24, అక్టోబర్ 2018, బుధవారం

ఆశల పేర్లు..ఆ పది షేర్లు


ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో ఏ స్టాక్స్ మీద పెట్టుబడి పెట్టాలో తెలియని స్థితిలో మదుపర్లు ఉన్నారు. కానీ నిపుణులు మాత్రం చేతిలో ఉన్న డబ్బును వివిధ రకాల స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టడమే మంచిదని సూచిస్తున్నారు. ఒకే స్టాక్‌ను నమ్ముకోకుండా... పలు రంగాలకు చెందిన స్టాక్స్ ను వారు ఎంచుకోమని సలహా ఇస్తున్నారు. ఉన్న నగదు మొత్తాన్ని ఒకే కంపెనీ మీద కాకుండా  చెల్లాచెదరు పద్ధతిలో స్టాక్స్‌  కొనుగోలు చేయాలని నిపుణులు భావిస్తున్నారు.
మార్కెట్లో కాస్త స్థిరత్వం కనబడుతున్నప్పుడు బేర్స్ డీ స్ట్రీట్‌లో  ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. గత వారం నుండి S&P BSE సెన్సెక్స్ 10 శాతం పడిపోడంతో మదుపర్లు డబుల్ డిజిట్ కట్‌తో సతమతమయ్యారు. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, NBFCలలో నగదు కొరత, రూపీ పతనం వంటివి మార్కెట్లను గణనీయంగా ప్రభావితం చేశాయి. అంతర్జాతీయంగా వడ్డీరేట్ల పెంపుదల, స్మాల్-మిడ్ క్యాప్ పతనం వంటివి మార్కెట్‌ను అస్థిర పరిచాయనే చెప్పాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి షేర్లను కొనాలి. దేనిలో లాభసాటి పెట్టుబడులు పెట్టాలి అన్న ప్రశ్నలు మిలియన్ డాలర్ క్వశ్చన్లుగా మారాయి. ఇప్పుడు సాధారణ మదుపర్లలో తలెత్తే ప్రశ్న ఒక్కటే... ఈ మార్కెట్ ఫాల్ కంటిన్యూ అవుతుందా ? అని.  అవుననే అంటున్నారు మార్కెట్ నిపుణులు. రానున్న మరి కొద్ది నెలలు ఈ మార్కెట్ పతనాలు కొనసాగవచ్చని వారి అభిప్రాయం. స్టాక్స్ ఎంపికలో మరి కొంత కాలం  వేచిచూసే ధోరణినే అవలంబించాలని నిపుణులు పేర్కొంటున్నారు. షార్ట్ టర్మ్ లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక లాభాల కోసం మదుపర్లు ఇన్వెస్ట్ చేయోచ్చని ఎనలిస్టులు అంటున్నారు. దీర్ఘకాలిక మదుపులోనే స్థిర ఆదాయాలు కనబడొచ్చని స్టాక్ ఎనలిస్టుల అభిప్రాయం.
మార్కెట్లు  కరెక్షన్ ఊపు కొనసాగితే.. ర్యాలీ కొనసాగుతుందని,  రానున్న మరి కొద్ది నెలలు ఈ అస్థిరత ఉండొచ్చని , అందుకే పెట్టుబడలను సంరక్షించుకోడానికే మదుపర్లు ప్రాధాన్యతనివ్వాలని ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ విలియమ్ ఓ నీల్ CEO,  స్టీవెన్ బ్రీచ్ అంటున్నారు.
ఇక ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్‌లో ఓ 10 స్టాక్స్ ప్రభావం చూపవచ్చని నిపుణులు అంటున్నారు . అవేంటో చూద్దామా...

సిప్లా..
రానున్న రెండేళ్లలో సిప్లా గణనీయ లాభాలను నమోదు చేయనుంది. డబుల్ డిజిట్ గ్రోత్‌ను ఈ సంస్థ కనబరచనుందని ఎనలిస్టుల అంచనా. ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సిప్లా డొమెస్టిక్ మార్కెట్లలో +22 శాతం వృద్ధిని నమోదు చేసింది. సిప్లా స్టాక్ ఎంపిక ఓ మంచి ఇన్వెస్ట్ మెంట్ అని నిపుణులు పేర్కొంటున్నారు. నేటి మార్కెట్‌లో సిప్లా రు. 680 వద్ద ట్రేడ్ అవుతోంది.

బయోకాన్
అక్టోబర్ తొలి సగానికల్లా బయోకాన్ 50-డే లైన్ కు రికవరీ అయింది. అలాగే సింజెన్ కంపెనీలో 71 శాతం వాటాను కలిగి ఉండటం కూడా బయోకాన్‌ వృద్ధికి కలిసివచ్చే అంశమే. CAGR గ్రోత్ రేట్ 2014 నుండి 2018 వరకూ దాదపు 22శాతం నమోదు చేసింది బయోకాన్.

ICICI లాంబార్డ్
జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీల్లో దేశీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సంస్థ ICICI లాంబోర్డ్ . ఇన్స్యూరెన్స్ మార్కెట్లో దాదాపు 16శాతం వాటాను ఇది కలిగి ఉంది. మార్కెట్లో దిద్దుబాటు తరువాత అత్యంత వేగంగా రికవరీ అయి 200-DMAను సాధించింది ICICI లాంబార్డ్. 2018-2019 సంవత్సరానికి గానూ మరో 30శాతం వృద్ధిని ఇది సాధించవచ్చని నిపుణుల అంచనా.

ఆదిత్య బిర్లా ఫ్యాషన్ & రిటైల్ (ABFRL)
ఆదిత్య బిర్లా  ఫ్యాషన్స్ కు దేశ వ్యాప్తంగా  700 పట్టణాల్లో 4,900 అవుట్ లెట్స్ ఉన్నాయి. మల్టీ బ్రాండెడ్ అవుట్ లెట్స్ తో విస్తారమైన నెట్ వర్క్ తో అమ్మకాలను గణనీయంగా పెంచుకుంది ఆదిత్య బిర్లా ఫ్యాషన్. సంస్థకు చెందిన ప్యాంటలూన్ బ్రాండ్ కూడా 26శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. రానున్న పండుగ సీజన్‌ కూడా ఆదిత్య ఫ్యాషన్స్ కు కలిసొచ్చే అంశమే. కంపెనీ టెక్నికల్ ప్రొఫైల్ కూడా 50-DMA ను సాధించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

VIP ఇండస్ట్రీస్
VIP ఇండస్ట్రీస్‌కు ప్రాథమికంగా బలమైన , వైవిధ్యమైన ఉత్పత్తి పోర్ట్ ఫోలియోను కలిగి ఉంది. దేశ వ్యాప్తంగా 8000 బ్రాంచీలను కలిగి ఉంది. అంతే కాకుండా 27 దేశాల్లో 1300 రిటైలర్లను కలిగిఉన్న VIP  గణనీయ వృద్ధిని కనబరుస్తుంది. ఇది కూడా 200-డే లైన్‌కు చేరడం అనుకూల అంశంగా కనబడుతుంది.

అవెన్యూ సూపర్‌మార్ట్..
డీ-మార్ట్ గా సుపరిచితమైన అవెన్యూ సూపర్‌మార్ట్  లిమిటెడ్ దేశంలోనే అగ్రగామి సూపర్ మార్ట్ సంస్థగా పేరొందింది. ఫుడ్ , నాన్ ఫుడ్ ఉత్పత్తుల అమ్మకాలతో డీమార్ట్ వేగంగా వృద్ధిని సాధించింది. దాదాపు 160 స్టోర్లలో తన వ్యాపారాన్ని విస్తరించింది డీ మార్ట్. 2019- రెండో త్రైమాసికానికి డీ మార్ట్ 39శాతం రెవిన్యూను సాధించింది . ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌ ప్రకారం  ఈ ఆర్ధిక సంవత్సరం 110 బేసిస్ పాయింట్లే సాధించినప్పటికీ అది డిస్కౌంట్ల రూపంలో జరగడం వల్ల కంపెనీపై ప్రభావం చూపలేదు.  రానున్న మార్కెట్ కరెక్షన్ల ప్రకారం చూస్తే... ఈ కంపెనీ టార్గెట్ ప్రైస్ రు. 1513గా ఉంది.

HDFC బ్యాంక్
దేశంలోనే రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్‌గా HDFC పేరు గాంచింది.2,666 పట్టణాల్లో  4,804 బ్రాంచ్‌లు 12,808 ఏటీఎంలు కలిగి ఉన్న HDFC తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తుంది.  సుపీరియర్ రేషియో RoE 19శాతంగా, 2 శాతం ROA ను  ఈ FY-18 లో మనం చూడొచ్చని నిపుణుల అంచనా. CAGR గ్రోత్ కూడా 20-21 శాతంగా పెరగొచ్చని ఎనలిస్టుల అంచనా. లోన్ రికవరీ ఎఫిషియన్సీ కూడా HDFC కి కలిసొచ్చే అంశం. బ్యాంకింగ్ రంగంలో హై వాల్యూ కలిగిఉన్న ఏకైక ప్రైవేట్ బ్యాంక్ HDFC మాత్రమే.  

నాట్‌కో ఫార్మా
ఫార్మాస్యూటికల్ రంగంలో వేగంగా వృద్ధి చెందిన సంస్థ నాట్‌కో ఫార్మా. అత్యంత అనుభవజ్ఞులైన మేనేజ్ మెంట్ సారధ్యంలో దినదినాభివృద్ధి చెందిన సంస్థ నాట్కో. మెడిసిన్ అమ్మకాలు, అభివృద్ధి రంగంలో వేగవంతమైన పురోభివృద్ధిని సాధించిన ఈ కంపెనీ ఆ ఆర్ధిక సంవత్సరంలో 22-27 శాతం వృద్ధిని కనబరిచింది. CAGR గ్రోత్ కూడా దాదాపు 32శాతం సాధించడం విశేషం. తాజాగా అమెరికా కోర్టు కూడా నాట్‌కో ఫార్మా అమ్మకాల మీద అనుకూలంగా తీర్పునివ్వడం కంపెనీ ఆదాయం పెరగడానికి దోహద పడింది.

ఇంద్రప్రస్థ గ్యాస్ (IGL)
కంప్రెసివ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఇంద్రప్రస్థ గ్యాస్ కంపెనీ కూడా గణనీయ ఫలితాలను సాధించింది గత రెండో త్రైమాసికం నుండి. ఢిల్లీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఈ IGL రానున్న ఆర్ధిక సంవత్సరం కల్లా రు. 14.7 బిలియన్ల ఆదాయాన్ని నమోదు చేయనుంది. పెట్ కోక్ రంగంలో కూడా ఈ కంపెనీ గణనీయ లాభాలను నమోదు చేసింది. రిచ్ ఎక్స్‌పెక్టేషన్స్ , ఉన్నత టెక్నికల్ వ్యాపార నిర్వాహణ, బలమైన కంపెనీ బ్యాలెన్స్ షీట్  IGL ను అగ్రపథాన కూర్చోబెట్టాయని నిపుణులు పేర్కొన్నారు.

ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ (ETL)
ఇండియన్ ఆటోస్‌లో ఉత్తమ ఎంపికగా ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ నిలుస్తుంది. 2018-2020 నాటికి కంపెనీ ఆదాయ గ్రోత్ CAGR 30శాతానికి పైగా నమోదు కావచ్చని నిపుణుల అంచనా. ప్రీమియర్ వాల్యూషన్స్ లో ETL గ్రోత్ గణనీయంగా పెరుగుతుందని వారంటున్నారు. తక్కువ ఉత్పత్తి వ్యయాలు, అమ్మకాల్లో పెరుగుదల, స్ట్రాంగ్ వెండర్ బేస్ కలిగి ఉండటం,  ఉత్పత్తి ప్లాంట్ల పెంపు వంటివి కంపెనీ గ్రోత్‌కు దోహద పడ్డాయి. ఆటో మొబైల్ పరికరాల తయారీలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ ఒక్క బజాజ్ కే కాకుండా హోండా కు కూడా ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్, బజాజ్ ఆటో ల పరికరాల తయారీలో ETL దాదపు 80శాతం వాటాను కలిగి ఉంది. క్యాస్టింగ్, సస్పెన్షన్, ట్రాన్స్‌మిషన్, బ్రేక్స్ తయారీ లో నాణ్యతే కంపెనీకి అధిక లాభాలను తెచ్చి పెట్టింది. ఈ కంపెనీ కొనుగోలు టార్గెట్ ధర రు. 1216 గా నిపుణులు పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి