26, జూన్ 2011, ఆదివారం

సోరియాసిస్ ... చర్మ వ్యాధి...

"శరీరం లో ఎక్కడ పడితే అక్కడ దురదలు, గోకి పుండుగా ఏర్పడటం... పుండు మానక మచ్చగా సెటిల్ అవ్వడం... మళ్ళీ మళ్ళీ దురదలు, రక్తం, పుండు, మచ్చ, ఇవి సోరియాసిస్ వ్యాధి లక్షణాలు... "

ఇదేమిటి... సడన్ గా రోగాలు, ట్రీట్మెంట్ లు.. అంటూ మొదలెట్టాడు వీడు.. అనే సందేహం వచ్చింది కదూ...
పూర్వీకుల శాస్త్ర విజ్ఞానం అంటూ మొదలెట్టి, షేర్ మార్కెట్ అనుభవాలు... అంటూ టచ్ చేస్తూ, సంతాన ప్రాప్తి లో స్వానుభావాన్ని వివరించి, ఆ సంతానం కు సంబంధిన ముచ్చట్లు, ఫోటో లను అప్ లోడ్ చేస్తూ, మధ్య మధ్య లో కుళ్ళు జోకులతో నెటిజన్ల సహనాన్ని పరీక్షిస్తూ కాలక్షేపం చేసేస్తున్న నాకు... ఈ చర్మ రోగాన్ని గురించి చర్చించాలని ఎందుకు అనిపించింది... అనే సందేహం ఎవరికైన కలగక మానదు...
కానీ, పైన పేర్కొన్న ప్రతి సబ్జెక్టు నా స్వానుభవం... ప్రకారం వ్రాసినదని నా బ్లాగ్ మిత్రులకు అర్థమయ్యే ఉంటుంది... కాబట్టి ఈ చర్మ రోగం కూడా... అదే కోవకు చెందిదని అర్థం చేసుకోవాలి...
ఈ దరిద్రపు రోగం ప్రస్తుత పరిస్తితుల్లో చాల మందికి వస్తున్నదని, ఆ బాధ తట్టుకోలేక, ఎవరికి తోచిన పద్ధతిలో వారు... అయితే అల్లోపతి, లేకపోతె హోమియో పతి, మరీ కాకపోతే ఆయుర్వేదం, .... అంటూ రక రకాల ప్రయత్నాలు చేస్తూ... తంటాలు పడుతున్నారని .... ఇలాంటి అన్ని ప్రయత్నాలు కూడా చేసిన నాకు అర్థమయ్యింది...
సంవత్సరాల బాధ అనుభవించాక, వేలకు వేలు వదిలించు కున్నాక.... వైద్యులను, వైద్యాలను ... మార్చి, మార్చి... చివరకు... తక్కువ ఖర్చుతో దీనిని వదిలించుకో వచ్చునని తెలుసు కుని... ప్రస్తుతం ఆ పనిలో ఉన్నాను... కాస్త ఫలితం కనబడు తుండటం తో, ఇలా నాలా బాధ పడుతున్న వారు కొంత మంది అయినా దీని వలన ప్రయోజన పడే అవకాశం ఉండాలని.. ఇలా నెట్ లోకి, చొరబడి... వ్రాయాలనే ధైర్యం చేస్తున్నాను...

కాస్త వివరంగా... వ్రాస్తే గాని... నాకు కాలక్షేపం అవ్వదు... చదివే వారికి కిక్ ఉండదు... అందుకని కాస్త ఎక్కువ మోతాదు లో సోది... (ఒకరి బాధ ఇంకొకరికి సోదిగానే ఉంటుంది లెండి) జోడించి... వ్రాస్తున్నాను...

ఫాలో మీ..

నాలుగు సంవత్సరాల క్రితం మెడ వెనుక భాగం లో ప్రారంభం అయ్యింది... ఈ దురద రోగం... మెడ అంతా పోలుసుల్లా గోకి రక్తం.. మళ్ళీ పొలుసులు...
ఎర్రగడ్డ దగ్గర ఒక స్కిన్ స్పెషలిస్ట్ ఉంటె వెళ్ళాను... పట్నాయక్ అనుకుంటా అయన పేరు... ఒక వెయ్యి రూపాయలు మాత్రం ఖర్చు అయ్యింది... మింగడానికి ఒక మందు... రాసుకోవడానికి ఒక క్రీము, మొహం మీద మెడ మీద అప్లై చేయడానికి ఒక రకమైన క్రీము... వ్రాసి నెలకు ఒక వెయ్యి రూపాయలు నా బడ్జెట్ లో చేరింది... కానీ నెలకు వెయ్యి రూపాయలు ఒక చర్మ రోగం కోసం ఖర్చు పెట్టడ మంటే నాలాంటి సగటు మధ్య తరగతి జీవికి కష్టం అవడం వల్లనూ, ఆరోగ్యం మీద కన్నా.. బస్సు పాస్, ఇంటి అద్దె, ... ఇలాంటివే ముఖ్యము అనుకుని నిర్లక్ష్యం చేయడం వల్లనూ, అప్పటికి దీని కన్నా ముఖ్యమైన మరో ప్రయత్నం ... సంతాన యోగం కోసం పరిశ్రమించడం , దానికి సంబంధించి ఖర్చులు, .... అంటి కాలం లోనే ఆ ప్రయత్నాలు, ఫలించి, మా తేజస్విని, మమ్మల్ని కరుణించి, ఈ లోకం లోకి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం, అందుకు సంబంధించిన స్కానింగుల ఖర్చు, మా ఆవిడ మేత ఖర్చు (ఆపిల్ పండు లా ఉండాలని, రోజూ రిలయన్స్ ఫ్రెష్ లో, ఫ్రెష్ ఆపిల్ తీసుకు వచ్చే వాణ్ని కదా.. ), ఇవన్నీ నా చర్మ రోగం పై, శ్రద్ధ తగ్గేల చేసాయి... యేవో క్రీములు పూస్తూ, హైదరాబాద్ లో ఉన్న అన్నీ రోజులూ, ఆ బాధను అలా భరిస్తూ, వచ్చాను...

అయితే ఈ చర్మ రోగానికి అప్పటికింకా నామకరణం చెయ్యలేదు... ఆ డాక్టర్ ను ఇది ఎందుకు వచ్చిందని అడిగితె, ఎండ వల్ల వచ్చిందని, ఎక్కువగా నీడ లోనే ఉండాలని చెప్పాడు... బస్సు స్టాప్ లో ఎండ ఉంటుంది.. కానీ బస్సు లో నీడే కదా.. అయినా, మా పార్వతీపురం లో నా జీవితమంతా సూర్య రావు తో నే కదా గడిచింది... వైజాగ్, కాకినాడ ల లో కూడా, నాతో ఫ్రెండ్ షిప్ చేసిన సూర్య రావు, గోపాల పురం లో మంచి మిత్రుడని పించుకున్న దినకర్ రావు, హైదరబాద్ వచ్చేసరికి నాతొ ఫ్రెండ్ షిప్ కట్ కట్ అన్నడేమిటి అని చాల బాధ అనిపించింది... కోపం తో నీడలో నుంచుని, ఆకాశం కేసి చూసి, సూర్య రావు ని, శాప నార్థాలు పెట్టడం మినహా మరేమీ చేయలేక పోయాను...
కానీ, పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగుతుందా..
ఇక ఈ హైదరాబాద్ లో సూర్యుడు ఇంతే... కుళ్ళు... అని కోపం తో రాజమండ్రి వచ్చేసాను...
ఇక్కడ మాత్రం ఏమి జరిగింది... గోదావరి మాత దయ వల్ల , ఆ దురద కాస్త... ఇంతింతై వటు డింత అయి...... అన్నట్లుగా మెడ నుండి, చెంపలకూ, చేతులకూ, వ్యాపించింది...
.... (సశేషం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి