నమస్కారం ట్రేడింగ్ మిత్రులారా ....
కొద్దిగా స్పందించండి ... బాగుందనో ... బాలేదనో ... అర్థం కాలేదనో లేదా దరిద్రంగా ఉందనో ...
తెలిసిన వాళ్ళైతే ఇంతకన్నా మంచిగా లాభం రావాలంటే ఏమి చేయవచ్చో సూచించండి ... తెలియని వాళ్ళైతే ఇంకా క్లియర్ గ వ్రాయమని చెప్పండి ... ఇదేమీ డబ్బు సంపాదించడానికి ఖచ్చితమైన దారి కాదు ... ఒక నెలలో లాగా రెండో నెలలో ఉండదు .. అలాగే నెల నెలా ఉండదు. ఏ నెలకానెల ... కొత్తగా ఉండొచ్చు ... తిక్కగా కూడా ఉండొచ్చు ... ఈ దారి మూసుకుపోయేలోగా ఎంత వీలయితే అంత ... ఉపయోగించుకోవడానికి ప్రయత్నిద్దాం ...
సరే ... మరి విషయం లోకి వచ్చేద్దాము ...
ముందు నెల ట్రేడ్ 23 ఫిబ్రవరి కి ముగించాం ... నెలంతా హోల్డ్ చేస్తే ... ఏ కొత్త ట్రేడ్ చేయకుండా అదే ట్రేడ్ ను నెలంతా ఉంచితే ... కేవలం రూ 2500/- వచ్చింది ... ఒకవేళ ఫుట్ మరో లాట్ కొని ఉంటె 23 ఉదయం ... అది సాయంత్రానికి 150 పాయింట్స్ పెరగడం వల్ల ఫిబ్రవరి లాభం 6వేల 7 వందలకు పెరిగి ఉండేది
ఇక ఫిబ్రవరి 23 వ తేదీన , మార్చ్ 23 ముగింపు తేదీ గ తీసుకుని కాల్ మరియు ఫుట్ అమ్మకం మరియు కొనుగోలు చేసాం.
At ది money - Strike Price - 40000 - ఈ ధరవద్ద కాల్ మరియు ఫుట్ సెల్ ఆర్డర్ ప్లేస్ చేశాం
41000 వద్ద కాల్ మరియు 39000 వద్ద ఫుట్ బయ్ ఆర్డర్ ప్లేస్ చేశాం
కాల్ సెల్ ప్రీమియం ధర - 805; ఫుట్ - 715;
కాల్ బయ్ ప్రీమియం ధర - 350; ఫుట్ 356.75
28 ఫిబ్రవరి తేదికి ఓవర్ ఆల్ లాస్ 3684 ఉంది .
అందుకని 345 రూపాయల కాల్ యాడ్ చేశాం
అది కాస్త ఈ రోజుకి 446 కి పోవడంతో ప్రాఫిట్ బుక్ చేస్తే 2,525 రూపాయల లాభం వచ్చింది
అంతే కాకుండా నిన్నటి 3684 లాస్ ఈ రోజుకి -2740 అయ్యింది.
అంటే ఓవర్ ఆల్ ప్రాఫిట్ (-)215/-
మళ్ళీ 41300 strike price దగ్గర 291 రూపాయలకు మరో కాల్ ఆర్డర్ యాడ్ చేశాం ... అది 350కి పెరిగింది . ప్రాఫిట్ బుక్ చేస్తే బెస్ట్ కదా ... 1470 వచ్చింది ...
అంటే రెగ్యులర్ ట్రేడ్ ప్రాఫిట్ = (-)2454/-; కొత్త కాల్స్ వల్ల లాభం 3995 రూపాయలు...
అంటే ఈ రోజుకి ఈ నెల మొత్తం లాభం 1541/- మాత్రం..
గమనించండి... 23 న ప్రారంభించిన ట్రేడ్ ఇది ... 28 వరకు రెగ్యులర్ ట్రేడ్ కు అదనంగా కొత్త ట్రేడ్స్ ఫిబ్రవరి 28 మరియు మార్చ్ 1 న మాత్రమే చేశాం ... 23 నుండి ప్రతి రోజూ అదనపు ట్రేడింగ్ లు జాగ్రత్తగా చేయగలిగితే ఇంకా ఎక్కువ లాభం చూడవచ్చు ... కానీ లాభం ఖచ్చితంగా వస్తుంది అనిపిస్తేనే ట్రేడ్ చేయాలి. లేకపోతె రెగ్యులర్ ట్రేడ్ లో లాస్ కు మరికాస్త లాస్ తోడవుతుంది...
కాస్త స్పందించండి...
రేపు గురువారం ... వారాంతపు ముగింపు ఉంటుంది.
ఈ రోజుకి సెలవ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి