బ్లాగ్ మిత్రులకు ముందస్తుగా ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు ...
ఈ మధ్య ప్రతి సందర్భాన్ని వివాదాస్పదం చేస్తున్నారు ... ఎక్కువగా హిందువుల పండుగల సమయంలో ... దీపావళి కి మతాబుల విషయంలో, వినాయక చవితి కి జల కాలుష్యం అని, ... ఇలా అన్న మాట ...ఇప్పుడు ఆంగ్ల సంవత్సరం ప్రారంభ ఉత్సవాలు ...
నిజానికి మన సంవత్సరాది ఉగాది ... అది కాదనలేని సత్యం ... ఈ ఉగాది మాత్రమే కాదు ... ఎవరేమనుకున్నా, అన్నా, మన పండుగలను మనం జరుపుకుంటాం ... మన మన ఆర్థిక స్థితి గతులకు లోబడి . ఇక ఈ ఆంగ్ల సంవత్సరాది విషయానికి వస్తే ... ప్రకృతి పరంగా, సౌర మండలాల్లో ఎటువంటి మార్పులు వస్తాయో రావో తెలీదు కానీ, మన ఇళ్లల్లో క్యాలెండర్ మాత్రం మారుతుంది. ... అలాగే మన పుట్టిన రోజులు కూడా ఈ ఆంగ్ల కాలమానం ప్రకారమే జరుగుతుంది మన పిల్లల్ని ఆంగ్ల మధ్యమ పాఠశాలల లోనే చదివిస్తాం ... ఇలా మన రక్తంలో ఆంగ్ల భాష, కలిసి పోయింది .. కాబట్టి ఆంగ్ల సంవత్సర ప్రారంభ ఉత్సవాల కోసం వాదోపవాదాలు ఎందుకు ? నచ్చితే జరుపుకోవచ్చు ... లేదంటే లేదు ...
అయితే ఈ జనవరి ఒకటో తేదీ (కాలెండర్ ఇయర్ కాబట్టి), ఉగాది (మన తెలుగు సంవత్సరాది కాబట్టి), ఏప్రిల్ 01 (ఆర్థిక సంవత్సరం కాబట్టి), దీపావళి (స్టాక్ మార్కెట్ లో ఉండేవాళ్ళకి మాత్రం - సంవత్ కాబట్టి) .. ఇంకా పుట్టిన రోజుల నాడు ... కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోవడానికి ముహుర్తాలు గా నిర్ణయిస్తుంటాం ...
మనం ఉపయోగించే డైరీలు జనవరి 1 నాడే, ప్రారంభమవుతాయి కాబట్టి ... ఎక్కువ నిర్ణయాలు ఈ రోజే జరుగుతాయి. అలాగే జరిగిపోయిన సంఘటనల సమీక్షలు కూడా. ఈ రకంగా చూస్తే ... 2017 నా విషయంలో ఒక మార్పుపు శ్రీకారం చుట్టిన సంవత్సరంగా గుర్తు పెట్టుకుంటాను ... అదే 5 పైసా డాట్ కామ్ ...
ఈ 5 పైసా ద్వారా ట్రేడింగ్ ఇంకా నా పరిశీలనా దశ లోనే ఉంది ... లాభాలు పొందాను ... నష్టాలు పొందాను ... కారణాలు ఇవీ అని గ్రహించాను ... కాకపోతే పూర్తిగా ఇది లాభదాయకం అని అనిపిస్తే ... మీ అందరితో షేర్ చేసుకుంటాను ... ప్రస్తుతం దీనిలో ఉన్న లాభదాయకమైన అంశాలు బ్రోకరేజ్ తక్కువ... అందువల్ల మార్జిన్ ట్రేడింగ్ లో పాలుపంచుకోవడానికి కొద్దిగా ఎక్కువ అవకాశం ఉండటం ...
సో, ఈ 2018 సంవత్సరం ... ఈ స్టాక్ మార్కెట్ ప్రయాణానికి ఒక మంచి దారి చూపిస్తుందని ఆశిస్తూ
మురళి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి