18, ఆగస్టు 2011, గురువారం

kalindi kaadu... anakonda....

" కాళింది అడుగున కాళీయుని పడగలపై ఆ బాల గోపాల మా బాల గోపాలుని అచ్చెరువున అ చ్చెరువున మెచ్చిన కన్నుల చూడ... " అంటూ సాగుతుంది విశ్వనాధ్ చిత్రం లోని పాట.
ఈ పాట మాట కేమో కానీ మా తేజమ్మ కి కాళీయుని పడగలపై ఉన్న శ్రీ కృష్ణుని చూపించి..."అదుగో చూడు... శ్రీ కృష్ణుడు ఎలా పెద్ద పాము మీద డాన్సు చేస్తున్నాడో " అంటే... మా పాప clarification 
"ఆ పాము నే  అనతొండ (అనకొండ) .... అంటాం" 
నాకు మబ్బు విడి పోయిందని వేరేగా చెప్పాలా?
....
మీ...
మురళి.

14, ఆగస్టు 2011, ఆదివారం

"GREAT"INGS


బ్లాగ్ మిత్రులందరికీ 
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు...
...
మురళి.

6, ఆగస్టు 2011, శనివారం

SHOCK MARKET

STOCK MARKET GIVEN SHOCK TO TRADERS...

కాని  ఇది TRADERS కు మాత్రమె...
INVESTORS కు మాత్రం ఇది GOOD NEWS ....

ఎందుకంటే ఎవడో కొన్న స్టాక్ లను అమ్ముకోవడానికి బ్రోకేర్స్ ను ఆశ్రయిస్తే... ఆ బ్రోకేర్ తన స్టాక్ టిప్స్ లో ఆ స్టాక్ ను కొంటె వారం లో ఇంతగా పెరిగి పోతుందని చెబుతాడు... పైగా స్టాప్ లాస్ ట్రిగ్గర్ చేసుకో మంటాడు... నాలాంటి ఆశ పోతులం ఎడా పెడా కొనేస్తం... తీరా అంత వరకు పెరుగుతున్న అ స్టాక్ ధర తగ్గడం ప్రారంభ మవుతుంది... అంటే ఆ ఎవడో ఒకడు కొన్న వన్నీ అమ్ముకొంటూ ఉంటాడన్నమాట....  ఇంక మన లాంటి వాళ్ళం లబో దిబో మంటూ, నష్టానికి అమ్ముకోవడం .... చాల సాధారణమైన విషయం... 

ఏ బ్యాంకు లోనో దాచుకుంటే ఎన్ని నెలలైనా. వెయిట్ చేస్తాం... సంవత్స రానికి నాలుగు నుండి, ఎనిమిది శాతం వడ్డీ వస్తే చాలని సంతృప్తి పడతాం...
 చిట్ లో దాచుకుంటే నెలకు ఇంత అంటూ రెండు నుంచి ఐదు సంవత్సరాలైనా వెయిట్ చేస్తాం... పన్నెండు శాతం ఇంట్రెస్ట్ వస్తే ప్రపంచాన్ని జయించి నంతగా ఫీల్ అవుతాం...
 పోస్ట్ ఆఫీసు లో అయితే ఎనిమిదన్నర సంవత్సరాల వరకూ రెట్టింపు కాదు... కానీ రిస్క్ తక్కువ, అమౌంట్ సేఫ్ అని ఆలోచిస్తాం...
 అదే షేర్ మార్కెట్ లో అయితే మాత్రం వారం లోపు గానే డబల్ అయి పోవాలని ఆశ పడతాం... కాదు... కాదు... కొంతమంది మేధావులు ఆడే డబ్బాట లో పావులుగా మారి, సంపాదించినా దంతా పోగొట్టు కుంటాం... పైగా షేర్ మార్కెట్ అంతేరా... అది ఒక వ్యసనం లాంటిది... అంటూ లెక్చర్లు దంచుతాం...
 ....

ఎవరి వరకో ఎందుకు... నేనూ అలానే ఆలోచించాను... అందుకనే నష్టపోతూ వచ్చాను.. కానీ ఇప్పుడు షేర్ మార్కెట్ ఎప్పుడెప్పుడు కూలుతుండా అని ఎదురు చూస్తూ ఉన్నాను... ఎందుకంటె అప్పుడు స్టాక్ రేట్ లు తగ్గుతాయి... వీలైనంత ఎక్కువ కొనుక్కోవచ్చు అని... (కాక పోతే ఆ టైం కి డబ్బులు ఉండాలి... అంతే)

అందుకనే ఈ షాక్ మార్కెట్ ... ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ... టాప్ మార్కెట్...
 బెస్ట్ అఫ్ లక్...
 మీ..
మురళి.