చాలా కాలం తరువాత బ్లాగ్ లోకి వచ్చా. 2018-19 ఆర్ధిక సంవత్సరం అయిపోతోంది కదా.. ఇదివరకే చెప్పుకున్నట్టు మన జీవితాల్లో కొత్త కొత్త ఆలోచనలు చేసేది, కొత్త కొత్త నిర్ణయాలను తీసుకొనేది ... నాలుగు ముఖ్య సందర్భాలలో ... మొదటిది మన పుట్టిన రోజు నాడు... రెండోది మన తెలుగు సంవత్సరాది నాడు ... మూడు జనవరి ఒకటి ఆంగ్ల సంవత్సరాది నాడు... నాలుగోది ఆర్థిక సంవత్సర ప్రారంభం నాడు.. ... ఇది సాధారణంగా అందరికి వర్తించేది ...
మరి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టింగ్ లేదా ట్రేడింగ్ చేసేవారు నిర్ణయాలు తీసుకునే వారికోసం ... సంవత్ (దీపావళి రోజు) ప్రారంభం నాడు...
అయితే మొదటి సందర్భం ఎవరికి వారు వారి వారి పుట్టిన రోజు నాడు ... అంటే మనిషి మనిషికీ వేర్వేరుగా ఉండేది ... రెండో సందర్భం వేరే వేరే రాష్ట్రం ... వేరే వేరే సంవత్సరాది ఉంటాయి ... కానీ ఆంగ్ల సంవత్సరాది మరియు ఆర్థిక సంవత్సరాది మనందరికీ కామన్ ... సంవత్ కూడా అనుకోండి ... కానీ స్టాక్ మార్కెట్ తో లింక్ ఉంటేనే సంవత్ ను లెక్క లోనికి తీసుకోవాలి.
సరే .. మరిప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవారికి ... ఈ ఆర్థిక సంవత్సరాది ఒక ముఖ్యమైన సందర్భం ... పన్ను కట్టే వారు మినహాయింపు కోసం రకరకాల దారులు చూసేది ఈ సమయం లోనే ... జీవిత బీమా , ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ , ఆదాయపు పన్ను మినహాయింపు వచ్చే పొదుపు మార్గాలు ... ఇలాంటి వాటికీ సంబందించిన ఏజంట్లు టార్గెట్ ల కోసం మన ప్రాణాలను తీసేది ఈ సమయం లోనే ... ఎవరు ఎన్ని విధాలా ఆలోచనలు చేసినా భవిష్యత్ నిధి కోసమే. ట్రేడింగ్ చేసే వారి సంగతి వదిలిపెడదాం ... వారికీ నిత్య కళ్యాణం ... పచ్చ తోరణం ... కానీ లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసేవారికోసం ఈ మధ్య "మని కంట్రోల్ డాట్ కాం " లో దీర్ఘకాలిక పెట్టుబడి కి పనికి వచ్చేలా పోర్టుఫోలియో ఎలా ఉండాలో ఆర్ధిక నిపుణులను సంప్రదించి ... మనలాంటి వారి కోసం సూచనలను ఇవ్వడం జరిగింది...
మొదటగా అవిఘ్న ట్రేడర్స్ వ్యవస్థాపకులు శివేంద్ర ప్రకారం పోర్ట్ ఫోలియో లో 30 శాతం బ్యాంకింగ్ స్టాక్స్ ఉండాలంట... అవీ ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు, బ్యాంకు అఫ్ బరోడా, స్టేట్ బ్యాంకు లాంటి ప్రభుత్వరంగ బ్యాంకుల స్టాక్స్...
20 శాతం ... ఆటో మొబైల్ స్టాక్స్ ... ఎం & ఎం , బజాజ్ ఆటో , హీరో మోటోకార్ప్ , జి. ఎన్ ఏ యాక్సిల్, మాదర్శం సుమీ మొదలైనవి
20 శాతం ఇన్ఫ్రా , రియల్ ఎస్టేట్ సంబంధితమైనవి ... డి.ఎల్.ఎఫ్. , ఎన్ .సి.సి. , ఎన్ .బి. సి. సి. , ఐ. ఆర్. బి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ... మరియు 10 శాతం సిమెంట్ స్టాక్స్.
10 శాతం యు బి ఎల్, యునైటెడ్ స్పిరిట్స్, రాడికో ఖైతాన్ లాంటి బెవరేజెస్ సెక్టార్ ... చివరగా మీడియా రంగ స్టాక్స్ ... జి ఎంటర్టైన్మెంట్, టి.వి. టుడే, టి. వి. 18 బ్రాడ్కాస్టింగ్ ... లలో మిగిలిన 10 శాతం ...
అలాగే .. 5 నాన్స్ డాట్ కాం వ్యవస్థాపకులు దినేష్ గారి ప్రకారం ...
30 శాతం ఎఫ్ ఎమ్ సి జి. , 20 శాతం వ్యవసాయ ఆధారిత రసాయనాల స్టాక్స్, 30 శాతం హౌసింగ్ ఫైనాన్స్ మరియు ప్రయివేట్ బ్యాంకు స్టాక్స్ .. మిగిలిన 20 శాతం ఐ టి స్టాక్స్ కు కేటాయించామని సూచిస్తున్నారు ...
....
సో. .. పై విధమైన సూచనలను (10 శాతం) దృష్టిలో పెట్టుకొని .. (90 శాతం) స్వయంగా అలోచించి ... ఒక మంచి లాభదాయకమైన పోర్ట్ ఫోలియో నిర్మించుకొని .. సంపద సృష్టించుకోవడం మన చేతుల్లోనే ఉంది..
హ్యాపీ ఇన్వెస్టింగ్ ...
మురళి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి