27, ఫిబ్రవరి 2023, సోమవారం

నెలాఖరు ముగింపు వరకు వేచివుండే కాల్ మరియు ఫుట్ అమ్మకపు వ్యూహం .. నష్ట నివారణకై కాల్ మరియు ఫుట్ కొనుగోలు తో .... (Month Ending Call and Put selling strategy with Hedging by call and put buy orders)

నెల ప్రారంభం లో లేదా 30 రోజుల ముందు వచ్చేలా ... నెలాఖరు ముగింపు తేదీ లేదా 30 రోజుల తరువాత ముగింపు తేదీ (Expiry Date Month end or after 30 Days )

కాల్ మరియు ఫుట్ At the money దగ్గర సెల్ ఆర్డర్ ప్లేస్ చేయాలి. 

కాల్ మరియు ఫుట్ అవుట్ అఫ్ మనీ మరియు ఇన్ ది మనీ వద్ద దాదాపు సెల్ ఆర్డర్ కు సగానికి వచ్చేట్లుగా బై ఆర్డర్స్ ప్లేస్ చేయాలి. 

Expiry Date వరకూ వేచి ఉండి అప్పుడు క్లోజ్ చేయాలి. 


ఫిబ్రవరి 1 న ట్రేడింగ్ ప్రారంభిస్తే 13 వ తారీకుకి  కింద చూడండి ... 4925 రూపాయల లాభం వచ్చింది 


ఈ మాత్రం లాభం ఉన్నా క్లోజ్ చేసేయ వచ్చు ... ఒకవేళ నష్టం కనిపిస్తుంటే మరో బయ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం ద్వారా నష్టం తగ్గించు కోవచ్చు లేదా లాభము గ మార్చుకోవచ్చు. 






15, ఫిబ్రవరి 2023, బుధవారం

ఆప్షన్ ట్రేడింగ్ ... లాస్ లేకుండా ....

నమస్కారం ... 

ముందు అనుకున్న విధంగా ఈ ఆప్షన్స్ గురించి మరి కొన్ని విషయాలు నాకు తెలిసినవి .... 

1. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈ టి ఎఫ్ లు కొంటె ఎంత కాలమైనా ఉంచుకోవచ్చు.   వీటి విలువ తగ్గుతూ ఉండవచ్చు ... పెరుగుతూ ఉండవచ్చు ... మంచి కంపెనీలైతే తగ్గినా తరువాత పెరిగే అవకాశం ఉంటుంది.   కాకపోతే ఇప్పుడు మంచి కంపెనీ ... తరువాతి కాలంలో నాశనం అయిపోవచ్చు.   మళ్ళీ పుంజుకోవచ్చు..  

2. మరి ఈ ఆప్షన్స్ జీవిత కాలం కేవలం ఒక వారమో , నెలో మాత్రం ఉంటుంది ... ఈ గడువులోనే అవి భయంకరంగా పెరిగి పోవచ్చు ... లేదా సున్నా అయిపోవచ్చు. 

3. ఉదాహరణకు బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ... బ్యాంక్ నిఫ్టీ పెరిగితే కాల్ ఆప్షన్ పెరుగుతుంది ... తగ్గితే ఫుట్ ఆప్షన్ పెరుగుతుంది.  ఇది సాధారణంగా జరిగేది.  కానీ ఎక్స్పైరీ డేట్ దగ్గర పడే కొద్దీ ఒకవేళ మార్కెట్ పెరగడం తగ్గడం కొంచెం కొంచెం గ ఉండటమో , ప్రారంభమైన విలువ దగ్గరే ముగించడమో జరిగితే కాల్ మరియు ఫుట్ రెండూ తగ్గుతుంటాయి.   

4. ఒక స్ట్రాటజీ ప్రకారం కాల్ ఫుట్ రెండూ నెల మొదట్లో కొని నెలాఖరు వరకు వేచి ఉంటె రెండింటిలో ఒకటి సున్నా అయిపోయేది ... అంటే సున్నా అయిపోయేది పోయినా పెరిగే దానిలో లాభం వచ్చేది ... పెట్టుబడి కూడా తక్కువ ... కాకపోతే రెండూ తగ్గడం అనేది జరిగితే ఈ బైయింగ్ స్ట్రాటజీ వర్క్ అవుట్ అవదు. 

5. ఒక వేళ పెరిగే దానిని పెరగనిచ్చి ... తగ్గుతూ ఉన్నదానికి, హెడ్జింగ్ కోసం సెల్ ఆర్డర్ పెడితే లాస్ మినిమైజ్ అవుతుంది. 

6. ఎంత తగ్గినపుడు హెడ్జింగ్ చేసుకోవాలో అనేది మన ఇష్టం... మనలాస్ భరించ గలిగే శక్తి మీద ఆధారపడుతుంది.  కాకపోతే సెల్ ఆర్డర్ కోసం పెట్టుబడి కాస్త ఎక్కువ అవసరం.   

7. ఆలా అని, డబ్బులు బాగా ఉంది ... రెండూ సెల్ ఆర్డర్ లే పెడదాం అనుకుంటే, స్టాప్ లాస్ అయినా పెట్టాలి... లేదా పెరిగే దానికి హెడ్జింగ్ కోసం బై ఆర్డర్ పెట్టాలి. 

ఇవన్నీ కాదు బాస్ ... నాకు రిస్క్ లేకుండా .... లాస్ వచ్చినా తక్కువ గాను  మరియు తక్కువ సార్లు వచ్చి, లాభావకాశాలే ఎక్కువ కావాలి అనుకుంటే నేనొక స్ట్రాటజీ అనుకుంటున్నాను ... అది ఇంకా పేపర్ ట్రేడింగ్ లోనే ఉంది ... ఈ నెలలోనే టెస్టింగ్ ప్రారంభించాను.   ఫిబ్రవరి ప్రారంభ తేదీల్లో ప్రారంభించాను.  

అది ఇప్పటి వరకు ఏ పరిస్థితిలో ఉందొ  చెబుతాను ... 


(సశేషం )




10, ఫిబ్రవరి 2023, శుక్రవారం

నెలవారీ ఆప్షన్స్ సెల్లింగ్ స్ట్రాటజీ ... బైయింగ్ హెడ్జింగ్ తోనా... లేకుండానా ? (మొదటి భాగం )

అసలీ ఆప్షన్స్ గోల ఏమిటి ? మ్యూచువల్ ఫండ్స్ అన్నారు ... వాటిలో రక రకాలు ఉన్నాయన్నారు ... స్టాక్స్ అన్నారు ... స్టాక్స్ లో ఇన్వెస్టింగ్ మంచిదా ... ట్రేడింగ్ మంచిదా అన్నారు ... తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోమన్నారు ... మంత్లీ సిప్ అన్నారు ... తరువాత ETF లు అన్నారు ... గోల్డ్ అన్నారు ... ఆప్షన్స్ అంటున్నారు ... ఫ్యూచర్స్ అంటున్నారు ... బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50, ఫిన్ నిఫ్టీ ... ఇలా ఏవేవో చెప్పినవి చెప్పకుండా ట్రై చేయమంటున్నారు.. ఒకసారి లాభం వస్తే పది సార్లు నష్టం ... పది వేలు లాభం వస్తే లక్షల్లో నష్టం ... 

ఇవన్నీ కాదు గాని ... ఆప్షన్స్ గురించి చెబుతున్నారు కాబట్టి ... ఎక్కువ టైం కేటాయించలేం ... ఎక్కువ డబ్బు పెట్టలేం ... ఎక్కువ టెన్షన్ పడలేం ... బి.పి మెషీన్లు పేలిపోతున్నాయి ... అసలు సామాన్యులకు, నాలాంటి సగటు మనుషులకు .... అర్థమయ్యేలా చెప్పండి బాస్ ... అసలు ఆప్షన్స్ ట్రేడింగ్ మాకు సరిపడుతుందా ? లేదా ? ... 

నా మటుకు నాకు సంపాదించుకున్న దానికన్నా పోగొట్టుకున్నది ఎక్కువ ... ఒక ఆరు నుండి ఎనిమిది లక్షల వరకు పోగొట్టుకుని ఉంటాను.   కానీ అనుభవం కన్నా మంచి గురువు ఎవరుంటారు.. 

అందుకని నా అనుభవాలను పంచుకుంటూ ఉంటాను ఈ బ్లాగ్ ద్వారా ... 

ముందు కింద పొందుపరచిన పంక్తులను గమనించి ... అసలు ఆప్షన్ ట్రేడింగ్ చేయాలో వద్దో మీరే నిర్ణయించుకోండి ... 

1. ఎవడో కంపెనీ పెడతాడు ... దానిని స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్ట్ అయ్యేట్టు చేస్తాడు ... తన కంపెనీ లో షేర్ లకు ధర నిర్ణయించి ఐపీవో లో పెడతాడు.   జనాలు కొనుక్కుని హోల్డ్ చేసుకొని డివిడెండ్స్ అనుభవిస్తూ ... తరువాత ఎప్పుడో అమ్మేసుకుంటాడు ... కంపెనీ లాభాలలో ఉంటె ధర పెరుగుతూ ఉంతుంది కనుక ఈ అమ్మేసుకున్నవాడు లాభం పొందుతాడు.  .... ఇక్కడి వరకు బాగానే ఉంది... దీనినే పెట్టుబడి పెట్టడం లాభం పొందడం అంటాం ... ఎప్పుడైతే ఇంటర్నెట్ సౌకర్యం పెరిగి ఆన్లైన్ లో ఇన్వెస్టింగ్, డీమ్యాట్ అకౌంట్ ద్వారా ఇన్వెస్టింగ్ ... వచ్చాయో , బ్రోకర్స్ పెరిగి ఇన్వెస్టింగ్ కాస్త ట్రేడింగ్ గ మారింది ... ఇలా ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ గురించి తెలియని వారు మధ్యవర్తుల ద్వారా స్టాక్స్ కొనాలనుకున్నప్పుడు మ్యూచవల్ ఫండ్స్ వచ్చాయి ... ఇవి అందరికి తెలిసిన విషయాలే కదా .... అంతేనా ... ఇంకా ఇవి చాలవన్నట్లు ఈ. టి. ఎఫ్ లు వచ్చేయి .  ఇలా కాదు గురు ... ఇంకా జనాల డబ్బులు దొబ్బడానికి వచ్చినవే ఈ ఆప్షన్స్ మరియు ఫ్యూచర్సూ... అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బెట్టింగ్ ల్లాంటివన్నమాట .... 

2. మరి ఈ బెట్టింగ్ లలో డబ్బులు సంపాదించడాని కై రకరకాల స్ట్రాటజీ లను ఎన్ ఎస్ ఈ ఇండియా వారే  ముద్రించారు.  మనం ఇంతకూ ముందు చదువుకున్న స్ట్రాటజీ లు ఇలాంటివే ... ఎవరో యూ ట్యూబ్స్ లో పెట్టినవే ... 

(సశేషం )









2, ఫిబ్రవరి 2023, గురువారం

బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడింగ్ ... పేపర్ ట్రేడింగ్ .... ఈ వారానికి చివరి రోజు ... తరువాతి వారానికి మొదటి రోజు


ముగింపు రోజు న కింగ్ రీసెర్చ్ ఫార్ములా లో ఈ రోజు కాల్ గానీ , ఫుట్ గానీ కొనుగోలు జరుగలేదు.   నో టెన్షన్ ... 

కానీ మురళీ కృష్ణ స్ట్రాటజీ లో కాల్ ఫుట్ రెండూ బై చేస్తాం కదా ... 




రోజు చివరికి లాస్ 40 రూపాయల వరకూ ... బ్రోకరేజ్ తో కలిపి ఇంకా ఎక్కువ ... ఒక రెండు వందలు ఉండదూ .... మరి ఇది ఇక్కడే ముగిస్తే ఇలా ... సోమవారానికి ఉంచితే ?  

అది తరువాత గమనించుదాం... 

మరి ఈ మన ఆట ప్రారంభం నుండి ఈ రోజు వరకు లాభం  
మన కింగ్ రీసెర్చ్ స్ట్రాటజీ ప్రకారం ఐతే ఎంత ? 
మురళీ కృష్ణ స్ట్రాటజీ ప్రకారం ఎంత ?

లాభపడే అవకాశం ఎంత ? ఎందులో ఎంత ? నష్టం ఛాన్స్ ఎంత ? ఎందులో ఎంత?

మీరే గమనించండి .... 


1, ఫిబ్రవరి 2023, బుధవారం

నాలుగో రోజు ... అప్షన్స్ ట్రేడింగ్ కథ ...

సాధారణంగా పేపర్ ట్రేడింగ్ నెల రోజులు కనీసం చేయాలి.  ఐతే ఈ వీక్లి ఎక్స్పైరీ అంటే రేపటి వరకు చేసి బ్లాగ్ లో పొందు పరచాలని అనుకుంటున్నాను ... ప్రతిరోజూ ఇలా బ్లాగ్ లో పొందు పరచడం అంటే కుదరదు కదా .... 


సరే ... ఈ రోజు మార్కెట్ చాల చిత్ర విచిత్రంగా ఉంది ... 

ఎప్పటి లాగానే 10 గంటల స్ట్రైక్ ప్రైస్ ... కాల్ హై ప్రైస్ బై ఆర్డర్ .... అలానే ఫుట్ ... ఇదంతా తెలుసు కదా.  ఆఖరికి కాల్ 390 రూపాయల దగ్గర కొనుగోలు జరిగింది.  అది ఆలా ఆలా ఆలా పైకి పోతూనే ఉంది 750 వరకు పై కి పోయింది ... అక్కడి నుండి కిందకు రావడం జరిగింది ... చివరకు ఎంత కిందకి వచ్చిందో తెలుసా .... 42 కి ????

అంటే ఇంకా పైకి పోతుందని ఆశించకుండా 750 లోపే మేల్కొంటే లాభం 9000 రూపాయలన్నమాట. 

అత్యాశ కు పోతే 8700 రూపాయల నష్టం మరి .... 



ఇదే సమయంలో ... నిజానికి ఈ స్ట్రాటజీ కి ముందే 9 గంటల 30 నిమిషాలకి కాల్ మరియు ఫుట్ 200 రేంజ్ లో కొని చూస్తే నిన్న రెండు అమ్ముడు పోయాయి మంచి లాభానికి.   కానీ  ఈ రోజు రెండు కూడా తగ్గుతున్నాయని రెండింటిలో సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేశాను.  కాల్ సెల్ విపరీతంగా పెరిగిపోవడం జరిగింది ... అందుకనే దానిని బాలన్స్ చేయడానికి మూడు ధరలలో కాల్  కొనుగోలు చేయడం జరిగింది.   మొత్తంగా 5000 రూపాయలు రేంజ్ లో ప్రాఫిట్ కనిపించగానే (నిజానికి 6475/-) క్లోజ్ చేసేసాను.   చివరలో చూస్తే, ఒకవేళ ఆలా క్లోజ్ చేయకుండా చివర వరకు ఉంచి నట్లైతే 17000/- లాస్ వచ్చేది.  బడ్జెట్ మహిమ అనుకుంటా .. వరుసగా ట్రేడింగ్ పట్టికలు కింద ఇచ్చాను ...  చిత్తగించండి. 







అంటే ఈ పట్టిక లో చూపిన విధంగా ... ఆ సమయానికి క్లోజ్ చేసేస్తే 6475 రూపాయల లాభం వచ్చేది.  ఆలా కాకుండా 3 గంటల 30 నిమిషాల వరకు ఉంచితే ?  కింద పట్టిక సమాధానం ... 



అదన్న మాట విషయం ... అందుకే స్టాక్ మార్కెట్ అంటే షాక్ మార్కెట్ అంటారు ... కాబట్టి వీలైన లాభం పొందాలి తప్ప మరి ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు.