29, జులై 2010, గురువారం

శవాసనం వేస్తె శవంగా మారతారా?

ఈ మధ్య ఒక ప్రైవేటు న్యూస్ ఛానల్ లో ముప్పావు గంట సేపు వార్త ఇది...
"శవాసనం వేస్తె శవం గా మారతారా?" అంటూ ఏదో అద్భుతమైన న్యూస్ సంపాదించినా ఫీలింగ్ తో ముఖమంతా వెలిగి పోతుండగా ప్రశ్నిస్తూ "వివరాలు బ్రేక్ తరువాత..." అంటూ మాయమయ్యాడు అనౌన్సర్ ... కొన్ని యాడ్స్ ను ప్రేక్షకుల ముందుకు వదిలి.
ఇదేదో వెరయిటీ వార్తలాఉందే ..... అనుకుంటూ ఓపిగ్గా ఆడ్స్ అన్నీ చూసాను... వెయ్యడానికి ఇంకా ఏమీ యాడ్స్ లేవు కాబోలు... త్వరగానే ముందుకు వచ్చాడు అనౌన్సర్ ...
ఎవరో ఒక మహానుభావునికి పొద్దున్నే ఆసనాలు వేయడం అలవాటంట... రోజూ లాగానే ఆ రోజు కూడా ఆసనాలు వేస్తూ శవాసనం వేసిన ఆ వ్యక్తీ చాలా సేపటి వరకూ కదలక పోయేసరికి ఇంట్లో వారు డౌట్ తో కదిలిస్తే కదలకుండా ఉన్నాడట.. డాక్టర్ ను పిలిపించి చూపించే సరికి అర్థమయ్యిందిట ... శవాసనం వేస్తున్న ఆ వ్యక్తీ శవం గా మారాడని...
నాలుగు రకాల యాంగిల్స్ లో ఆ వ్యక్తీ శరీరాన్ని టీవీక్షకులకి చూపించాక చర్చ ప్రారంభం.. ఇద్దరు వ్యక్తులతో... ఒకరు యోగాకు సమర్థిస్తూ... ఇంకొకరు విమర్శిస్తూ... గురువు లేకుండా వేయకూడదు అంటూ.. అసలు శవాసనం ఎలా వేయాలో చూపిస్తూ.. మధ్యలో రామ్ దేవ్ లాంటి వారని విమర్శిస్తూ.. ఇలా సాగింది ఆ వార్త... అంతే కాదు... అసలు యోగా వల్ల ఆరోగ్యం రాదు సరికదా.. రక రకాల అనారోగ్యాలు వస్తాయని ఆ ఇద్దరిలో ఒకాయన సెలవిచ్చేసాడు కూడా... ఇలా ఈ విషయం మీద ప్రేక్షకుల అనుభవాలనూ, అభిప్రాయాలను కూడా ఆహ్వానిస్తూ మరో వారం రోజులు ఈ వార్తను బ్రతికిస్తారేమో అనిపించింది...
ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కాలేదు... యోగ వలన ఆరోగ్యం వస్తుందా... అనారోగ్యం వస్తుందా... లేక చావే వస్తుందా... అనే విషయం పక్కన పెడితే... అసలు ఇప్పుడు యోగా బోధిస్తున్న వారికి యోగా గురించి సరి అయిన అవగాహన ఉందా ? అనే డౌట్ వస్తోంది..
అసలు మనిషి చావు ఇంత ఈజీ గ వచ్చేస్తే చావాలను కున్న ప్రతి వోక్కరూ నుయ్యో... గొయ్యో ... చూసుకోకుండా ఆసనాలు ట్రై చేస్తే సారి... సుఖంగా చచ్చి పోవచ్చు...
ఆ చనిపోయిన వ్యక్తీ నిద్ర లోనో, యోగ అయిపోయాక ఏ పేపర్ చదువు తూనో పోతే... అసలు ఏవరూ పట్టించుకొనే వాళ్ళే కాదు...
కొసమెరుపు ఏమిటంటే... ఈ వార్త కంటే ముందే పాకిస్తాన్ లో విమాన ప్రమాదం ... ఏభై మంది మృతి... అంటూ చెప్పారు ... కాని విమానం లో ప్రయాణం చేస్తే ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోతాయ అని చర్చ పెట్టలేదు... బహుసా ఈ ఆలోచన ఆ చానెల్ వారికి రాలేదేమో...
....
మురళి.

(మన ప్రాచీన పద్ధతులలో ఖచ్చితంగా ప్రయోజనం ఉంది ఉంటుందనినమ్మే వాళ్ళలో నేనొకడిని.. కాకపోతే వాటిని సారి అయిన రీతిలో ఉపయోగించుకోకుండా.. ఏకంగా అవి మంచివే కాదని విమర్శించడం... క్షవరం సరిగ్గా చేయ చేత కాని మంగలి బుర్ర వంకగా ఉంది అని విమర్శించి నట్టు గా ఉంటుందని నా భావన..)