13, అక్టోబర్ 2010, బుధవారం


3, అక్టోబర్ 2010, ఆదివారం

స్కూల్ లో మొదటి రోజు...

మొదటి రోజు స్కూల్ కి తీసుకెళ్ళాం ... ఫి పే చేసి మరుసటి రోజు నుండి స్కూల్ ప్రారంభిద్దామనేఉద్దేశ్యం తో .... అయితే ఆ ప్రిన్సిపాల్ వెంటనే క్లాసు కు తీసుకు పొమ్మంది... మమ్మల్ని దూరంగా పంపి పాపను మాత్రం వాళ్ళ కుర్రవాడితో పంపింది... బిక్క మొహంతో , కళ్ళవెంబడి ఉబికి వచ్చే కన్నీటిని ఆపుకుంటూ, తప్పని సరిగా వాడి తో వెళ్ళింది క్లాసు రూం లోకి.. టెన్షన్ తో మేము బయట... టైం ఒక అరగంట దాటగానే తీసుకు వచ్చేద్దమను కున్నాంకానీ అలవాటు కావాలనే ఉద్దేశ్యం తో గంటన్నర దాక వెయిట్ చేసాం... గంటన్నర దాటాక పిల్లలని బయటకు పంపే గేటు దగ్గరకు వెళ్లి ఆయా అక్కడ ఉంటె చెప్పాం... ఈ రోజే జాయిన్ ఐన పాప ... ప్రిన్సిపాల్ ఒక అరగంట తరువాత తీసుకు పొమ్మన్నారు... కొద్దిగా పంపించేయమని క్లాసు టీచెర్ తో చెప్పమని...

టీచర్ పాపను బయటకు పంపగానే వంద కిలోమీటర్ల స్పీడ్ తో పరుగున వచ్చి ఒక్క ఉదుటున నా మీదికి యెగిరి వాటేసుకుంది ... కళ్ళ వెంట కారుతున్న కన్నీరు నా భుజాలను తడి పెస్తుండగా ఒక పది నిమిషాల వరకూ బల్లిలా అతుక్కునే వుంది...

ఏ తల్లి తండ్రుల కైనా తప్పని సీన్స్ ఇవి... కాని. ... ప్రతి ఒక్కరికీ కొత్త అనుభవం గా ... మరిచి పోలేని జ్ఞాపకంగా ... మనసులో దాచుకో దగ్గవి...

తను నా వైపు చూసిన చూపులో ఎన్నో ప్రశ్నలు... ఎందుకు నన్ను మీ నుండి దూరంగా వేరే వాళ్ళ దగ్గరికి పంపుతునారు... అని... ఇంట్లో మీరు వ్రాయమంటే వ్రాస్తున్నాను కదా... మళ్ళీ ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? వీళ్ళు ఎవరు నా పైన కోపపడ టానికి? నన్ను ఆడుకో నియ్యరా ఇంకా?

ఇవన్నీ నాకు అనిపిస్తున్నాయో, తన మనసులో ఉన్నాయో తేల్చుకో లేదింకా... శని వారం ఆది వారం వచ్చేసాయి... పిల్లల పాలిటి వరం లా...

తనకు స్కూల్ శలవ్ కనుక .... నేనూ ఆఫీసు కు వెల్ల కూడదు... ఇది ఈ రెండు రోజుల్లో గొడవ...

....

తేజస్విని కి బాగ్ కొన్నాం... స్కూల్ కోసం... దానికి జిప్ ఉంటుంది కదా.. అది ఓపెన్ చేసి బుక్స్ తీయడం, మళ్ళీ క్లోజ్ చేయడం... మళ్ళీ ఓపెన్ చేసి బుక్స్ లోన పెట్టడం ... ఇలా సాగుతోంది శిక్షణా కార్యక్రమం... ఈ జిప్ తీస్తే ఇందులో బుక్స్ ఉంటాయి... ఈ జిప్ తీస్తే ఇందులో పెన్సిల్ ఉంటాయి... ఇలా... అన్నమాట...

సాయంత్రం ఆఫీసు నుండి వచ్చి కుర్చీ లో కాళ్ళు బార్ల చాపుకుని కూర్చున్నాను నేను... దగ్గరకు చేరి కబుర్లు చెప్పడం పాపకు అలవాటు... ప్యాంటు దగ్గర ఉన్న జిప్ చూసింది... "ఏంటి నాన్న ఇది?" అడిగింది... "ఇది జిప్ తల్లి...." చెప్పను నేను... వాళ్ళమ్మ ఇచ్చిన శిక్షణ కార్యక్రమం ఇంకా మైండ్ లో ఉన్నాయేమో... వెంటనే అడిగింది... "మరి ఇందులో ఏమున్నాయి....?"

/// మురళి ///