29, సెప్టెంబర్ 2009, మంగళవారం

తేజస్విని ముచ్చట్లు ... రెండో రోజు...

స్త్రీలకూ పురుషులకూ ఒక ముఖ్యమైన సామజిక భేదం ఉంది... కాదు ... కాదు... సృష్టించారు... ఏ విషయాన్నైనా బయటపడటం స్త్రీల లక్షణం ఐతే, మనసులో ఫీలింగ్ ఉన్నా బయట పడక మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాలి పురుషులు... బాధ కలిగి ఏడ్చినా... "ఆడపిల్ల లాగ ఎడుస్తున్నవేంటి?" అంటారు... ఏం? మగవాళ్ళు ఏడవ కూడదని రూల్ ఉందా? అని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు... ఫీలింగ్స్ అనేవి మగ అయినా ఆడ అయినా ఒకటే... ఏవో ఒకటి రెండు అవయవాలు తేడ ఉన్నంత మాత్రాన ఆడ, మగ, ... వేర్వేరు కాదు... ఇద్దరూ మనుషులే... ఇంకా క్లియర్ గా చెప్పాలంటే సృష్టిలో ఉన్నా వేలాది జీవుల్లో కేవలం ఒక రకమైన అభివృద్ది చెందినా జీవులు.. మనుషులు. మిగిలిన జీవులకు శారీరకంగా ఉండే సమస్యలు మాత్రమె ఉండొచ్చు... కానీ మనుషులకు మాత్రం శారీరక సమస్యలతో పాటు మరెన్నో సమస్యలు... మానసిక, సామాజిక, ఆర్ధిక, ... క.. క.. క..
ప్రస్తుతం విషయం ఏమిటంటే ఈ లైంగిక సమస్య... ఇంతకు ముందు పిల్లలు పుట్టక పోయే సరికి స్త్రీల చేత పూజలు, పునస్కారాలు... మందులు...మాకులు... ఇప్పుడు సమస్యకు ఇద్దరూ కారణ మని కనిపెట్టారో లేక స్త్రీల తో పటు, మగ వాళ్లకు సమస్యలు పెరిగాయో లేక ఇంతకు ముందు కేవలం స్త్రీలను మాత్రమె దోషులుగా చేసి, ఇప్పుడు తప్పు తెలుసుకొని పురుషులు కూడా ఆ సమస్యకు కర్తలుగా చేసారో కాని ... మొత్తానికి వైద్యానికి గాని, మొక్కులకి గాని ఇద్దరూ హాజరయ్యే పరిస్తితి వచ్చింది...
చాల కాలం క్రితం ... అప్పటికి నాకు చాల విషయాలు తెలుసు... అని భావించే కాలం లో అన్నమాట (రాను, రానూ తెలిసింది... నాకు తెలిసింది అంటూ ఏమీ లేదనీ... తెలిసింది కాస్తా గోరంత కూడా కాదని...) మా స్నేహితుని అన్నయ్యకు పెళ్లి అయ్యింది... నెల రోజుల ముందు నుండి సందడి... తీరా పెళ్లి అయిన మూడు రోజులకే అతని భార్య అతనిని వదిలి వెళ్ళిపోయింది... అప్పుడు ఏవో కథలు చెప్పారు మా స్నేహితుడూ, వాళ్ల అన్నయ్య... అదేదో ఆ అమ్మాయి తప్పు అయినట్టుగా... అర్థం కాని వయస్సు కదా నమ్మేశాం ... కాని తరువాత చాల కాలానికి తెలిసింది ... మొదటి రాత్రి అతను ఫెయిల్ అయ్యాడు... అంతేనా. మగ అహంకారం ఉంటుంది కదా... తన తప్పు కప్పి పుచ్చుకోవడానికి ఆమెను ఏదో అన్నాడు... నాలుగు రోజులు ప్రశాంతంగా అడ్జస్ట్ ఐతే సమస్యలు అన్నీ తీరేవేమో... కాని అల్లా జరగదు... కదా... పెళ్లి కాస్త పెటాకులు అయ్యింది.. కాని పెళ్లి కూతురి తరుపు వాళ్లు ఆడ పిల్ల ని ఇచ్చిన వారు కదా.. ఖర్చులు పెట్టారు... కట్నం ఇచ్చారు.. తీర ఆడపిల్ల వెనక్కు వచ్చేస్తే బంధువులు, వుల్లోవాళ్ళు ఏమనుకుంటారు.. ? కదా... తమ బిడ్డ ఏమైపోఇనా కాదు... సమాజం ఏమంటుందో అని ... భయం... అందుకే... రాజీకి వచ్చి, అమ్మాయిని పంపిస్తామని రాయబారం పంపిచారు.. మన వాడు.. మగధీరుడు కదా.. మరికాస్తా బెట్టు చేసాడు... అంతే ... ఈయన "చూడు పిన్నమ్మ.."అంటూ ఇక్కడ.. ఆమె "వస్తాడు .. నా రాజు " అంటూ అక్కడ...
నిజాని కి అతనిలో లోపం ఉందా? ఉంటే అది శారీరకమా లేక మానసికమా? ఒక వేళ దానిని దూరం చేసుకొనే అవకాశం ఉంటే దానికి ఎవరి సహకారం కావాలి.. ఇలా ఆలోచించి ఉంటే అతని బతుకు అలా అయ్యేది కాదు... ఆ అమ్మాయి సంగతి ఏమవుతుందో మరి... ఇప్పుడు వాళ్ల జీవితాలు ఏమయ్యాయో తెలీదు... నేను దూరంగా వచ్చేశాను.. మా స్నేహితునితో కాంటాక్ట్స్ కూడా లేవు.. అప్పట్లో తెలియలేదు... తరువాత పట్టించుకోలేదు.. మరో స్నేహితుని కథా అంతే దాదాపుగా... కాక పోతే ఇతను తన బాధను స్నేహితులతో పంచుకున్నాడు... ఫలితం... వాళ్లు... ఎదురుగా జాలి చూపించి వెనకనుంచి కామెంట్స్ చేసారు... "మన వాడు పాయింట్ ఫైవ్ గాడు రా" అని. కానీ తరువాత అతని సమస్య పరిశ్కారంయ్యింది ... ఇప్పుడు ఒక బిడ్డకు తండ్రి కూడా.. ఎలా అనేది కూడా నాకు ఐడియా లేదు ... ఎందుకంటె భార్య అతని దగ్గరి నుండి దూరం అయ్యే సమయానికి నేను ఊరు దాటి ఉద్యోగ రీత్యా వైజాగ్ వచ్చేసాను.. సరే.. వీటి గురించి నేను ఆలోచించింది కూడా నాకు పెళ్ళయ్యాకే... అదీ కొసమెరుపు...
ఇంకా వ్రాస్తాను... కానీ మరోసారి...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి