21, సెప్టెంబర్ 2009, సోమవారం

జోక్...

మూడు రోజులుగా ఆఫీసు పని మీద వేరే వూరు వెళ్లి వచ్చిన సుబ్బా రావు తన పాప ముద్దు ముద్దు మాటలు వింటున్నాడు... ఎదురుగా అతని భార్య రతీ దేవి వారి మాటలను ఆనందంగా వింటూంది... పాప అంటుంది... " నాన్నా!... మొన్న నువ్వు ఊరు వెళ్లి పోయాక ఎదురింటి అంకుల్ మన ఇంటికి వచ్చాడు..." "వచ్చాడా తల్లీ... నీతో ఆడుకున్నాడా?" అడిగాడు సుబ్బా రావు... "కాదు... నాన్న... సరిగ్గా విను..." అంది ఆ పాప... "సరే... సరే... చెప్పమ్మా..."
"అంకుల్ వచ్చాడు... అమ్మేమో కుర్చోమంది..."
"తరువాత?" అడిగాడు సుబ్బా రావు...
"కాఫీ.. త్రాగాడు... మాకేమో చాక్లెట్ ఇచ్చాడు..."
"తరువాత..."
"అమ్మ అంకుల్ ని మన బెడ్ రూం కాట్ మీద కుర్చోమంది..."
"తరువాత?" ఏదో అనుమానం... ఆ అడగడం లో... అందుకే ఎదురుగా ఉన్నభార్య వైపు చూస్తూ అడిగాడు...
"చెప్పమ్మా... తరువాత?"
"అమ్మ కూడా అంకుల్ ప్రక్కనే కూర్చుంది..."
ఎదురుగా ఉన్న రతి దేవి మొహంలో కలవరపాటు... సుబ్బారావు లో వుత్సుకత...
"చెప్పు తల్లీ... తరువాత ఏమైంది...?"
పాప చెప్పడం పూర్తైన మరుక్షణం ఏమవుతుందో నాన్న టెన్షన్ రతీ దేవి మొహంలో... పాప చెబుతున్న విషయం వింటూన్న కొద్దీ సుబ్బా రావు మొహం లో మారుతున్న రంగులు... ఇక భార్య పని పట్టడమే లేటు అన్నట్టు లేచి నించుని పాప చెప్పేది పూర్తిగా వినాలని , ఆగాడు...
"మరే... "
"ఆ.. చెప్పమ్మా... తరువాత?"
ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్లు ఆగింది.. పాప....
"తరువాత.. నువ్వు పక్కింటి అంటీ ... ఆడుకున్నారు... కదా... ఆ ఆట ఆడుకున్నారు...?"

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి