26, ఫిబ్రవరి 2011, శనివారం

షేర్ మార్కెట్ లో చిన్న చిన్న లాభాలు... లేదా తక్కువ నష్టాలతో బయట పడటం...


ఏమిటి... హెడింగ్ ఇంత పెద్దది... అనుకోవద్దు... ఇంతకూ ముందు సన్నీ ప్రొఫిట్స్ లో ఆరు వందలు దొబ్బించుకొని వాడు ఇచ్చిన టిప్స్ తో ముందుకు పోయి రెండు వేలు బొక్క పెట్టుకున్నాను.. దాని కన్నా ముందు ఎస్.బి.ఐ. టిప్స్ లో కూడా పెద్దగా లాభ పడింది లేదు... అంత కన్నా ముందు ఐ.సి.ఐ.సి.ఐ. టిప్స్ గురించి మామూలే... వీళ్ళందరిలో కామన్ థింగ్ ఏమిటంటే... వీళ్ళు రేట్ పెరిగి నప్పుడే కొనమంటారు... బహుశా అప్పటికే చాల ఎక్కువ కొన్న వాళ్ళు వీళ్ళకు డబ్బులిచ్చి సజెస్ట్ చేయమంటారేమో ... నాలాంటి బకరా లు కొనటం చేసాక... ఆ స్టాక్ రేట్ తగ్గడం ప్రారంభం అవుతుంది... అది పెరుగుతుందేమో అని చూసీ, చూసీ ఇంకా లాభం లేదనుకొని అమ్మేస్తాం...


అందుకే ఇక లాభం లేదనుకున్నా... షేర్ మార్కెట్ లో నష్ట పోవటం అనుభవం గా భావించి... ఎవడో చెప్పినట్టు ఎవరేజ్ సిస్టం ను పాటించి చూద్దాం అని, ఒక బ్యాంకు స్టాక్ మీద ప్రయోగం ప్రారంభించా... యుకో బ్యాంకు... పై... ఆ ప్రయోగం...


మొదట నూట ఐదు కు ఆరు కొన్నాను... అలవాటు ప్రకారం రేట్ తగ్గటం ప్రారంభం అయ్యింది... వందకి దిగింది... అప్పుడు మరో రెండు కొన్నాను... అంటే కొన్న ధరను సరాసరి చేసానన్న మాట.. అంటే నేను కొన్న ధర నూట మూడు చిల్లర అయినట్టు... తరువాత తొంభై ఐదు, తొంభై నాలుగు ..... తొంభై ఇలా తగ్గుతూ పోతుంటే రెండేసి చొప్పున కొనడం ఆరంభించి చివరకు రెండువేల నూట ముప్పై రూపాయలకు ఇరవై రెండు రక రకాల ధరలలో కొని, సరాసరి ధర నూట మూడు కు అమ్మినా చాలు అనే పధ్ధతి లో కొన్నాను... మొత్తానికి రెండు వేల మూడు వందలకు అమ్మటం జరిగింది... అంటే బ్రోకరేజ్ పోను నూట డెబ్భై సంపాదించ గలిగా నన్నమాట...

నిజానికి ఈ పధ్ధతి నేను కనిపెట్టింది కాదు... నేను తెలుసు కున్నది మాత్రమె... నాలా కొత్తగా షేర్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యేవారు (ఇన్వెస్టర్ లా కాకుండా, ట్రేడర్ లా సంపాదించాలనుకునే వారు..) ఈ చిన్న సూత్రాన్ని పాటిస్తే , ఖర్మ కాలితే మహా అయితే రెండు మూడు వందల లోపే నష్టం తో బయట పడవచ్చు... ఓపిక, మరి కొంచం పెట్టుబడి పెట్టగలిగితే ఈ పద్ధతిలో నష్టం అనే మాటే వుండదు... కాబట్టి అసలు షేర్ మార్కెట్ మార్కెట్ గురించి తెలియని వారు, షేర్ మార్కెట్ లోకి రావాలనే ఇంట్రెస్ట్ వున్నవాళ్ళు, తీర ఎంటర్ అయ్యాక ఇది మన వల్ల కాదు... బయటపడి పోదాం అనుకునే వాళ్ళు, లేదా తక్కువ లాభం చాలు అనుకునే వాళ్ళు, ఈ పధ్ధతి పాటించ వచ్చు.. కొంత సొమ్మును లాంగ్ ఇన్వెస్ట్ మెంట్ చేసి కొంత సొమ్ముతో ఈ విధమైన ప్రయోగం చేస్తే బెటర్... అలా కాదు.... బ్యాంకు లోనో, పోస్ట్ ఆఫీసు లోనో దాచిపెట్టు కున్నట్టుగా, కొంత కాలం ఎదురు చూద్దాం అనుకుంటే... (ఇలా చేసే వారినే ఇన్వెస్టర్స్ అంటారని చదివాను..) ఇక సమస్యే లేదు... కాబట్టి .... ప్రొసీడ్... బెస్ట్ అఫ్ లక్... అండ్ గెట్ స్మాల్ ప్రాఫిట్.... గెట్ రిడ్ అఫ్ బిగ్ లాస్...

మురళి.

(మరో గమనిక... పై సోది అంటా... అస్సలు షేర్ మార్కెట్ గురించి తెలియని వారికి మాత్రమె... లేదా ఎస్ వుండి కూడా లాస్ ను ఎలా తగ్గించు కోవాలో తెలియని వారికి మాత్రమె... ఓస్.. ఇది మాకు... ముందే తెలుసు అనుకునే... వారికి మాత్రం కాదు...)

9, ఫిబ్రవరి 2011, బుధవారం

చి"రన్"జీవి...కాదు... చి"సిట్"జీవి...

ఎవరినైనా దీవించే తప్పుడు "చిరంజీవ" అంటారు... అంటే అర్థం కలకాలం వర్దిల్లమని కదా అర్థం... కలకాలం వర్ధిల్లు తుంది అని ఆశించిన చిరంజీవి ప్రజా రాజ్యం, చిరు ప్రాయం లోనే, అంతరించి పోయింది... చిరంజీవి గారు సంతకం చేసినప్పుడు స్పెల్లింగ్ లో చి"రన్"జీవి అని చేస్తారట.. ఇకనుంచి రన్ ప్లేస్ లో సిట్ అని పెడతారేమో.. ఎందుకంటె పార్టీ ని నడప లేక చతికిల పడి పోయారు కదా... లేదా... కాంగ్రెస్ లోకి మూవ్ అయ్యారు కాబట్టి... చి"మూవ్"జీవి అని చేస్తారా... అసలు ఇది కలా.... మాయా? వాస్తవమా... అవాస్తావమా... చిరంజీవి అభిమానం ఉన్న తెలుగు వాడిగా ఎందుకో జీర్ణించు కోలేక పోతున్నాను... పోనీ పార్టీ ని రద్దు చేసేసి... మళ్ళీ సినిమా లలోకి వచ్చే వచ్చు కదా... ఈ రోజు ఇలా ప్రకటన చేసారు... రేపు ఇంకోలా చేస్తారు... చూస్తుంటే రాజకీయం వంటబట్టి నట్టే అనిపిస్తోంది అయ్యగారికి... రేపు కాంగ్రెస్ పరిస్తితి ఫట్ మంటే... తెలుగు దేశం లోకి "మూవ్" అవుతారేమో...
మురళి.