28, నవంబర్ 2019, గురువారం

జీరోధా

మార్చ్ లో వచ్చా బ్లాగ్ లోకి.  మళ్ళీ ఇప్పుడు ...
లోన్స్ ఇ ఎమ్ ఐ లు ఎక్కువ అయిపోయి ఈ మధ్య ట్రేడింగ్ ఎక్సపెరిమెంట్స్ పెద్దగా లేదు .

టాప్ గైనర్స్ తో ఇంట్రా డే ప్రయోగం చేశాను ... కానీ అది కూడా పెద్ద ఉపయోగకరం కాదని తెలిసింది ...
స్టాప్ లాస్ ప్రయోగం కూడా వేస్ట్ ...

ఈ మధ్యనే జీరోధా లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశాను.

ఇందులో డెలివరీ ట్రేడింగ్ లో బ్రోకరేజ్ లేదని, ఇంట్రా డే లో కూడా తక్కువ బ్రోకేరేజ్ అని ... ఓపెన్ చేశాను

కానీ ...

1. POA డాక్యుమెంట్స్ హార్డ్ కాపీ పంపేంత వరకు డీమ్యాట్ లో స్టాక్స్ అమ్ముకోవడానికి వీలు లేదు .
2. కాల్ అండ్ ట్రేడ్ చేస్తే మళ్ళి ఛార్జ్స్ పడిపోతాయి
3. ఫండ్ ట్రాన్స్ఫర్ UPI లో చేస్తే తప్ప వేరేగా చేస్తే చార్జెస్ పడిపోతాయి

ఇప్పటికి ఇవి మాత్రమే తెలుసు. 

పూర్తిగా ఫండ్ రిపోర్ట్ చూడాలి ఇంకా ఏమి చార్జెస్ పడ్డాయో తెలియడానికి .

5 పైసా లో మినిమం బ్రోకేరేజ్ 10 రూపాయలు .  ఒకటి నుండి ఎన్నింటికైనా ...
జీరోధా లో ఎన్ని కొంటే అన్నింటికీ మాత్రమే బ్రోకరేజ్ పడుతుంది 

ఇంకా ఎవరికైనా ఏమైనా తెలిస్తే షేర్ చేయండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి