12, మే 2013, ఆదివారం

ఏ షేర్లు లేదా స్టాక్ లు మంచివి

ప్రస్తుత పరిస్తితులలో, చాల మందికి వేధించే సాధారణ ప్రశ్న ఇది.  శీర్షిక చూసి నేనేదో మంచి షేర్ లను సజెస్ట్ చేస్తానని ఆశించే వారైతే వెంటనే బ్లాగ్ నుండి బయటకు వెళ్లి పోవచ్చు .   ఎందుకంటె నేనేమీ రెగ్యులర్ ట్రేడర్ ను కాను ,  సరి అయిన  ఇన్వెస్టర్ కూడా కాను .   అంటే షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం లేదని కాదు ... చేస్తున్నాను ... కానీ గుడ్డెద్దు చేలో పడి మేసినట్లు ... మాత్రమె తప్ప...  ఏ స్టాక్ ను కూడా టెక్నికల్ రీసెర్చ్ చేయడం , లేదా మంచి బ్రోకర్ advice తీసు కోవడం ... లేదా ఏదేని పత్రిక లేదా వెబ్ సైట్ లేదా ఏదైనా T.V. ఛానల్ ను ఫాలో అవడం లేదా మరో మంచి మిత్రుని సలహా తీసుకోవడం ... ఇలా ఏ పధ్ధతి కూడా పాటించకుండా, ఒక పధ్ధతి లేకుండా తోచిన పధ్ధతి లో ముందుకు పోతున్నాను ...  ఇటుల ఎందువలన చేయుచుంటివి అని ప్రశ్నింతురా ... 
 
ప్రారంభం లో షేర్ మార్కెట్ లో ప్రవేశించి నప్పుడు, బ్రోకర్ ఏ స్టాక్స్ suggest చేసారో అవే కొనడం జరిగింది ... నేను కొన్నంత వరకూ నింగి కెగసిన స్టాక్ , నేను కొనగానే పుడమి తల్లిని ముద్దెట్టు కోవడం జరిగింది ... మరి ఈ suggestions ఇచ్చేవారు అంతా మేధావులే కదా ! ఎందుకలా జరిగింది ? వీరు companys ఇచ్చే బాలన్స్ షీట్స్ etc. ఆధారంగానే కదా రీసెర్చ్ చేస్తారు ? ... అంటే companies తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదా రేడు రోజులు పైకి పోతున్న స్టాక్స్ ను గమనించి , మూడో రోజు కూడా పైకే వెళుతుందని వూహించి అలా సజెస్ట్ చేస్తారా? లేదా companies కానీ, అప్పటికే పెద్ద మొత్తంలో స్టాక్స్ కొన్న బడా బాబులు కానీ, వాళ్ళతో కూడి, ఈ బ్రోకర్స్ ఆడే గేమా ?  ఇవన్నీ నాలాంటి మిడిల్ క్లాసు మానవుడికి , గుంపులో గోవిందయ్యకి ... అర్థం కాని ప్రశ్న .... 
 
ప్రతీ సలహా దారుడూ సలహా లు ఇవ్వడం, చివర్లో, disclaimer ... అంటూ ఇవి తమ వ్యక్తిగత అభిప్రాయాలనీ, ఇవి ఖచ్చితంగా నిజం కావాలనే రూల్ లేదనీను , ఎవరికి వారు కూలంకషంగా పరిశోధించి నిజా నిజాల నిగ్గు తేల్చి అప్పుడు ఆయా స్టాక్స్ కొనుక్కోవాలనీను , అలా కాకుండా తమ సలహా పై కొంటె తమకు సంబంధం లేదనీను, సెలవిచ్చేస్తుంటారు ... అంటే కాకుండా ఫలానా ధరలో అయితేనే కొనండి అంటూ , స్టాప్ లాస్ compulsory అంటారు ... వారు చెప్పిన సమయానికి ఆ స్టాక్ ధర ఖచ్చితంగా చెప్పిన ధర కన్నా ఎక్కువ గానే ఉంటుంది ...  అంటే ఇంత క్వాలిఫైడ్ researchers చెప్పిన దాన్లోనే నో గ్యారంటీ ... మరి ... అలాంటప్పుడు ...  నేను చేస్తున్నట్లు గుడ్డెద్దు పద్ధతిని ఫాలో అవడమే కరెక్ట్ కదా ... 
 
నేను ఫాలో అవుతున్న గుడ్డి పధ్ధతి ఏమిటంటే ... తక్కువ ధరలో ఉన్నప్పుడు కొనడం, కొనడం, కొనడం .... అంతే ... ఒకటి రెండు బ్యాంకు స్టాక్స్ ను గమనిచాను ... ఒక సంవత్సరం లో ఖచ్చితంగా 30 శాతం లాభించే అవకాశం ఉన్నట్టుగా అనిపించింది ... అంటే ... మనకు కావాల్సిన రేట్ వచ్చే వరకూ వెయిట్ చేయాలి ... అంతే ... మనం కొన్న ధర ని సరాసరి చేస్తూ , ఏదో ఒక percentage ఫిక్స్ చేసుకుని ... అప్పుడు అమ్మేసుకోవడమే ... కాకపోతే వెయిట్ చేయాలి ... దీని కోసం మరీ సిస్టం ముందు కాపురం పెట్టేయల్సిన పని కూడా లేదు ... పోర్ట్ ఫోలియో లో నెంబర్ అఫ్ స్టాక్స్ కూడా పెట్టేయల్సిన పని లేదు ... మన దగ్గర ఉన్న డబ్బు బట్టి ... అది డిసైడ్ చేసుకోవాలి ... sip తో పోలిస్తే ఇది మేలే కదా ... ఎందుకంటె సిప్ చేయడం ద్వారా ఆ SIP ఫిక్స్ చేసిన డేట్ కి ఏ ధర ఉంటె ఆ ధరలో కొనాలి ... అమ్మాల్సిన కాలం కూడా పెరిగి పోతుంది ... ఈ పద్ధతిలో అయితే తగ్గితేనే కొంటాం ... పెరిగే వరకూ కొంటాం ... కావాల్సిన ధర రాగానే అమ్మేస్తాం .... అమ్మేశాక మళ్ళీ కథ మొదలు .... 
 
Disclaimer : ప్రత్యేకంగా చెప్పాలా ?  మీకు తెలీదా?
 
bye...