21, జనవరి 2017, శనివారం

క్యాష్ లెస్ ... తుస్సేనా ?

తేజస్విని ఫోటో ఆల్బమ్ నుండి ... 

ఈ వారం షేర్ గురు స్టాక్ ... 
జె బి ఎం ఆటో లిమిటెడ్ ... 254 రూపాయలు 
రేపటి స్టార్ సిప్ 
డ్యూక్ ఆఫ్ షోర్ లిమిటెడ్ 

... 

"ఈ దేశానికి ఏమయింది ?  ఒక ప్రక్క మార్పు కోసం ప్రయత్నం ... మరో వైపు తిరోగమనం కోసం పోరాటం ... 
అందరూ మాట్లాడేవారే ...  ఈ పనికిమాలిన కబుర్లకు పాడాలి చరమ గీతం ... "

ప్రధాన మంత్రి పెద్ద నోట్లను రద్దు చేసిన రోజు రాత్రి ... నేనైతే చాలా సంతోషించాను ... ఇది నగదు రహిత వ్యవస్థ కు నాంది అని అనిపించడం వల్ల ... 

నా భార్య అయితే ఆ రోజు నుండి మోడీ గార్ని తిట్టిపోస్తూనే ఉంది ... నాకు తెలియకుండా ఎంత డబ్బు దాచిందో కానీ ... ఆ రోజు నుండి నిన్న మొన్నటి వరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉంది ... ప్రతి రోజూ మా ఇద్దరి మధ్య ఈ విషయమై గొడవే ... ఇలా ప్రతి చోటా నోట్ల రద్దును సమర్ధించే వారు  కొందరైతే , వ్యతిరేకించే వారు మరి కొందరు ... విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ చర్య వల్ల జరగబోయే పరిణామాలను గురించి ప్రజలను చైతన్యపరచ వలసిన మీడియా ... జనాలను రెచ్చ గొట్టే కార్యక్రమాన్ని భుజాల కెత్తుకుంది ... ముఖ్యంగా టి వి 9 , కాస్త ఏ బి ఎన్ ... మిగిలిన మీడియా మరి కాస్త ... తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ... 

రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు, వ్యాపారస్తులు విమర్శించారంటే అర్థం ఉంది ... సమ సమాజం ... మెరుగైన సమాజం, అంటూ గొంతు చించుకుని పత్రికా లోకం ... చెప్పడం వరకేనా ? చేయడం ... చేసే వారికి చేయూత నివ్వడం ఉండదా ?   

ఒక పక్క భజన బృందం ... మోడీ గారు ఏమి చేసినా నమో నమో అంటుంది ... మరోప్రక్క వ్యతిరేక వర్గం ఏమి చేసినా ... ఇది ఇందుకే ... అది అందుకే అంటూ కారణాలను కనిపెడుతుంది ... మధ్యలో నాలాంటి సగటు జీవికి ఏమి చేయాలో అర్థం కావడం లేదు ... మాకు తెలిసిందల్లా ఒకటే ... క్యూ లో ఎక్కువ సేపు నుంచో వలసి వస్తుంది ... బ్యాంకు నుండి డబ్బు డ్రా చేయడానికి తలా ప్రాణం తోకకు వస్తుంది ... పోనీ ఆన్ లైన్ లో చేద్దామనుకుంటే బ్యాంక్ ఛార్జెస్ బాదుడు ... ఒక్కో దగ్గర స్వైపింగ్ మెషిన్ లు మా వల్ల కాదంటూ మొరాయించడం ... మానేయగలిగినవి మానేసాం ... వాయిదా వేయగలిగినవి వాయిదా వేసాం ... తప్పని సరి పరిస్థితుల్లో చేయవలసినవి ఏమైనా ఉంటె ... ఏదో మార్గాన్ని పట్టుకుని చేసేశాం ...  500 రూపాయలు రాగానే 90 శాతం సమస్య పరిష్కారమైపోయింది ... మామూలుగానే నగదు సహిత లావాదేవీలు అయిపోతున్నాయి ... 

మరి ఇంతకీ నల్ల డబ్బు రాకుండా రావడానికి కదా ఈ నోట్ల రద్దు కార్యక్రమం ... ఇంత వరకూ ఉన్న డబ్బు చాలా వరకు బ్యాంక్స్ లో చేరింది ... పక్కదారి పట్టిన 2000 నోట్లు కూడా అక్కడక్కడా దొరకబుచ్చుకుని బ్యాంక్స్ లో జమ చేశారు ... చాలా నల్ల డబ్బు ఏదో ఒక రకంగా తెల్లగా మారిపోయింది ... బడా బాబులు ఇందుకోసం ఏమీ కష్టపడిపోలేదు ... శత కోటి దరిద్రాలకు ... అనంత కోటి ఉపాయాలని ఊరికే అనలేదు కదా  ... 

సరే ... మరి ... ఇంతేనా ? ఈ గోల పడలేక నగదు రహిత విధానానికి మంగళం పాడేశారా ?  

అసలు ఈ విధానానికి బీజం పడింది ... ఆధార్ కార్డ్స్ పద్ధతిని ప్రవేశపెట్టడం తోనే ... అంటే కాంగ్రెస్ హయాం లోనే ... దానికి  కొనసాగింపు చర్య లలో రెండోది అందరికీ బ్యాంకు ఖాతాలు ... తరువాత ఈ నోట్ల రద్దు ...  ఇంకా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించడం ... తరువాత ఒకే పన్ను ... ఇలా ఉండ వచ్చు చర్యలు ... 

అంటే ఒకాయన అన్నట్లు అగ్ర రాజ్యం కోసమో, కార్పొరేట్ కంపెనీల కోసమో ... మొత్తం వ్యవస్థను నగదు రహిత విధానానికి మార్చడానికి ఈ నోట్ల రద్దు అనేది ... తప్ప ... నల్ల డబ్బు వెలికితీత కోసం కాదట ... సరే ... మరి నగదు రహితంగా ఉంటె నే కదా బ్లాక్ మనీ అనేది చేరదు ... లావా దేవీలన్నీ కాష్ లెస్ గా జరిగితే, ఎవ్వడూ పన్ను పోటునుండి తప్పించుకోలేదు ... తద్వారా పన్నులు తగ్గడం కూడా జరగ వచ్చు ... 

కాబట్టి నీరుగారిపోకుండా ఇది ఇలా కంటిన్యూ అయితేనే మనం బాగుపడతాం ... లేకపోతే మనలను ఆ దేవుడు కూడా రక్షించలేడు ... 

జై హింద్ ... 










1 కామెంట్‌:

  1. తిలాపాపం తలో పిడికిడు అన్నట్టు ఆర్‌బీఐ అధికారులనుండీ, బ్యాంక్ అధికారుల్నుండీ, పోస్టల్ అధికారులనుండీ ప్రైవేట్ బ్యాంకుల అధికారులనుండీ ఇంకా సామాన్య ప్రజల వరకూ నల్లదళారులకు కొమ్ము కాసీ...చివరికీ మోడీని విమర్శిస్తే ప్రయోజనమేమిటి చెప్పండి !!

    రిప్లయితొలగించండి