26, ఫిబ్రవరి 2009, గురువారం

గూగుల్ సెర్చ్, పే ఫర్ క్లిక్ లాంటివి తెలుసా?

ఈ ఇంటర్నెట్ ద్వార రోజుకి రెండు గంటలు పని చేయండి... నెలకు లక్ష సంపాదించండి... అంటూ ప్రతిరోజూ పేపర్లోను, బస్సుల్లోనూ, మన పర్సనల్ మెయిల్స్ లోనూ, ప్రకటనలు చూస్తూ ఉంటాం... వీటికి సంబంధించి ఎవరికయినా, ఏమైనా తెలిస్తే సలహా ఇవ్వండి... కొంత మంది గూగుల్ సెర్చ్ చేస్తే డబ్బులు వస్తాయంటారు... కొంత మంది గూగుల్ వాళ్లు యాడ్స్ క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయంటారు... అసలు వీటిల్లో ఎంతవరకు నిజం వుందో ఎలా తెలుస్తుంది? ఎవరైనా అలా డబ్బు సంపాదించే వారు వున్నారా? ప్లీజ్... తెలిస్తే చెప్పండి....

మురళి.

ఏమీ లేదు....

కొంచం బిజీ ...అందుకే ఏమీ రాయలేకపోతున్నాను. చాల విషయాలు రాయాలని ఉన్నా సమయం చాలదు... బద్ధకం వదలదు. సినిమాల గురించి, రచయితల గురించి., రాజకీయాల గురించి, పత్రికల గురించి, ..... "కాదేదీ రాయడానికి అనర్హం... ఉండాలోయ్ వ్రాతావేశం.... " .......

మురళి.

22, ఫిబ్రవరి 2009, ఆదివారం

శివరాత్రి

శివ రాత్రి శుభాకాంక్షలు... ఉపవాసాలు జాగారాలు చేయండి... దేవుడి కోసం కాదు... మన కోసం... మన ఆరోగ్యం కోసం.... ఈ బిజీ సిటీ లైఫ్ లో అంత సీనుందా... అనకుండా... వీలైతే ప్రయత్నించండి...
మురళి.

20, ఫిబ్రవరి 2009, శుక్రవారం

ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ప్రాచిన గ్రంధాలలో విజ్ఞానం గురించి గాని, పూర్వుల గొప్పదనం గురించి గాని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశ్యం తో నేనీ రాతలు రాయలేదు. తాతల కాలం నాడు తాగిన నేతుల వాసనల ఘుమఘుమల గురించి గోప్పాలను చెప్పుకోవడం కూడా నా ఉద్దేశ్యం కాదు. ఎవరో కనిపెట్టినాక ఇవన్నీ మన గ్రంధాలలో ఉన్నాయని చెప్పుకోవడం కన్నా, మనకు అందుబాటులో గల ప్రాచీన గ్రంధాలను పరిశోధిస్తే ఇంక బయటపడే రహస్యాలు చాలానే ఉండొచ్చు. విదేశీయులు మన భాషలను నేర్చుకొని, మన గ్రంధాలలో విషయాలను ఇంగ్లిష్ లో రాస్తే అవి మనం చదువుకొనే పరిస్తితి లో ఉన్నాం. వేద గణితం అందుకు ఉదాహరణ... అంతే కాదు.. నాకు తెలిసిన విషయాలను కొన్ని నేను వ్రాస్తే, ఇది చదివిన వారికి మరి కొన్ని విషయాలు తెలిసి రాయలనిపించవచ్చు. అలా నాకు మరికొన్ని విషయాలు తెలుసుకొనే అవకాశం వస్తుంది.. తెలుసుకోవాలనుకొనే ఆసక్తి ఉన్నవారికి మరిన్ని విషయాలు తెలుసుకొనే అవకాసం వస్తుంది... గతం కు సంబంధిన విషయాలు మనకు అవసరం లేదనుకొంటే సిలబస్ నుండి హిస్టరీ లాంటి సబ్జక్ట్ అవసరమే మనకు లేదు... కాని మనం తెలుసు కొనేది, గ్రంధస్తం చేసేది మనకోసం మాత్రమె కాదు.. మన భావి తారల వారికోసం కూడా.. ఈ సృష్టిలో మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. ఒక వేళ వాటికి సంబంధించిన విషయాలు కూడా, ఈ ప్రాచీన గ్రంధాలలో నిక్షిప్తమై ఉన్నాయేమో... అలాంటి పరిశోధన మనం చెయ్యలేకపోయిన, ఆలోచన అంటూ ప్రారంభమైతే మన తరువాతి వారైన ఆ దిశలో పరిశోధనలు చేయవచ్చు. మనం ఎక్కడున్నాం ? అనే ప్రశ్న చాలా చిన్నది... సమాధానం విశ్వమంతా పెద్దది... మనం ఎక్కడున్నాం అని నిరాశ పడే బదులు మనమేమి చేయగలం అని ప్రశ్నించుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో ! కనీసం మన కోపాన్ని, నిరాశని, ఆవేశాన్ని, అక్షర రూపం లో పెడితే బాగుంటుందని నా ఉద్దేశ్యం... నేను చేస్తుందీ అదే....

మురళి.

19, ఫిబ్రవరి 2009, గురువారం

మానవ పరిణామం ...

నిన్న నేను డార్విన్ సిద్ధాంతం మన ప్రాచీన గ్రంథాలలో వుందనే విషయం గురించి రాస్తానని చెప్పాను కదా. విచిత్రంగా ఈ రోజు ఈనాడు పేపర్ లో డార్విన్ థియరీ కి సంబంధించి ఏదో ఆర్టికల్ పడింది... నేనింకా చూడలేదు... కాని, .... తరువాత చూస్తాను... ఇంతలోగా, మనం అనుకొన్న వ్యాసం సంగతి చూద్దాం...
సృష్టిలో ఏర్పడిన తొలి ప్రాణి ... ఏకకణ జీవి... అమీబా... జీవ రాశి అభివృద్ది చెందుతూ, తొలి వెన్నెముక ప్రాణి నీటిలో సంచరించే ప్రాణి ఏర్పడింది... అదే చేప... మన దశావతారాల్లో మొదటిదైన మత్స్త్యవతారం...
రాను, రానూ, నాలుగు చిన్న కాళ్ళ తో, అటు ఇటు కదిలే తల తో కూడిన, నీటిలో మాత్రమె కాక నేలపై కూడా నడిచే తాబేలు ఏర్పడింది... అదే కూర్మావతారం. .... అలా వరాహావతారం... పూర్తిగా నేలపై నడిచే జీవి, అప్పుడప్పుడు తన ముందు జీవి లక్షణాలను చూపిస్తూ, బురదలలో పొర్లుతూ ఉంటుంది... aలాగే నరసింహావతారం ... జంతు లక్షణాలను కలిగిన మానవుని రూపం,... సంపూర్ణ మానవుడుగా మారిన వామనావతారం... నేలనంతా ఆక్రమించి, ఆకసాన్ని ఆక్రమించి, ఆక్రమించదానికి మరో చోటు లేక... సాటి మానవుడి తలపై కాలు మోపి, పాతాళం లోకి పంపించిన వైనం మనకు బాగా పరిచితమే కదా... ఒకడికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు... మొదలైన నీతి నియమాలతో కూడిన రామావతారం... కపటాలు నేర్చి, ఒక పురుషుడు ఎంతమంది స్త్రీల తో నైన.. , అలాగే, ఒక స్త్రీకి ఎంతమంది పురుషులైనా ఫరవాలేదని చెప్పిన కృష్ణావతారం...
కాని విష్ణు మూర్తి అవతారాలు పది కాదేమో అనిపిస్తోంది కదూ... బుద్ధుడు విష్ణు అవతారం కాదు, బౌద్ధ మతాన్ని ప్రత్యెక మతంగా వదిలేస్తే హిందూ మతానికి పోటి అవుతుందని... అంతవరకూ హిందూ మతం లో వున్నా లోపాలను సవరిస్తూ బుద్ధుని విష్ణు అవతారంగా మార్చేసారు... అలాగే ఎపుడు వస్తుందో తెలియని కల్కి అవతారం కూడా... మరి వివరంగా పోతే చరిత్ర ని కూడా కలపాల్సి వస్తుంది... అది మరోసారి.....
మురళి.

18, ఫిబ్రవరి 2009, బుధవారం

సృష్టి ... తరువాయి భాగం

ఎంతవరకు వచ్చాం? దేవుళ్ళ నుండి పరమాణు నిర్మాణం లోకి కదూ!

రూథర్ఫర్డ్ , క్వాంటం మొదలైన నమూనాలు ఏమైనా కానివ్వండి. పరమాణువు లో ఉండే ముఖ్యమైన మూలకాలు ఏమని చెప్తాయి? పరమాణు నిర్మాణం గురించి ఏమని చెప్తాయి? పరమాణువు లో అధిక భాగం ఖాలీ అని, మధ్యలో న్యుక్లియస్ అంటే కేంద్రకం ఉంటుందని, అందులో ప్రోటాన్, న్యూట్రాన్ ఉంటాయని, కేంద్రకం చుట్టూ వివిధ కక్ష్యలలో ఎలక్త్రన్స్ తిరుగుతూ వుంటాయని, .... కదా! అంటే సృష్టిలో మొదట పుట్టిన శక్తి కేంద్రకం, కేంద్రకం లో న్యూట్రాన్ శివుడు, ప్రోటాన్ (అంటే ధన లేదా రుణ ఆవేశం లేనిది) చుట్టూ కర్పరాలలో తిరిగే ఎలెక్ట్రాన్స్ విష్ణువని అన్వయించుకో వచ్చు. విష్ణు అంటే అర్ధం వ్యాపించేది కదా... ఒక ఎలక్ట్రాన్ ఉంటే హైడ్రోజెన్ , రెండు ఉంటే హీలిం , అలాగే, లిథియం, beriliam, బోరాన్, nitrozan , సోడియం, ..... అలా నూట ఎనిమిది మూలకలన్నమాట. .... అంటే అష్టోత్తరాలు .... అన్నమాట...

దీనిని బట్టి, మనకేమి తెలుస్తూంది? మన ప్రాచీన గ్రంధాలలో వున్నవి కథలు కావు... విజ్ఞానానికి సంబంధించిన విషయాలని కదూ ...

మరి డార్విన్ మానవ పరిణామ సిద్ధాంతం మన గ్రంధలలోనే ముందుగా చెప్పబడింది... అది ఎలాగో తెలుసా? మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి... లేదా... మళ్ళీ నేను రాసే వరకూ ఆగండి......

మీ

మురళి.

17, ఫిబ్రవరి 2009, మంగళవారం

సృష్టి - దేవుళ్ళు

ఎప్పుడూ షేర్ మార్కెట్ గురించే రాస్తే ఎలా? ఈ రోజు కొన్ని ఇతర విషయాలను కూడా రాయాలని అనిపిస్తుంది. మన హిందువుల దేవుళ్ళ మరియు విష్ణు మూర్తి అవతారాలలో గల రహస్యాలను వెల్లడి చేస్తున్ననాను. ఈ విషయాలు చాల రహస్యాలు. నా బ్లాగ్ చదివే వారికీ మాత్రమె ప్రత్యేకం.

హిందువుల దేవుళ్ళు ఎంతమంది? ముక్కోటి అని చెప్పడానికి మీరు కొంచమైన ఆలోచించరు. సరే... కాని ముగ్గురు ముఖ్యమైన దేవుళ్ళు వున్నారు ... ఎవరు? బ్రహ్మ, విష్ణు మరియు శివుడు. కదా... మరి సృష్టి ఎలా ఏర్పడింది అంటే మా అమ్మమ్మలు, అమ్మ నాన్నలు, మొదలైన పాత కాలం మనుషులు చెప్పే కథ మీరూ వినే ఉంటారు. మీకు తెలియకపోతే నేను రాసేది చదవండి...

సృష్టిలో మొదట శక్తి ఏర్పడింది... అంటే దుర్గ దేవి అన్నా మాట... ఆమె ముగ్గురు దేవుళ్లను సృష్టించింది. బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుడు ... వారిని ఏమి కోరిందంటే ... మీ ముగ్గురులో వొకరు నన్ను పెళ్లి చేసుకోండి అని... బ్రహ్మ విష్ణువులు అందుకు ఒప్పుకోలేదు... శివుడు మాత్రం ఆమెను స్వీకరించాడు.

ఇదే సృష్టికి ఆరంభం ... పరమాణు నిర్మాణం తెలుసు కదా... ఇదే పరమాణువు రహస్యం కూడా...

మరోసారి కలుద్దాం...

13, ఫిబ్రవరి 2009, శుక్రవారం

మరి కొంచం ... షేర్ మార్కెట్ మాటలు ..

కృష్ణ రావు గారికి కృతజ్నతలు... నేను కూడా ఐ సి ఐ సి ఐ లో ఖాతా ఓపెన్ చేశాను. ట్రేడింగ్ కూడా చేస్తూ వున్నాను. కాని, వెంటనే అమ్ముకొని డ్రా చేసుకొనే సదుపాయం ఉండడంతో అవసరం అయితే చాలు, రేట్ తక్కువైనా కూడా అమ్మేస్తున్నాను. అదే నేను చెప్పాలను కొంటున్న ఇంకొక మాట. ఎక్కువ కాలం ఆగే వారైతేనే షేర్ మార్కెట్ లాంటి వాటిలో అడుగు పెట్టడం మేలు. కనీసం రేట్ పెరగక పోయినా, డివిడెండ్ ను అందుకోవచ్చు. ఎక్కువ కాలం ఆగితే ఏదైనా పెరుగుతుంది. ఈ ప్రైవేట్ కంపనిలను నమ్ముకోవడం కంటే బ్యాంకుల షేర్లు కొనుక్కోవడం బెటర్. అవి వేగంగా పెరగవు. కాని మూసేస్తాడనే భయం కు దూరంగా ఉండొచ్చు. రేగ్యులరుగా మనీ కంట్రోల్ డాట్ కం , ఎన్న ఎస్ ఈ ఇండియా , మొదలైన వాటిని ఫాలో అవుతూ వుండొచ్చు. (మళ్ళీ మరోసారి....)

11, ఫిబ్రవరి 2009, బుధవారం

ఇంక షేర్ బ్రోకేర్స్ గురించి..

దేశంలోనే బాగా పేరున్న షేర్ బ్రోకర్ ... కార్వీ స్టాక్ బ్రోకింగ్ ... వీళ్ళ దగ్గర నా ట్రేడింగ్ ఎకౌంటు ఓపెన్ చేశాను. ఈ కార్వీ నెట్ లో ఓపెన్ కావాలంటే జావా డౌన్లోడ్ చేసుకోవాలి. దీనిలో బ్రోకరేజి పెర్సెంతెజి చాల తక్కువ అనే చెప్పాలి. రెండు రకాల ట్రేడింగ్ లలో ఒక రోజు కొని మూడు రోజుల తరవాత అమ్మడం - డెలివరీ ట్రేడింగ్; ఈ రోజు కొని ఈ రోజే అమ్మడం. - ఇంట్ట్రాడే ట్రేడింగ్ . మొదటిది ఒక వేళ రేట్ తగ్గుతూ వుంటే ఎప్పుడు పెరిగితే అప్పుడు అమ్ముకో వచ్చని వదిలేయ వచ్చు. కాని, రెండోది మాత్రం మన రాత మీద ఆధారపడి వుంటుంది. దీనికోసం ఈ బ్రోకర్లు ఇది కొనండి.... ఈ రేట్ వస్తుంది.. అప్పుడు అమ్మండి... అంటూ మనకు సజ్జేస్ట్ చేస్తూ వుంటారు. అయితే నా మటుకు నాకు మాత్రం ఈ సజ్జేషన్ ప్రకారం ఫాల్లో అయినపుడు ఒక్కోసారి లాభం వచ్చేది .... రెండు రూపాయలు, నాలుగు రూపాయలు, పది రూపాయలు, .... పోతే మాత్రం వందలు, వేలు, అలా .... కాబట్టి ఈ బ్రోకర్లు చెప్పే దాని మీద ఆధారపడి లాభాలు సంపాదించాలంటే మాత్రం అది జరిగే పని కాదు... మనం అమ్ముకొన్నా, కొనుక్కొన్నా, వారికి రావలసిన బ్రోకరేజి కి లోటు జరగదు. .... ఎక్కువ బొక్క పడేది మాత్రం మనలాంటి వాళ్ళకే. ఇంత వరకు ఎందుకు .... యెంత నిపుణుడు అయినా షేర్ మార్కెట్ గురించి సరిగ్గా అంచనా వేయలేదు... సత్యమ కంప్యూటర్స్ దీనికి వుదాహరణ ....

(మళ్ళీ కలుద్దాం.... )

ఈ రోజు ఆంద్ర జ్యోతి వెబ్ సైట్ లో మనీ అనే ఫీచర్ చూసాను.... మీరూ చూడండి.

పాత విషయమే ...

Share మార్కెట్ అనుభవాలు : నిజానికి పన్నెండు సంవత్సరాల క్రితం నాలుగువేల ఇదు వందల రూపాయలతో బ్యాంకు అఫ్ ఇండియా షేర్ లను కొనడం ద్వార ఈ రంగంలోకి వచ్చి పడ్డాను. అప్పుడు ఇప్పుడులాగా కంప్యూటర్లు లేవు కదా, పేపర్లో చూసి హెచ్చు తగ్గులు తెలుసుకొనే వాళ్ళం. ఒక్కో షేర్ ధర నలభై ఐదు చొప్పున వంద షేర్లు కొన్న. వారం రోజుల్లో డెబ్భై ఐదుకు పెరిగింది. అంటే షేర్ సర్టిఫికేట్ రాక ముందే మూడు వేలు లాభం వచినట్లిందన్న మాట. అప్పుడే అమ్ముకోవచు కదా! నెల తిరగక ముందే నాలుగువేల ఐదు వందలు కాస్త ఏడు వేలు దాటే సరికి కాలికులటర్ తీసుకొని లెక్కలు వేసుకొని సంవత్సరం అయ్యేసరికి లక్షాధికారి ని అయిపోతానని వూహించేసుకొని అమ్మడం మానేసాను. తీర సర్టిఫికేట్ వచ్చేసరికి ధర కాస్త సగం అయ్యింది. ఒక రెండు నెలలు చూసి, ఇక దాన్ని పట్టించుకోవడం మానేసాను. ఆఖరికి ఐదు సంవత్సరాలు దాటాక దాని ధర వందకు చేరాక అమ్మేసాను. అది గతం. (ఐతే ఈ బ్యాంకు అఫ్ ఇండియా షేర్ ధర ప్రస్తుతం రెండు వందల వరకు వుందనుకుంటా. ... )
సరిగ్గా పన్నెండు సంవత్సరాల తరవాత ....
అంటే పద్నాలుగు నెలల క్రితం ....
మ్యుతువాల్ ఫండ్స్ ద్వార ఆం లైన్ షేర్ మార్కెట్ కథ ప్రారంభం. ...
ముందుగా మ్వుతువాల్ ఫండ్స్ గురించి.. నిజం చెప్పాలంటే వీటి గురించి నాకు పూర్తిగా అర్థం కాలేదనే చెప్పాలి. ఎందుకంటె వీటిలో రెండు రకలన్నారు. ఒకటి డివిడెండ్ ... మరొకటి గ్రోత్ ....
షేర్ మార్కెట్ రిస్కులు ఎందుకనుకొనే వారికి ఇవి సరి అయినవి అంటారు. ... కాని షేర్ మార్కెట్లో వీరు ఏయే షేర్లలో పెట్టుబడి పెడతారో వాటి రేట్ పెరిగితే వీటి రేట్ పెరుగుతుంది... నెమ్మదిగా... కాని తగ్గితే వేగంగా వీటి రేట్ తగ్గిపోతుంది ... ఇంకొక విషయం ఏమిటంటే గ్రోత్ ఫండ్స్ లో యూనిట్లు పెరగవనట.. మరి ఏమి లాభమో ... డివిడెండ్ ఫండ్స్ నయం కదా! లేదా నాకు తెలిసింది తక్కువనా... ? ఎవరకైన తెలిస్తే చెప్పండి ....
మొదట్లో కొన్నవి డబ్బు అవసరం వచ్చి అమ్మేసా తక్కువ ఇంట్రెస్ట్ కి. ఖర్మ కాలి ఆ రిలయన్స్ పవర్ షేర్ మార్కెట్ లోకి వచ్చింది.. నాశనం .... రిలయన్స్ నాచురల్ రెసౌర్చెస్ ఫండ్ .... భయంకరమైన ప్రకటనలు చూసి ఐదు వేలు అప్పు చేసి కొన్నాను. అంతేనా ... ఫ్రెండ్స్ చేత కొనిపించాను కూడా ... ఓక్క యూనిట్ ధర పది రూపాయలు... అప్పుడు... మరి ఇప్పుడు ... ఆరు రూపాయలు ...
జనరల్ గా ఈ మ్యుతువాల్ ఫండ్స్ కొన్నవారు ఎక్కువ కాలం ఆగితే లాభాలు వుంటాయని చెబుతారు. ఎక్కువ కాలం ఆగితే ఏదైనా పెరుగుతుంది.. ప్రభుత్వాల పోస్ట్ ఆఫీసు బ్యాంకు మొదలైన డిపాజిట్లు కూడా ఎనిమిది సంవత్సరాలలో డబల్ అవుతాయి... మరి వీటిలో ప్రత్యేకత ఏమిటో... ఏమిటంటే .... మన రాత బాగుంటే పెరుగుతాయి బాగా.. లేకపోతే పాతాళం లోకే ప్రయాణం చేస్తాయి. .... మనల్ని సమాధి చేస్తాయి.
ఈ షేర్ మార్కెట్ లేదా మ్యుతువాల్ ఫండ్స్ అభిమానులు ఎవరైనా ... ఈ మ్యుతువాల్ ఫండ్స్ గురించి మంచి విషయాలు ఏమైనా చెప్పండి... ప్లీజ్ ... (ఇది ఈ రోజుకి ముగించే విషయం కాదు.....)

మీ
మురళి.

7, ఫిబ్రవరి 2009, శనివారం

షేర్ మార్కెట్ - నా అనుభవాలు

అనుభవాలు అనేది చాల పెద్ద మాటే కాని, నా లాంటి సగటు మధ్య తరగతి జీవికి పెద్ద అనుభవం క్రిందే లెక్క.


౨౦౦౭ చివరలో సెన్సెక్స్ మంచి ఊపు మీద వున్నప్పుడు అంటే ఇరవై వేలు దాటి వుందనుకుంటా.... అప్పుడు మొదటి సారిగా మ్యూచువల్ ఫండ్స్ ద్వార ప్రవేసించానీ వింత లోకం లోకి. దీనికి సంబంధించి చాల విషయాలు వ్రాయాలి

ఈ తెలుగు ను ఇంగ్లీషులో టైపు చేస్తూ ఎక్కువ వ్రాయలేను గాని, కొంచం కొంచం గా ప్రతిరోజూ వ్రాస్తుంటాను. ఈ రోజుకి ఇది చాలు.

మీ

మురళి.