5, సెప్టెంబర్ 2009, శనివారం

కా బోయే ముఖ్య మంత్రి ఎవరు?

అపుడే కాంగ్రెస్స్ లో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ ప్రారంభం అయ్యింది. కొంతమంది ఆయన కొడుకే అందుకు తగిన వాడనే అభిప్రాయానికి వచ్చేసారు. మరికొందరు అతనికి ఏమి రాజకీయ అనుభవం ఉందని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాక పోతే బయటకు ప్రశ్నిస్తే ఏమవుతుందో ఏమో అని భయపడి లోలోపలే గునుస్తున్నారు. ఆఖరికి అధిష్టానం ఏమి చెప్తే అది చేస్తామని, హుస్సేన్ సాగర్ లో దూకమన్నా దూకుతామని అంటున్నారు. సామాన్య జనాలు ఇంకా ఈ మరణాన్ని జీర్ణించు కోవడమే జరగ లేదు. ఈ రాజకీయ నాయకులు ఎంత హుషారు గా ఉన్నారు? అవును మరి! చేతిలో పత్రిక ఉంది, ఒక చానల్ ఉంది... మొత్తం మీడియా చేతిలోనే ఉంది.. మీడియా చేతిలో ఉంటే ప్రభుత్వాలనే మార్చి పారేయ వచ్చు.. తిమ్మిని బమ్మిగా చేయొచ్చు... బమ్మిని తిమ్మిగా చేయ వచ్చు. ఇంతకు ముందు ఇది బాగానే నిరూపిత మయింది... అందులోకి సంవత్సారాలుగా వట వృక్షంగా వేళ్ళు పాతుకుని పోయిన ప్రముఖ పత్రికాధిపతి నే గడ గడ లాడించిన ఘనత పొందిన జగన్ గారే అందుకు సమర్ధులని నమ్మించ గలుగుతారు... మీడియా ద్వారా.. మరి మిగిలిన రాజకీయ నాయకులకు అటువండి అవకాసం లేదు.. అందువల్ల వారికి ఆ భయం ఉండడం సహజం. ఈ సమయం లో సోనియా గాంధీ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. జనరల్ గా పార్టీ పటిష్టంగా ఉండాలంటే , అసమ్మతి సెగలు లేకుండా ఉండాలంటే, మాటి మాటికి ముఖ్యమంత్రులను మార్చాల్సిన పరిస్థితి లేకుండా ఉండాలంటే , మళ్ళీ మళ్ళీ ఆంద్ర ప్రదేశ్ లో మరో పార్టీ కి రాకుండా కాంగ్రెస్స్ మాత్రమె రావాలంటే రాజ శేఖర రెడ్డి గారి లంది నాయకుడే కావాలి. మరి ఇప్పుడున్న రాజకీయ నాయకులలో ఆ లక్షణాలు ఉన్నాయా? వై. ఎస్. జగన్ కాకుండా ఇంక ఎవరైనా వస్తే ఒక్క ఈనాడు, ఆంధ్ర జ్యోతి లను మాత్రమె కాదు ... సాక్షి ని కూడా తట్టుకోగల సమర్థులై ఉండాలి.. లేదా ప్రజల్లో ఎలాగూ వై.ఎస్. రాజ శేఖర రెడ్డి కొడుకుగా సానుభూతి ఉంటుంది కాబట్టి, మీడియా చేతిలో ఉంది కాబట్టి, ఎవరైనా వ్యతిరేకిస్తే దివంగత ముఖ్య మంత్రి నే అవమానించినట్టు అవుతుందని అందరూ ఫీల్ అవుతారనే భయం ఉంటుంది కాబట్టి, ఇప్పటివరకు జరుగుతున్నవన్నీ అలాగే జరగాలను కుంటే మాత్రం జగన్ ను వారసుని గా అధిష్టానం నిర్ణయం తీసుకోవచ్చు. ఏది ఏమైనా, ఎవరు ఎన్ని విధాలుగా అనుకున్నా, కాలం అలా సాగిపోతూనే ఉంటుంది... రాజీవ్ గాంధి మరణించి నంత మాత్రాన కాంగ్రెస్స్ మూల పడిందా... మన తెలుగు వాడు ఏ సమస్య లేకుండా ప్రభుత్వాన్ని నడిపించ లేదూ...? చూద్దాం.. ఏం జరుగుతుందో...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి