31, జులై 2013, బుధవారం

మల్లిక్ మార్క్ కామెడి ...


తెలుగు వన్ డాట్  కామ్ నుండి ...    నాట్ ఫర్ ఫన్ ...  ట్రాజెడీ లో కామెడీ ... 
 
 
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే తెలుగు సినీ పరిశ్రమ రెండుగా చిలీపోవచ్చు...ప్రస్తుతం టాలీవుడ్ గా పిలవబడుతున్న తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణా ఏర్పడితే తెలంగాణావుడ్, ఆంధ్రావుడ్ గా చీలిపోవచ్చు.
అప్పుడు టాలీవుడ్ లో హిట్ అయిన చిత్రాలను తెలంగాణా వుడ్ లో రీమేక్ చేస్తారు....అది ఎలాగంటే...
 
టాలీవుడ్ లో హిట్ అయిన చిత్రాలు: తెలంగాణ వుడ్ లో రీమేక్ అయ్యాక టైటిల్స్:

1. రచ్చ     ---  లొల్లి

2.
పోకిరి   ---  లంగాగాడు
3.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు   ---  పోశయ్య ఇంటి ముంగట పొనగంటి సెట్టు

4. అమ్మోరు    ---  మైసమ్మ

5. పరుగు    ---   ఉరుకు

6. సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం     ---   మల్లేశ్ ఫ్రమ్ మల్కాజ్ గిరి

7. అమాయకుడు    ---   ఔలగాడు
8. నారీ నారీ నడుమ మురారీ    ---   పోరీ పోరీ నటిమిట్ల NDతివారి

ముక్క లైన విశాలాంధ్ర

ఆంధ్ర ప్రదేశ్ ని  మొత్తానికి ముక్కలు చేసారు  ... ప్రస్తుతానికి రెండు ముక్కలు ... 
 
నా మటుకు నాకు ఇది చాల బాధాకరమైన విషయం ... ఒక దురదృష్టకర సంఘటన ... ఒక చారిత్రాత్మక తప్పిదం ... కేవలం స్వయంకృతాపరాధం ... 
 
ఒక్కటిగా సాధించలేనిది ... విడివిడిగా ఉండి ఎలా సాధిస్తారో , ఏమి సాధిస్తారో ... నా మట్టి బుర్రకు అందని ఆలోచన ... 
 
....... ..... 
 
బయటకు వ్యక్త పరచ లేని బాధ మనసంతా నిండి పోతోంది ... 
.... ..... ...... 
 
అకస్మాత్తుగా సొంత వారు పరాయి వారైన భావన ... 
 
...... ...... 
 
సారీ .... 
 
 
 
 
 
 
 
 

25, జులై 2013, గురువారం

కారు చౌకగా ... షేర్లు ....

రాను రానూ షేర్ / స్టాక్ ల ధర కిందకు దిగిపోతూ ... మదుపర్లకు రా రమ్మని ఆహ్వానిస్తున్నాయి ..  కొనుక్కోమని కోరుకొంటున్నాయి ... 

రిస్క్ తక్కువైన బ్యాంకు షేర్లు ... బాగా తక్కువ ధరకు దొరికే పరిస్తితి ఉంది ...  సేవింగ్స్ కోసమైతే మాత్రం ప్రస్తుతం కొనుక్కొనే అవకాశం ఉన్న తరుణమని చెప్పవచ్చు .  

ఈ మధ్యనే రూ . 500. 00 ల వరకూ వెళ్ళిన ఎస్ బ్యాంకు స్టాక్ ప్రస్తుత ధర రూ . 379 . 00 మాత్రమె ... చీప్ గా దొరికే సౌత్ ఇండియన్ బ్యాంకు స్టాక్ Rs.22. 00 - Rs.23/- మధ్య ఊగిసలాడు తుంది .   ఇక ఆంధ్ర బ్యాంకు అయితే ఈ రోజు రూ. 75. 00 కు చేరుకుంది ... ఇంకా తగ్గ వచ్చని అంటున్నారు ... అయితే ఈ మాటలను పట్టించు కోవలసిన పని లేదు ...

ఎందుకంటె తగ్గుతూ వస్తున్న స్టాక్ రేట్ ఇంకా తగ్గుతుందని ...  పెరుగుతూ ఉన్న స్టాక్ ఇంకా పెరుగుతుందని .. జాతక రత్నాలు చెపుతూనే ఉంటారు ... ఇంకా తగ్గాక కొందాములే .. అనుకుంటే సడన్  గా పెరిగి పోవచ్చు ... ఇంకా పెరిగాక అమ్ముకో వచ్చులే అనుకుంటే ... అకస్మాత్తుగా కూలి పోవచ్చు ... ఒక పర్సంటేజ్ అనుకోని ... తరువాత పరిణామాలను ఆలోచించ కుండా ట్రేడ్ చేయడమే ఉత్తమం .. 

ఈ రోజు ధరలో ఆంద్ర బ్యాంకు స్టాక్స్ కొంటె ... ఒక లక్ష రూపాయలకు 1333 స్టాక్స్ కొనవచ్చు.  ఒక సంవత్సరం లో ఈ స్టాక్స్ పై వచ్చే డివిడెండ్ రూ . 6665. 00 ... అంటే 6. 66% వడ్డీ ని స్టాక్స్ ను కదల్చ కుండా ఒక సంవత్సరం ఉంచితే పొందవచ్చు ... లేదా ఇంత లోగా పెరిగితే అమ్ముకో వచ్చు .. లేదా ఇంకా తగ్గితే average చేసుకోవచ్చు ... dividend (interest) పెరుగుతుంది ... కాబట్టి ఎలాగైనా నష్టపోవడం జరగదు ... 

లాంగ్ టైం investment చేసే వారికైతే మాత్రం ఇది వదులుకో రాని అవకాశం . 


బై

మురళి