28, జనవరి 2017, శనివారం

షేర్ గురు ... స్టాక్ ....

ఈ వారం షేర్ గురు ...  స్టాక్ ....

ది ఇండియన్ హ్యూమ్ పైప్  కంపెనీ లిమిటెడ్

ధర 369 రూపాయల లో ... 

27, జనవరి 2017, శుక్రవారం

ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు ...

మల్టి బ్యాగర్ స్టాక్స్ డాట్ కో డాట్ ఇన్ లో కొత్త స్టాక్స్ సూచించబడ్డాయ్ ... 

అవి ఏమనిన ... 

1 గుజరాత్ హెవీ కెమికల్స్ లిమిటెడ్  ... ధర 282 రూపాయలలో ... 
2 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ... ధర 385 లలో ... 
3 ప్రెసిషన్ వైర్స్ ఇండియా ... ధర 124 ల లో ... 
4. సర్దా ఎనర్జీ & మినరల్స్ ... ధర 250 లలో ... 

https://multibaggerstocks.co.in/monthly-multibagger-stocks

 ఇంతకు ముందు సూచించిన స్టాక్స్ మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ... కాబట్టి వాటిని కొనసాగించ వచ్చు ... లేదా సరి ఐన ధర రాగానే అమ్మేయ వచ్చు ... 

... 

వీటితో పాటు ఎస్ బ్యాంక్ తగ్గుతున్నపుడల్లా కొంటూ, దీర్ఘ కాలం కోసం ఉంచడమో లేక సంతృప్తికరమైన ధర లభించినప్పుడు అమ్ముతూ, మళ్ళీ తగ్గినప్పుడు కొంటూ ... ఉండటమో చేస్తుంటే మనీ రొటేషన్ అవుతుంది ... లేదా ఇంతకుముందు పోస్ట్ లో చెప్పినట్టుగా "వీలైతే ఇంట్రా డే ... కుదరకపోతే డెలివరీ " పధ్ధతి పాటిస్తే ... కాస్త ఉత్సాహ భరితంగా ముందుకు పోవచ్చు ... 

2016 - 17 కాలం లో ఎస్ బ్యాంక్ స్టాక్స్ పరిశీలిస్తే  ఒకే రోజు పెరిగిన శాతం క్రింది విధంగా ఉంది ... 

** 2. 2 % - 22 సార్లు ... అంటే సగటున నెలకు 1 అన్న మాట ... 
** 2 % - 42 సార్లు ... అంటే నెలకు 3 సార్లు 
** 1. 5% - 53 సార్లు ... అంటే నెలకు 4 సార్లు 
** 1 . 2% - 75 సార్లు ... నెలకు 6 సార్లు 
** 1% - 99 సార్లు ...  నెలకు 8 సార్లు 
** 0 . 7%  - 132 సార్లు .. నెలకు 11 సార్లు 
** 0 . 5% - 146 సార్లు ... నెలకు 12 సార్లు 

ప్రతి నెలా ఒకేలా ఉండాలని రూలేం లేదు ... అలాగే ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఉండాలనీ రూల్ లేదు ... 
ఇది కేవలం రిఫరెన్స్ మాత్రమే ... 
ఇది నైపుణ్యం కల వారి సూచనా కాదు ... సాంకేతిక విశ్లేషణ, మౌలిక విశ్లేషణా లాంటిది కాదు ... బాలన్స్ షీట్ నో, ఇయర్  లీ రిటర్న్స్ నో ఆధారంగా చేసుకుని వ్రాసినది కాదు ... 

కేవలం నా పరిశీలనా ఫలితం మాత్రమే ... 

మురళి .  





25, జనవరి 2017, బుధవారం

బ్లాగ్ మిత్రులందరికీ గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ... 

ఇంకా 

విశాఖ నగరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటం ప్రశాంతంగా జరగాలని, ఈ సారైనా ఈ వేడి కేంద్రాన్ని తాకాలని, హోదా ఇవ్వక పోయినా, ప్యాకేజ్ తో సరిపెట్టుకొని నవ్యంధ్ర నిర్మాణం కోసం శ్రమిస్తున్న ప్రభుత్వానికి మంచి జరగాలని , నిజంగా చిత్తశుద్ధి తో కాకుండా , రాజకీయం చేయడం కోసం ఈ పోరాటాలు, నిరసనలు చేసేవారికి మాత్రం గుణపాఠం కావాలని 

మనస్ఫూర్తిగా కోరుకొంటూ ... 

మురళి 

21, జనవరి 2017, శనివారం

క్యాష్ లెస్ ... తుస్సేనా ?

తేజస్విని ఫోటో ఆల్బమ్ నుండి ... 

ఈ వారం షేర్ గురు స్టాక్ ... 
జె బి ఎం ఆటో లిమిటెడ్ ... 254 రూపాయలు 
రేపటి స్టార్ సిప్ 
డ్యూక్ ఆఫ్ షోర్ లిమిటెడ్ 

... 

"ఈ దేశానికి ఏమయింది ?  ఒక ప్రక్క మార్పు కోసం ప్రయత్నం ... మరో వైపు తిరోగమనం కోసం పోరాటం ... 
అందరూ మాట్లాడేవారే ...  ఈ పనికిమాలిన కబుర్లకు పాడాలి చరమ గీతం ... "

ప్రధాన మంత్రి పెద్ద నోట్లను రద్దు చేసిన రోజు రాత్రి ... నేనైతే చాలా సంతోషించాను ... ఇది నగదు రహిత వ్యవస్థ కు నాంది అని అనిపించడం వల్ల ... 

నా భార్య అయితే ఆ రోజు నుండి మోడీ గార్ని తిట్టిపోస్తూనే ఉంది ... నాకు తెలియకుండా ఎంత డబ్బు దాచిందో కానీ ... ఆ రోజు నుండి నిన్న మొన్నటి వరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉంది ... ప్రతి రోజూ మా ఇద్దరి మధ్య ఈ విషయమై గొడవే ... ఇలా ప్రతి చోటా నోట్ల రద్దును సమర్ధించే వారు  కొందరైతే , వ్యతిరేకించే వారు మరి కొందరు ... విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ చర్య వల్ల జరగబోయే పరిణామాలను గురించి ప్రజలను చైతన్యపరచ వలసిన మీడియా ... జనాలను రెచ్చ గొట్టే కార్యక్రమాన్ని భుజాల కెత్తుకుంది ... ముఖ్యంగా టి వి 9 , కాస్త ఏ బి ఎన్ ... మిగిలిన మీడియా మరి కాస్త ... తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ... 

రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు, వ్యాపారస్తులు విమర్శించారంటే అర్థం ఉంది ... సమ సమాజం ... మెరుగైన సమాజం, అంటూ గొంతు చించుకుని పత్రికా లోకం ... చెప్పడం వరకేనా ? చేయడం ... చేసే వారికి చేయూత నివ్వడం ఉండదా ?   

ఒక పక్క భజన బృందం ... మోడీ గారు ఏమి చేసినా నమో నమో అంటుంది ... మరోప్రక్క వ్యతిరేక వర్గం ఏమి చేసినా ... ఇది ఇందుకే ... అది అందుకే అంటూ కారణాలను కనిపెడుతుంది ... మధ్యలో నాలాంటి సగటు జీవికి ఏమి చేయాలో అర్థం కావడం లేదు ... మాకు తెలిసిందల్లా ఒకటే ... క్యూ లో ఎక్కువ సేపు నుంచో వలసి వస్తుంది ... బ్యాంకు నుండి డబ్బు డ్రా చేయడానికి తలా ప్రాణం తోకకు వస్తుంది ... పోనీ ఆన్ లైన్ లో చేద్దామనుకుంటే బ్యాంక్ ఛార్జెస్ బాదుడు ... ఒక్కో దగ్గర స్వైపింగ్ మెషిన్ లు మా వల్ల కాదంటూ మొరాయించడం ... మానేయగలిగినవి మానేసాం ... వాయిదా వేయగలిగినవి వాయిదా వేసాం ... తప్పని సరి పరిస్థితుల్లో చేయవలసినవి ఏమైనా ఉంటె ... ఏదో మార్గాన్ని పట్టుకుని చేసేశాం ...  500 రూపాయలు రాగానే 90 శాతం సమస్య పరిష్కారమైపోయింది ... మామూలుగానే నగదు సహిత లావాదేవీలు అయిపోతున్నాయి ... 

మరి ఇంతకీ నల్ల డబ్బు రాకుండా రావడానికి కదా ఈ నోట్ల రద్దు కార్యక్రమం ... ఇంత వరకూ ఉన్న డబ్బు చాలా వరకు బ్యాంక్స్ లో చేరింది ... పక్కదారి పట్టిన 2000 నోట్లు కూడా అక్కడక్కడా దొరకబుచ్చుకుని బ్యాంక్స్ లో జమ చేశారు ... చాలా నల్ల డబ్బు ఏదో ఒక రకంగా తెల్లగా మారిపోయింది ... బడా బాబులు ఇందుకోసం ఏమీ కష్టపడిపోలేదు ... శత కోటి దరిద్రాలకు ... అనంత కోటి ఉపాయాలని ఊరికే అనలేదు కదా  ... 

సరే ... మరి ... ఇంతేనా ? ఈ గోల పడలేక నగదు రహిత విధానానికి మంగళం పాడేశారా ?  

అసలు ఈ విధానానికి బీజం పడింది ... ఆధార్ కార్డ్స్ పద్ధతిని ప్రవేశపెట్టడం తోనే ... అంటే కాంగ్రెస్ హయాం లోనే ... దానికి  కొనసాగింపు చర్య లలో రెండోది అందరికీ బ్యాంకు ఖాతాలు ... తరువాత ఈ నోట్ల రద్దు ...  ఇంకా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించడం ... తరువాత ఒకే పన్ను ... ఇలా ఉండ వచ్చు చర్యలు ... 

అంటే ఒకాయన అన్నట్లు అగ్ర రాజ్యం కోసమో, కార్పొరేట్ కంపెనీల కోసమో ... మొత్తం వ్యవస్థను నగదు రహిత విధానానికి మార్చడానికి ఈ నోట్ల రద్దు అనేది ... తప్ప ... నల్ల డబ్బు వెలికితీత కోసం కాదట ... సరే ... మరి నగదు రహితంగా ఉంటె నే కదా బ్లాక్ మనీ అనేది చేరదు ... లావా దేవీలన్నీ కాష్ లెస్ గా జరిగితే, ఎవ్వడూ పన్ను పోటునుండి తప్పించుకోలేదు ... తద్వారా పన్నులు తగ్గడం కూడా జరగ వచ్చు ... 

కాబట్టి నీరుగారిపోకుండా ఇది ఇలా కంటిన్యూ అయితేనే మనం బాగుపడతాం ... లేకపోతే మనలను ఆ దేవుడు కూడా రక్షించలేడు ... 

జై హింద్ ... 










14, జనవరి 2017, శనివారం

తేజస్విని తరపున ... సంక్రాంతి శుభాకాంక్షలు

మరియు కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు కూడా ...

షేర్ గురు ఈ వారం సూచించిన స్టాక్ ... ఎక్సయిడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
దీని ప్రస్తుత ధర
185 రూపాయలు

రేపటి స్టార్ సిప్
జె ఎం టి ఆటో లిమిటెడ్
...

ఇక ఇతర వివరాల లోకి వెళితే ...
ఎస్ బ్యాంకు స్టాక్ ధర గమనించే వుంటారు ... 1340 రూపాయల వరకూ వెళ్ళింది ...
సరిగ్గా ఒక సంవత్సరం క్రితం దీని ధర 680 రూపాయలు మాత్రమే .. సెప్టెంబర్ లో 1440 రూపాయలకు కూడా పెరిగింది ...
అంటే జనవరి 2016 ఈ తేదీలలో ఒక లక్ష ఎస్ బ్యాంకు స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే 147 షేర్స్ కొనుగోలు జరిగితే ... సెప్టెంబర్ లో పెరిగిన విలువ ప్రకారం రూ . 2, 11, 680 /- వరకూ వెళ్ళింది. ప్రస్తుత ధర ప్రకారం అయితే
రూ 1,96,980 ... అంటే దాదాపు ఒక సంవత్సరంలో రెట్టింపు లాభం ...

సో ... హ్యాపీ ఇన్వెస్టింగ్

నేనే ...




12, జనవరి 2017, గురువారం

శుభాకాంక్షలు

బ్లాగ్ మిత్రులకు భోగి శుభాకాంక్షలు ...

ఈ మధ్యనే స్టాక్ మర్కెట్స్ కు సంబంధించి ఒక వెబ్ సైట్ చూసాను  ... తెలుగులో ...

http://telugustockprofits.com

చూడండోసారి ...

బై

మురళి




8, జనవరి 2017, ఆదివారం

ముందుగానే వచ్చింది సంక్రాంతి ...


బొమ్మల కొలువులో బొమ్మల కూర్చుంది ... మా తేజస్విని ...
భాష్యం స్కూల్ బొమ్మల కొలువు నిర్వహణ లో తీసిన దీ ఛాయా చిత్రం ...

ఈ వారం షేర్ గురు స్టాక్
పిన్ కాన్ స్పిరిట్ లిమిటెడ్ -- ధర 66 రూపాయల లో ...
రేపటి స్టార్ సిప్
నహర్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్

...

మురళి