8, నవంబర్ 2014, శనివారం

వెల్త్ మోర్ షేర్ గురు ...

ఇంతకు ముందే ఒకసారి .. అంటే నేను ఆ పత్రికను చూసిన  మొదటి సారి ... షేర్ మార్కెట్ కు సంబంధించి తెలుగులో ఒక పత్రిక వచ్చింది ... చూడమని రాసాను ఈ బ్లాగ్ లో ... అదే ... 

వెల్త్ మోర్ షేర్ గురు ... 

ఇది వార పత్రిక ... ఇది పుస్తక రూపం లో మరియు వెబ్ సైట్ లో కూడా దొరుకుతుంది ... ఈ పాటికే చాల మంది దీనిని చూసే ఉంటారు ... రెగ్యులర్ గా కాకపోయినా ... ఈ మధ్య ఎక్కువగా చూస్తుండడం జరుగు తుంది ఈ బుక్ ని ... అన్నీ మంచి శీర్షిక లే అయినా ... కొన్ని మాత్రం ఎక్కువ మంచివి ఉన్నాయిందులో ... 
 
మచ్చుకి ఒకట్రెండు ... అందులో ఒకటి ... వారానికి ఒక స్టాక్ ని పరిచయం చేస్తూ ఉంటారు ... దానిని ఎందుకు కొనవచ్చో , ఎందుకు కొనడానికి దానికి అర్హత ఉందొ ... అంటూ ... బాగుంది ఇది ... ఈ మధ్య శ్రీ కాళహస్తి పైప్స్ (లాంకో ఇండస్ట్రీస్) గురించి వ్రాసారు ... కొన్నాను .. ఒక్క నెలలోనే 40% లాభం సంపాదించ గలిగాను ... ఓ మాక్స్ ఆటోస్ గురించి చెప్పారు ... కొన్నాను ... వారం లోనే 5% లాభం పొందగలిగాను ... ఇలా ప్రతి వారం ఇచ్చే స్టాక్ ని కొనమని సజెస్ట్ చేస్తున్నారు ... (కానీ పుస్తకం చివరలో వారు సూచించి నట్లు చెప్పడం వారు చెబుతారు కానీ కొనటం మాత్రం మన రిస్క్ మీదే నని చెబుతారు అనుకోండి ) ... నూటికి నూరు పాళ్ళు ఎవరు చెప్పేదీ నమ్మలేం కదా ... అందులో షేర్ మార్కెట్ గురించి మరీను ... కాకపోతే కొనటం ... పెరుగుతుంటే ... అనుకున్న లాభం రాగానే అమ్మేయటం ... మరీ మంచి స్టాక్ లు అనుకుంటే లాంగ్ టైం స్టాక్ లిస్టు పోర్ట్ ఫోలియో లో ఉంచడం ... 
 
డివిడెండ్ స్క్రిప్పింగ్ అంటూ ఎక్ష్ డేట్ లో కొని కం డేట్ లో అమ్ముకోమని, దాని వల్ల డివిడెండ్ పొందవచ్చు అని ఒక లిస్టు ఇస్తారు ... కాకపోతే ఎక్ష్ డేట్ లో కొన్నాక , దాని ధర పెరిగినా లేక స్థిరంగా ఉన్నా ఫర్లేదు ... తగ్గితే మాత్రం రిస్కే ... 
 
sip (క్రమానుగత పెట్టుబడి విధానం ) ద్వార ఏ స్టాక్ ఎంత కాలం కొంటె లక్షలు కోట్లుగా మారతాయో ... అంటూ రేపటి స్టార్ సిప్ ... అంటూ కొన్ని స్టాక్ ల పరిచయాలు ... 
 
బాగున్నాయి ... 
 
షేర్ మార్కెట్ ద్వార సేవింగ్స్ చేద్దామనుకునే వారు ... ఈ పుస్తకాన్ని ఫాలో అవ్వవచ్చు ... 
 
 
 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి