31, డిసెంబర్ 2009, గురువారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు

గడచిన సంవత్సరంలో జరిగిన ప్రతి అనుకూల సంఘటనను ప్రోత్సాహకం గా స్వీకరిస్తూ, ప్రతి ప్రతి కూల సంఘటనను అనుభవంగా భావిస్తూ, ముందుకు సాగాలనే దృఢ సంకల్పానికి అడ్డంకులైనా ఆశీర్వచనాలుగా, ప్రతిబంధకాలనే సవాళ్లుగా , ప్రతీ క్షణం మనస్సుని ప్రోత్సాహ పరుస్తూ, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని, అందుకు ఈ నూతన సంవత్సరం సహకరించాలని ఆశిస్తూ,
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

29, డిసెంబర్ 2009, మంగళవారం

మరో సంవత్సరంకు స్వాగతం...

జీవిత కాలానికి సరిపడా అనుభవాలను ఇచ్చిందని పిస్తోంది ఈ వెళ్లి పోతున్న రెండు వేల తొమ్మిది... మనుషుల ప్రాణాలు పోవడం అనేది ఏ సంవత్సరం లో నైన జరిగేదే అయినప్పటికీ మనుషుల మధ్య అడ్డు గోడలు కట్టు కోవడానికి నాంది పలికిన సంవత్సరమిది... ఇన్నేసి రోజులు బంద్ లు, ఇన్నేసి రోజుల దీక్షలు, ఇన్ని రాజీనామాలు, ఇన్ని రోజుల స్తంభన, ఇంత మంది సామాన్య ప్రజలు ఇబ్బందుల పాలవడం, రాను రానూ రాష్ట్రము లో పరిశ్రమలు వేరే ప్రాంతాలకు తరలిపోనున్నాయా? ధరలు దారుణంగా పెరిగిపోనున్నాయా? సామాన్యుల ఇబ్బందులు మరీ మితిమీర నున్నాయా?
సమస్యల నిచ్చి పోతుంది రెండు వేల తొమ్మిది, ... వాటిని పరిష్కరించడం లో ఎంత మేరకు సఫలీకృతమవుతుందో ఈ రెండు వేల పది...
అన్నీ సమస్యలు ... సృష్టించింది కాలం కాదు... మనమే... కాని ... పరిష్కరించేది కాలమే...
ఏది ఏమైనప్పటికీ పాత సంవత్సారానికి వీడ్కోలు చెప్పాలి...
కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకాలి...
విష్ యు ఏ హ్యాపీ న్యూ ఇయర్... రెండు వేల పది...

24, డిసెంబర్ 2009, గురువారం

మళ్ళీ అక్కడ మొదలైంది...

ఇక్కడి వాళ్ళకు (అంటేరాయలసీమ మరియు కోస్తాంధ్ర వాళ్లకన్నమాట) కాస్త రెస్ట్ తీసుకోమ్మన్నారు... అక్కడ తెలంగాణా వాళ్ళకు మళ్ళీ బంద్ లు చేసుకొమ్మని అనుమతి నిచ్చారు... శ్రీమాన్ కే సి ఆర్ గారు గర్జించిన బెబ్బులి లా వస్తానన్నారు కదా... బొబ్బిలి బెబ్బులి ... పటపట పళ్ళు కొరుకుతూ , చట చట చట చట ముందు కురుతుకూ, ..... ఇలా కొంత కాలం సమైఖ్యాంధ్ర అంటూ కొన్ని తగలపెడతారు. ..... కొంత కాలం తెలంగాణా అంటూ తగలపెడతారు... తరువాత తినడానికి ఏమీ దొరకక అన్నీ కాల్చగా మిగులుతుంది కదా... బూడిద... అది తిని చదువు కుంటారు... రెండు వేల పన్నెండు నాటికి ప్రపంచం నాశనం అవుతుందని సినిమా తీశారు... అది జరుగుతుందో లేదో కాని, భారత దేశ పటంలో ఆంద్ర ప్రదేశ్ (అంటే తెలంగాణా, సీమాంధ్ర) మిగులు తుందో ... లేదో...
"నా కేదో సంశయం గానే ఉంది ... ఈ జగత్తు ఎన్నడు చితికి పోతుందో అని... ఏదో సందియం గ ఉంది ఏ నగరం హిరోషిమా కనుందో అని" అన్నారు కదా డా.సి.నా.రే. గారు... ఆ నగరం ఏమిటో తెలుసా... ..... ఆ ... అది...
మురళి.

22, డిసెంబర్ 2009, మంగళవారం

నో కామెంట్...

దేవుడి ప్రసాదలకూ తెలంగాణా, ఆంద్ర తేడా చూపిస్తున్నవారు రేపు ప్రత్యెక రాష్ట్ర మిస్తే ఆంద్ర వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో?

మొహం మీద ఉమ్మి వేశా రంట... ఇది సరిఅయిన చర్య యేనా?

హైదరాబాద్ పరిస్తితి ఏమిటో?

ఇంకా ఈ సమస్యను ఎన్నాళ్ళు సాగదీస్తారో?

ఏమి జరిగినా మన మంచికే... అందు కోసం చావడం ఎందుకు?

మరెందుకు... జిల్లాలను రద్దు చేసేసి... అన్నిటినీ రాష్ట్రాలుగా చేసేస్తే సరి...

ఏమిటో... అన్నీ పిచ్చి ప్రశ్నలు...

(ఏమీ వ్రాయడానికి మూడ్ లేక ఏదో పిచ్చిగా వ్రాసాను... దయచేసి కామెంట్స్ చేయకండి...)

18, డిసెంబర్ 2009, శుక్రవారం

నాది దిక్కుమాలిన తప కాదు... జై సమైఖ్యాంధ్ర

దిక్కుమాలిన కామెంట్స్ చేసిన వారికి సమాధానం చెప్పడానికి ఈ నెట్ సరిగ్గా పని చేయడం లేదు... కాని ఒకటి మాత్రం చెప్పగలను... ముక్కలు అయిపోవడం ప్రారంభిస్తే అది రెండు ముక్కాలా తో ఆగిపోతుందని అనుకోవడం అవివేకం. పెరిగే ఖర్చులు ఖజానాకు కాదు మన లాంటి దిక్కుమాలిన ప్రజలకే భారం... రాష్ట్రం ముక్కలైనా, కాక పోయినా పోయిన ప్రాణాలు, ధ్వంసమైన ఆస్తులు తిరిగి రావనేది నిజం.. ఈ ఉద్యమాలతో ఏమి జరిగినా మన లాంటి దిక్కుమాలిన వాళ్లకు ఒరిగేది ఏమీ లేదు... కలసి ఉండగా సాధించలేనిది ... విడి పోయి ఏం సాధిస్తారో, మీ విజ్ఞత తోనే ఆలోచించుకోండి... ఏది ఏమైనా మీరు విడిపోవడానికి ఉద్యమాలు చేస్తుంటే, మేము కలిసి ఉండాలని చేస్తున్నాం... జై సమైఖ్యాంధ్ర...

16, డిసెంబర్ 2009, బుధవారం

జై సమైఖ్యాంధ్ర...

ఈ మధ్య నెట్ సరిగ్గా పని చేయడం లేదు... అందుకే ఇంత గొడవగా ఉన్న ఏమీ వ్రాయలేకపోయాను... మా ఆవిడ, మా తేజస్విని తెలంగాణా లో (హైదరాబాద్) ఉండిపోయారు... నేనేమో ఇక్కడ ఆంధ్ర లో ఉండిపోయాను. రాత్రి కి రాత్రి తెలంగాణా ప్రకటించేసి నట్టుగా... ఆంధ్ర తెలంగాణా వేర్వేరు రాష్ట్రాలుగా చేసేసి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి పోవాలని రూల్స్ పాస్ చేసేస్తారేమో... అప్పుడు నువ్వక్క డుంటే, నేనిక్క డుంటే... ప్రాణం విల.. విలా... అంటూ పాటలు పాడుకోవాలి... ఇలా ప్రత్యెక ఆంధ్ర, ప్రత్యెక తెలంగాణా, ప్రత్యెక హైదరాబాద్, ప్రత్యేక ఉత్తరాంధ్ర, ప్రత్యేక రాయలసీమ, ..... అంటే బ్రిటిష్ కాలానికి ముందు... ఊరుకు ఒక సంస్థానం ఉన్నట్టుగా... కురుపాం సంస్థానం, బొబ్బిలి సంస్థానం, విజయనగరం సంస్థానం, రాజం, రాజమహేంద్రవరం, పిఠాపురం సంస్థానం, .... ఇలా అన్నమాట... అంతకు ముందు ముక్కలు ముక్కలుగా ఉన్న భారత దేశాన్ని బ్రిటిష్ వాళ్లకి అప్పగించాం... ఇప్పుడు ఏ అమెరికా వాడికో అప్పగిస్తాం... చరిత్ర పునరావ్రుత్త మవుతుందంటే ఏంటో అనుకున్నాను... ఇలాగే నన్న మాట ... అమ్మో ... అర్జెంటు గా హైదరాబాద్ సంస్థానానికి .... అదే... హైదరాబాద్ నగరానికి వెళ్లి, తెలంగాణా రాకముందే మా పాపను తెచ్చేసుకోవాలి... (ఇదే అవకాసం నాకు.. మా ఆవిడను వదలి వచ్చేస్తా...)
జై సమైఖ్యాంధ్ర...
మురళి.

4, డిసెంబర్ 2009, శుక్రవారం

ఐచ్ తీం తావాలి...

ఈ మధ్యనే జరిగిన సంఘటన... మా తేజస్విని ని ఒక పెళ్ళికి తీసుకొని వెళ్ళడం జరిగింది... అదీ కటక్ లో. పెళ్లి వాళ్ల భోజనాలు పెట్టిన సమయం... ఆ వంటలు... ఆ తీరు ... మా వాళ్ళకెవరికీ నచ్చక, ఆ రోజు రాత్రి అంత బయట భోజనాలు చేసి, పెళ్లి సమయానికి కళ్యాణ మంటపం చేరాము.. మేము భోజనాలు చేయలేదని వాళ్లు స్వీట్ లు, ఐస్ క్రీం లు తెచ్చారు... మేము దాదాపుగా అలిగి తినకుండా కూర్చున్నాము... ఐతే మా పాపకి ఎదురుగా ఐస్ క్రీం కనిపించేసరికి, "నాన్న... ఐస్ తీం ... తావాలి... తింతా" అంటూ మొదలు పెట్టింది... చిన్న పిల్ల కదా.. పెట్టాలని ఉన్నా... సందర్భం వేరే కదా... అదీ కాక.. ఆ మంటపం ఒక పాత జగన్నాధ స్వామి గుడి... చల్ల గాలి లోపలికి వచ్చేస్తోంది.. ఆ టైం లో ఐస్ క్రీం అంటే.. రిస్కే కదా.. అందుకే ... "వద్దు... జలుబు చేస్తుంది... " అన్నాను... వెంటనే ఆమె సమాధానం చెప్పిన తీరు చూసి అంత సీరియస్ సమయం లో కూడా నవ్వు వచ్చింది... అంతేనా... చచ్చినట్టు ఐస్ క్రీం తినిపించాల్సి వచ్చింది.. తన బుల్లి చేతులతో తన ముక్కును పట్టుకుని పిండుతూ, తరువాత ఆ చేతిని నా మొహం మీద పెట్టి... "తూరు నాన్న... జలుబు లేదు... ఐస్ తీం పెట్టు..." అనటం తో ఇంక తప్పలేదు

తరువాత ట్రైన్ లో వస్తుండగా ఒరిస్సా నుండి ఆంధ్ర వస్తూండగా పెద్ద సరస్సు కనబడుతోంటే... "బెద్ద లాల... " అంటూ సంబర పద సాగింది.. అంతేనా.. "నాన్న.. ఇది గోదావరి లాల?" అంటే "కాదమ్మా... "అన్నాను.. అప్పుడు వెంటనే వచ్చిన మరో ప్రశ్న : "మరి... ఇది ఎవరి లాల?"

"అమ్మ బ్రహ్మ దేవుడో... కొంప ముంచి నావురో.. ఇంత చక్కని పాపను ... యాడ దాచినావురో... " అని నేను పాడితే "ఇంత చత్తని నాన్నని యాడ దాచినావురో" అంటూ పాడుతుంది... ఇప్పటి నుంచే ఎక్కడ ఏ వర్డ్ మార్చాలో తెలిసిపోయింది మరి నా చిన్నారికి... "

మళ్ళీ మరోసారి...

మురళి.