ఇప్పుడైతే ఇంట్రా డే, బి. టి. ఎస్. టి ., టి + 5, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్, ట్రేడింగ్, ఇన్వెస్ట్ మెంట్, ఐ పి ఓ , సెకండరీ మార్కెట్ ... అంటూ రక రకాలుగా స్టాక్ మార్కెట్ లో వ్యవహరాలు చేస్తున్నాము .. కానీ ఈ ఆన్ లైన్ ట్రేడింగ్ లేనప్పుడు, పేపర్ రేట్ మీద ఆధార పడినప్పుడు కేవలం ఐ. పి. ఓ వచ్చినప్పుడు స్టాక్స్ కొనడం , డివిడెండ్ లు అందుకున్నప్పుడు సంతోషించడం, మరీ మంచి రేట్ అయితే లేదా అత్యవసర సమయాలలలో మాత్రం అమ్ముకోవడం ... ఇదే స్టాక్స్ మార్కెట్ అంటే ... అయితే ఎప్పుడైతే లెక్కకు మించి స్టాక్ బ్రోకర్స్ అవతరించారో , బ్రోకరేజ్ కోసం ఇలాంటి ప్రయోగాలకు, మదుపర్లు లోను కావలసి వస్తుండటం, సంపదను పోగొట్టుకోవడం జరుగుతూ వస్తోంది ... అయితే రిస్క్ అనేది ఉంటేనే సంపద పెరగడానికి ఆస్కారం ఉంటుందనేది నిజం ... అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మదుపు చేసేవారికి కిక్ నిచ్చేది డివిడెండ్ మాత్రమే ... ఆ చిన్న మొత్తం ఉపయోగించుకోవడానికో లేక మళ్ళీ మదుపు చేయడానికో ఉపయోగిస్తే నెలసరి ఆదాయం లో పొదుపు కోసం పెంచే వాటా పెరుగుతుంది.
ఇలా డివిడెండ్ పై ఆసక్తి ఉన్నవారి కోసం కొన్ని డివిడెండ్ స్టాక్స్ ... (ఇవి కార్వే స్టాక్ బ్రోకర్స్ సూచించిన స్టాక్స్ )
1 . కోల్ ఇండియా
2. హిందూస్తాన్ జింక్
3. ఐ వి సి
4. ఎన్ హెచ్ పి సి
5. ఎన్ ఎమ్ డి సి
6. ఓ ఎన్ జి సి
7. ఆయిల్ ఇండియా లిమిటెడ్
8. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్
9. రురల్ ఎలెక్ట్రిఫికేషన్ కార్ప్ లిమిటెడ్
10. సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్
సో హ్యాపీ ఇన్వెస్టింగ్ ఫర్ లాంగ్ టైం ...
మురళి