14, మే 2016, శనివారం

నెల నెలా రాబడి కోసం ... ఆర్బిట్రెజ్ ఫండ్స్ ...

బ్యాంకు లో డబ్బు దాచుకుంటే సంవత్సరానికి 4% వడ్డీ ఇస్తారు ... కానీ అది సంవత్సరం తరువాత ఎప్పుడో కాని చూడ లేము ... అయితే ఈ వడ్డీ కన్నా ఎస్ ఎం ఎస్ చార్జీలనీ , మినిమమ్ బాలన్స్ మెయిన్ టైన్ చేయలేదని , ఇలా రక రకాల చార్జీలన్నీ పోతే ఆ వడ్డీ అసలు కనిపించదు ... ఎఫ్ డి పై మంత్లీ ఇంట్రెస్ట్ ఉంటుంది ... ఇది ఖచ్చితంగా బాగానే ఉంటుంది ... వడ్డీ రేట్ ల హెచ్చు తగ్గుల ప్రకారం ఆ పేమెంట్ ఉంటుంది ... ఎఫ్ డి కాల పరిమితి ముగియగానే మన అసలు డబ్బు మనకు వచ్చేస్తుంది ... వడ్డీ నెల నెలా ఇచ్చేస్తారు కాబట్టి ఇంకా చివరలో అసలు మాత్రమె అందుకోవడం జరుగుతుంది ... 

ఒక వేళ నెల నెలా రాబడి నిస్తూ, ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు క్లోజ్ చేసుకుని, లేదా కాస్త ఎక్కువ కాలం తరువాత అమ్ముకుంటే అసలు కన్నా కాస్త ఎక్కువ డబ్బు పొందగలిగే అవకాసం ఉంటె ? అలాగే నెల నెలా వచ్చే రాబడిని తిరిగి పెట్టుబడికి కలుపుకుంటూ పోతూ , ఆ వడ్డీ మీద కూడా వడ్డీ పొంద గలిగే వీలుంటే ? బాగుంటుంది కదా !  ఇటువంటి అవకాశం కల్గించేవే ఆర్బిట్రేజ్ ఫండ్స్ ... 

ఎఫ్ డి లో కూడా నెల నెలా వచ్చే వడ్డీ ని తిరిగి రికరింగ్ డిపాజిట్ లో వేసుకుని , ఎఫ్ డి మరియు రికరింగ్ డిపాజిట్ రెండింటి మెచ్యురిటి డేట్ ఒకటే అయ్యే విధంగా సెట్ చేసుకుంటే కూడా ఈ రకమైన ప్రయోజనం పొందవచ్చు ...  కాకపోతే ఆ అమౌంట్ ఫిక్స్డ్ గా ఉంటుంది ...  కాని ఆర్బిట్రేజ్ ఫండ్స్ లో నెల నెలా వచ్చే డివిడెండ్ ఆ ఫండ్ కొనడం వల్ల వచ్చే యూనిట్స్ పై ఆధార పడి ఉంటుంది .. డివిడెండ్ ప్రతి నెలా దాదాపు యూనిట్ కి రూ 0.05 లేదా అంతకన్నా కాస్త ఎక్కువ తక్కువల్లో ఉంటుంది ... మెయిన్ టైన్ చేసే పోర్ట్ ఫోలియో బట్టి , యూనిట్ వేల్యూ కూడా పెరుగుతూ వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు ... 

మ్యూచువల్ ఫండ్స్ లో ఉండే రిస్క్ ఫాక్టర్ దీనికీ వర్తిస్తుంది ... సంప్రదాయ డిపాజిట్ సాధనాలతో పోలిస్తే , దీన్లో ఉండే బెనిఫిట్ ఏమిటంటే డివిడెండ్ రి-ఇన్వెస్ట్మెంట్ వల్ల యూనిట్స్ పెరుగుతూ ఉండటం, తద్వారా నెల నెలా అందుకునే వడ్డీ లో స్వల్పంగా పెరుగుదల ఉండటం మరియూ అమ్ముకునేటప్పుడు ఎన్. ఏ .వి . పెరిగే అవకాశం ఉండటం , పోర్ట్ ఫోలియో లో ఈక్విటీలు , డెట్ సాధనాల లో తగిన విధంగా పెట్టుబడి పెట్టడం వల్ల రిస్క్ తక్కువ ఉండటం దీన్లో కలిసి వచ్చే అంశాలు.  ఒకే సారి కాకుండా ,  క్రమానుగత పెట్టుబడి విధానం ద్వార  కూడా ఈ ఫండ్స్ ను ట్రై చేయవచ్చు .