15, మే 2017, సోమవారం

యూనిట్ లింక్ డ్ ఇన్సూరెన్స్

ఇన్సూరెన్స్ ... ఈ పదం ఇప్పుడు అన్నింట్లో కామన్ అయిపోయింది ... పర్సనల్ ఇన్సూరెన్స్ , మెడికల్ ఇన్సూరెన్స్ , వెహికల్ ఇన్సూరెన్స్ , ట్రాన్స్ పోర్ట్ ఇన్సూరెన్స్ , ట్రావెల్ ఇన్సూరెన్స్ , ఫోన్ కొంటె ఇన్స్యూరెన్స్ , టి వి కొంటె ఇన్స్యూరెన్స్ ... ఇక్కడా అక్కడా అని లేదు ... వీరూ వారు అని లేదు ... ప్రతి విషయంలో ఇన్సూరెన్స్ , ప్రతి దానికీ ఇన్సూరెన్స్ ... బ్రతికి ఉన్నప్పుడు కన్నా , చచ్చాక పనికి వచ్చే విషయం ఈ ఇన్సూరెన్స్ ... ఇది మనకన్నా మనపై ఆధార పడి ఉన్నవారికి , మనం పోతే ఇచ్చే అస్స్యూరెన్స్ ... 

ఈ మధ్య లక్కీ డిప్ పేరుతో గిఫ్ట్స్ వచ్చాయని ఫోన్ చేసి, ఫ్రీ గిఫ్ట్ కోసం ఆశ పది వెళ్లే వారి మైండ్ సర్ఫ్, ఏరియల్ , వీల్ మొదలైన పౌడర్లు ఉపయోగించి వాష్ చేసి మరీ ఇన్సూరెన్స్ చేయించేస్తున్నారు .  

ఇంకా మెడికల్ ఇన్స్యూరెన్స్ గొడవ వేరే ... ఈ బీమా ఉంది కదా అని ధీమా తో వాళ్ళు ఇచ్చిన లిస్ట్ లో ఒక హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ చేసుకో బోతే, ఎలాగూ ఇన్సూరెన్స్ వాళ్ళు బిల్లు చెల్లిస్తారని, వాళ్ళు చెప్పిన టెస్ట్ లన్నీ చేయించు కొని, కొత్త కొత్త రోగాలు తెచ్చుకొని , ఏవేవో మందులు మింగి , అవసరం లేని సర్జరీలు చేయించేసుకుని , ఈ ట్రీట్ మెంట్ లు చచ్చే వరకూ కంటిన్యూ అయ్యే పరిస్థితి మనకు మనమే కల్పించుకోవడం ... 

అసలు ఇన్సూరెన్స్ అంటే ఏమిటి ? అంటే ఎవరో చెప్పారు ఇలా 

మనం చచ్చాక మన వాళ్లకు ఏమైనా అవుతుందేమో అని భయపెట్టి , మనం పోయినా మన వాళ్లకు రక్షణ ఇస్తామని ప్రలోభపెట్టి , మన డబ్బు తో వ్యాపారం చేసుకుంటూ , మనకు సేవింగ్స్ బ్యాంకు వడ్డీ కన్నా తక్కువ దులిపేస్తూ , మనల్ని ఉద్ధరిస్తున్న లెవెల్ ఇచ్చే ఇన్స్ట్రుమెంట్ ఈ ఇన్సురెన్సు .  

మొత్తం డబ్బు ఇన్స్యూరెన్స్ కంపెనీలే తీసేసుకుంటే ఎలా ... మాకూ కావాలి కదా ... అని ప్రధాన మంత్రి గారు , ముఖ్య మంత్రి గారు ఒక్కో పేరుతో, తక్కువ డబ్బుతో ప్రమాద బీమాలు ప్రవేశ పెట్టేసారు .   

ఇది ఒక కోణం ..  దీని వల్ల ఇన్సూరెన్స్ కట్టే వాళ్ళు పెద్ద ఎక్కువగా ఉండరు ... కానీ మరోకోణం ... టాక్స్ బెనిఫిట్ ... ప్రభుత్వానికి కట్టాల్సిన టాక్స్ తగ్గించుకోవడానికి ... భవిష్యత్తు కోసం దాచుకోవడానికి ... రెండిటికీ ఉపయోగ పడేటట్టు ... మంచి పాలసీ తీసుకోవడం ... 

మనం కావాలనుకున్న, వద్దను కున్నా, తిట్టుకున్నా , మొత్తుకున్నా .. ఈ కాలం లో బీమా కచ్చితంగా కావలిసిందే ... 

అయితే ప్రస్తుతం ఇన్స్యూరెన్స్ పోలిసీలు రక రకాలు గా ఉన్నాయి ... ముందే చెప్పినట్టుగా సంప్రదాయ పాలసీ లలో వచ్చే వడ్డీ తక్కువ ... కానీ రిస్క్ తక్కువ కాబట్టి ఒక సంప్రదాయ పాలసీ ఖచ్చితంగా ఉండాల్సిందే .... 

నేను ఇంతకు ముందు ఒక యూనిట్ లింక్డ్ పాలసీ గురించి వ్రాసాను ... అందులో మన డబ్బును ప్రభుత్వ బాండ్స్ లోనో, కంపెనీ బాండ్స్ లోనో పెట్టి, మాములు పాలసీ కన్నా కాస్త ఎక్కువ డబ్బు వస్తుందని చెబుతారు ... కానీ ఫండ్ ఆలోకేషన్ ఛార్జెస్ , ఇతర రుసుములు కలుపుకొంటే చివరకు ఎంత వస్తుందో చెప్పలేము ... సంప్రదాయ పాలసీ కన్నా కాస్త ఎక్కువే వస్తుంది ... అయితే ఇలాంటి పాలసీ తీసుకునేటప్పుడు , నెట్ అసెట్ వేల్యూ మొదట 10 రూపాయలతో ప్రారంభమవుతుంది ... అలా ప్రతి సంవత్సరం పెరుగుతూ మన పాలసీ ముగిసే సమయానికి 30 రూపాయల వరకూ పెరిగీ మంచి రిటర్న్స్ ఇస్తుంది ... అయితే ఇలాంటి పాలసీ లలో ఇంకా ఎక్కువ రిటర్న్స్ సంపాదించాలంటే ఒక మార్గం ఉంది ... అదే టాప్ అప్ ... మనం ప్రతి సంవత్సరం ఒక ఇరవై వేలు పాలసీ మీద కడతామనుకుంటే ... ఇరవై సంవత్సరాలలో కట్టేది నాలుగు లక్షలు ... ప్రతి సంవత్సరం ఇరవై వేలు చొప్పున కడుతుంటే మనకు ఇచ్చే యూనిట్లు, ఆ సమయంలో ఉండే నెట్ అసెట్ వేల్యూ ప్రకారం ఉంటాయి కదా.   అదే తరువాతి సంవత్సరం కోసం వెయిట్ చేయకుండా ముందే వీలైనంత ఎక్కువ డబ్బు కట్టుకో గలిగితే తక్కువ నెట్ అసెట్ వేల్యూ తో ఎక్కువ యూనిట్స్ పొందగలుగుతాం ... చివర్లో ఎక్కువ రిటర్న్స్ పొందవచ్చు . 

ప్రస్తుతం యూనిట్ లింక్డ్ పాలసీలలో కొత్త కొత్త వి వస్తున్నాయి ... వీటి లక్షణాలు కొన్ని ... 

1. ఒకేసారి ప్రీమియం స్వీకరించడం 
2. తక్కువ ఫండ్ ఆలోకేషన్ ఛార్జ్ లు 
3. ఎక్కువ శాతం ఫండ్స్ స్టాక్ మార్కెట్ లో పెట్టడం 
4. తక్కువ ఎన్ ఏ వి ఉన్నప్పుడు టాప్ అప్ చేసుకునే అవకాశం ఇవ్వడం 
5. మనకు కావలసినట్టు పోర్ట్ ఫోలియో మార్చుకొనే అవకాశం 

పైన చెప్పినట్టు ఉన్న యూనిట్ లింక్డ్ పాలసీ లైతే ఇన్వెస్ట్ మెంట్ , ఇన్స్యూరెన్స్ , తో పాటు మంచి రిటర్న్స్  కూడా అందించే అవకాశం ఉంది ... 

ఒకసారి ఐ సి ఐ సి ఐ వెల్త్ బిల్డర్ 2 , మ్యాగ్జిమైజర్ 5 చూడండి ... 

మీ 

మురళి 







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి