్నాను ...
సరే ... ఇవాళ డబ్బు కొరత ... రేపు డబ్బు వస్తే ... తగినంత డబ్బు వస్తే ... మళ్ళీ నల్ల డబ్బు పేరుకుపోదా ? దానికి సమాధానం "నగదు రహిత లావాదేవీలు "
ఒక్కసారి ఆలోచించండి ... మొత్తం డబ్బు ... అయితే బ్యాంకుల్లో, లేకపోతే స్థిరాస్తుల్లో, లేక స్టాక్ మార్కెట్ లో , ఉంటె ... మొత్తం లావాదేవీలు నగదు రహితంగా జరిగితే ... ? ... టాక్స్ ఎగ్గొట్టే అవకాశం ఉండదు ... అందరూ పన్నులు కడితే ? ... ఇన్ని పన్నులు ,, ఇంతింత పన్నులు అవసరం ఉండదు ... అలాగే పన్నులు తగ్గితే అందరూ టాక్స్ లు కట్టడానికి సిద్ధ పడతారు ... అంటే నో టాక్స్ లెస్ అమౌంట్ ... అంటే నో నల్ల డబ్బు ...
నేను ఉద్యోగంలో చేరే సమయం లో సేల్స్ టాక్స్ 4% ... ఇప్పుడు 14. 5%.... ఎవ్వడూ మాట్లాడ లేదు ... ఏ పత్రికా ప్రజలను జాగృత పరచలేదు ...
ఎన్ టి ఆర్ ... మద్యనిషేద సమయం లో ప్రారంభమైన సర్వీస్ టాక్స్ 10 శాతం నుండి , కొన్ని సర్వీస్ ల కె పరిమితమై ఉన్న ... సర్వీస్ టాక్స్ ... ఇప్పుడు 15 %, ఇది అన్ని సర్వీస్ లకీ ... ... ఈ విషయాన్నీ ఎవడూ సీరియస్ గా తీసుకోలేదు ... ఏ టి వి 9 .. వివరించలేదు ...
ఏ సామాన్య ప్రజా, ఏ నాయకుడిని అడగలేదు ... ఎందుకంటే ఆ నొప్పి ఇన్ డైరెక్ట్ ... మరి ఇప్పుడు ... ఈ నొప్పి డైరెక్ట్ ... అందుకే ఈ బాధ ... ఏ బాధైనా మనం అనుభవించి తీరాలి ... అది మన జన్మ హక్కు ... బాధ తీరాక , హాయి కలుగుతుందనే ఆశావహ దృక్పధంతో బ్రతకాలి ... బ్రతుకుని వెళ్లదీయాలి ... మంచైనా ... ముంచేదైనా ... మార్పుని ఆహ్వానించి తీరాలి ... ఇది ఒక ప్రకృతి విపత్తు అనుకోండి ... ఇది ఒక విలయం అనుకోండి ... మళ్ళీ ఎప్పటికైనా మాములు వాతావరణం వస్తుంది కదా ... ఇదీ అలాగే ... కాకపోతే మరింత మంచి వాతావరణం ... మంచి రేపు ... మంచి ఆలోచనలు ... మంచి నమ్మకం ...
...
ఈ మధ్య స్టాక్ మార్కెట్ కు మాత్రమే పరిమితం చేసానీ బ్లాగ్ ని ... కానీ ఈ పేస్ బుక్ లో పోస్టింగ్స్, టి వి లలో వార్తలు , పేపర్ లో సెటైర్లు , ఇవన్నీ చూసి చిరాకేసి వెళ్లగక్కానిది ...
ఈ రోజు ఎవడో పంపించాడు వాట్స్ అప్ లో ... "ఎవడో టీ తాగి ... 8 రూపాయల చెక్కిచ్చాడంట ... ఎందుకిలాంటి ఫేక్ పోస్ట్ లు ... ఫేక్ ది కాకపోతే మరేమిటి ... చెక్ లో అకౌంట్ నెంబర్ లేదు మరి ... అది చూసి మండి , వ్రాశానిది ...
వీలైతే సమర్ధించు ... లేదా విమర్శించు ... విమర్శించడానికి బోలెడన్ని కారణాలుంటాయి ... అబద్దాలను సృష్టించాల్సిన అవసరం లేదు ... నిజం గానే ఈ చర్య వల్ల ఇబ్బంది పడుతున్న వారు కోకొల్లలు ... వారి గురించి చెప్పు ... లేదా దీనికి పరిష్కారం సూచించు ... ఇంకా ఎడ్యుకేట్ చేయగలిగితే మరీ మంచిది ... ఎక్కడో తుఫాన్ వస్తే ఒక రోజు జీతాలను త్యాగం చేయట్లేదూ ... అలాగే ... సహాయం చేయగలిగితే ... మరీ మంచిది ...
చాల ఎక్కువగా రాసేసాను ... ఇక చాలు ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి