6, మే 2014, మంగళవారం

ఓటరు మహాశయా ... నీ రోజు ... నీ ఇష్టం

ప్రత్యెక ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి ఎన్నికలు ...
విడి పోతామని తెంచుకు పోయిన వారి గురించి ఆలోచన మనకు అవసరం లేదు ...


నీ వల్ల ... అంటే నీ వల్ల .. అంటూ విభజన కు కారణమైన ప్రతి ఒక్క రాజకీయ పక్షం ఎదుటి వారిపై నిందలు వేస్తునా మనకు ఆ పనికిమాలిన కబుర్లు అక్కర లేదు


ఇది ఫ్రీ ... అది ఫ్రీ ... అంటూ మభ్యపెడుతున్నా చిరునవ్వుతో ఆ కామెడీ సీన్ లను ఎంజాయ్ చేద్దాం ...


కోట్లకు కోట్లు డబ్బు దొరుకుతోంటే ముక్కున వేలేసుకున్నా ... పరిస్తితి ని జీర్నించుకుందాం


కానీ ...


ఓటు మాత్రం ... ఏ ప్రలోభాలకు లొంగ కుండా ... ఏ ఒత్తిళ్లకు తలొంచ కుండా ...
ఒక మంచి భవిష్యత్తు నిచ్చే  నాయకునికి వేసి ...


భావి తరాలకు స్పూర్తి నిచ్చే నిర్ణయం తీసుకుందాం ...


జైహింద్







1 కామెంట్‌:

  1. సీ|| అమరావతీ పట్టణమున బౌధ్ధులు విశ్వ
    విద్యాలయములు స్ఠాపించునాడు,

    ఓరుగల్లున రాజవీర లాంఛనముగ
    బలు శస్త్రశాలల నిల్పు నాడు,

    విద్యానగర రాజవీధుల కవితకు
    పెండ్లి పందిళ్ళు గప్పించు నాడు,

    పొట్నూరికి సమీపమున నాంధ్ర సామ్రాజ్య
    దిగ్జయ స్ఠంభ మెత్తించు నాడు,

    తే|| ఆంధ్ర సంతతి కే మహితాభిమాన
    దివ్యదీక్షా సుఖస్పూర్తి తీవరించె
    నా మహావేశ మర్ఢించి యాంధ్రులార!
    చల్లు డాంధ్రలోకమున అక్షతలు నేడు.

    రిప్లయితొలగించండి