కార్తిక మాసం అంటే గుర్తు వచ్చేది మా ఉరు. నిజానికి ఎవరికైనా పండగ అనగానే గుర్తు వచ్చేది వారి వారి సొంత వూరిలో గడిపిన బాల్యం... ఎందుకంటె పండగలను ఎంజాయ్ చేసేది బాల్యం లోనే. పార్వతీపురం మా వూరు. అక్కడ నుండి ప్రతి కార్తిక మాసం లో సోమవారానికి అడ్డపుసిల వెళుతూ ఉండేవాళ్ళం. కొండ గుహలో శివుని గుడి. ఐతే పిల్లలం ఎప్పుడూ గుడి లోకి వెళ్ళిన పాపానికి పోలేదు... ఎంతసేపూ కొండపైకి ఎక్కడం గురించే ఆలోచన... వన భోజనాలకి ఎక్కువగా ప్రెఫెర్ చేసేది ఆ ఏరియానే. అదే కాకుండా ఒక్కో వారం ఒక్కో ప్లేస్ కు. ఇటు సివిని అనే వూరు... అటు తోటపల్లి. ఇంకా మరి కొన్ని ఏరియాలు.. దీపావళి దాటగానే వచ్చే ది కార్తిక మాసమే కాబట్టి ఆ టపా కాయల సందడి ఈ మాసమంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది... సిటి ల లోకి వచ్చాక వనభోజనాలు వివిధ రూపాలను సంతరించు కోవడం చూస్తె మొదట్లో ఆశ్చర్యం అనిపించినా ఇప్పుడు అలవాటై పోయింది... స్కూల్ పిల్లల , కాలేజి స్టూడెంట్ల , ఉద్యోగస్తుల గ్రూప్ లు సరే.. కాని కమ్మ వనభోజనాలు, వైశ్య వనభోజనాలు, ఇలా కులాల గ్రూప్ ను చూస్తేనే ఆశ్చర్యం... అయినా ఏదో ఒక రూపం లో ఒక మనిషి తో మరో మనిషి సత్సంబంధాలను కలిగి ఉండటంరొటీన్ లైఫ్ కు బిజీ లైఫ్ కు, యాంత్రిక జీవితాలకు కాస్తంత వూరట... అంతే కాకుండా ఈ మాసం లో వాతావరణం బాగుంటుంది కూడా.. ఇటువంటి వాతావరణం ఉన్నపుడు ప్రకృతి లో మమేకమవడం కన్నా ఆనందం ఏముంటుంది? ఈ ఆనందం ఏ పబ్బ్ లలో లభిస్తుంది?
ఇన్ని కబుర్లు చెప్పక కొసమెరుపు ఏమిటో తెలుసా? గోదావరి ప్రక్కనే ఉన్నా , ఇంతవరకూ ఏ ప్రకృతి తో మమేకమాయే కార్యక్రం లోనూ పాలుపంచుకోలేదు... ప్రొద్దున్నే ప్రకృతి పిలుపు నందుకొని రొటీన్ లోకి ప్రవేశించడం తప్ప...
బై,
మురళి.