స్త్రీలకూ పురుషులకూ ఒక ముఖ్యమైన సామజిక భేదం ఉంది... కాదు ... కాదు... సృష్టించారు... ఏ విషయాన్నైనా బయటపడటం స్త్రీల లక్షణం ఐతే, మనసులో ఫీలింగ్ ఉన్నా బయట పడక మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాలి పురుషులు... బాధ కలిగి ఏడ్చినా... "ఆడపిల్ల లాగ ఎడుస్తున్నవేంటి?" అంటారు... ఏం? మగవాళ్ళు ఏడవ కూడదని రూల్ ఉందా? అని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు... ఫీలింగ్స్ అనేవి మగ అయినా ఆడ అయినా ఒకటే... ఏవో ఒకటి రెండు అవయవాలు తేడ ఉన్నంత మాత్రాన ఆడ, మగ, ... వేర్వేరు కాదు... ఇద్దరూ మనుషులే... ఇంకా క్లియర్ గా చెప్పాలంటే సృష్టిలో ఉన్నా వేలాది జీవుల్లో కేవలం ఒక రకమైన అభివృద్ది చెందినా జీవులు.. మనుషులు. మిగిలిన జీవులకు శారీరకంగా ఉండే సమస్యలు మాత్రమె ఉండొచ్చు... కానీ మనుషులకు మాత్రం శారీరక సమస్యలతో పాటు మరెన్నో సమస్యలు... మానసిక, సామాజిక, ఆర్ధిక, ... క.. క.. క..
ప్రస్తుతం విషయం ఏమిటంటే ఈ లైంగిక సమస్య... ఇంతకు ముందు పిల్లలు పుట్టక పోయే సరికి స్త్రీల చేత పూజలు, పునస్కారాలు... మందులు...మాకులు... ఇప్పుడు సమస్యకు ఇద్దరూ కారణ మని కనిపెట్టారో లేక స్త్రీల తో పటు, మగ వాళ్లకు సమస్యలు పెరిగాయో లేక ఇంతకు ముందు కేవలం స్త్రీలను మాత్రమె దోషులుగా చేసి, ఇప్పుడు తప్పు తెలుసుకొని పురుషులు కూడా ఆ సమస్యకు కర్తలుగా చేసారో కాని ... మొత్తానికి వైద్యానికి గాని, మొక్కులకి గాని ఇద్దరూ హాజరయ్యే పరిస్తితి వచ్చింది...
చాల కాలం క్రితం ... అప్పటికి నాకు చాల విషయాలు తెలుసు... అని భావించే కాలం లో అన్నమాట (రాను, రానూ తెలిసింది... నాకు తెలిసింది అంటూ ఏమీ లేదనీ... తెలిసింది కాస్తా గోరంత కూడా కాదని...) మా స్నేహితుని అన్నయ్యకు పెళ్లి అయ్యింది... నెల రోజుల ముందు నుండి సందడి... తీరా పెళ్లి అయిన మూడు రోజులకే అతని భార్య అతనిని వదిలి వెళ్ళిపోయింది... అప్పుడు ఏవో కథలు చెప్పారు మా స్నేహితుడూ, వాళ్ల అన్నయ్య... అదేదో ఆ అమ్మాయి తప్పు అయినట్టుగా... అర్థం కాని వయస్సు కదా నమ్మేశాం ... కాని తరువాత చాల కాలానికి తెలిసింది ... మొదటి రాత్రి అతను ఫెయిల్ అయ్యాడు... అంతేనా. మగ అహంకారం ఉంటుంది కదా... తన తప్పు కప్పి పుచ్చుకోవడానికి ఆమెను ఏదో అన్నాడు... నాలుగు రోజులు ప్రశాంతంగా అడ్జస్ట్ ఐతే సమస్యలు అన్నీ తీరేవేమో... కాని అల్లా జరగదు... కదా... పెళ్లి కాస్త పెటాకులు అయ్యింది.. కాని పెళ్లి కూతురి తరుపు వాళ్లు ఆడ పిల్ల ని ఇచ్చిన వారు కదా.. ఖర్చులు పెట్టారు... కట్నం ఇచ్చారు.. తీర ఆడపిల్ల వెనక్కు వచ్చేస్తే బంధువులు, వుల్లోవాళ్ళు ఏమనుకుంటారు.. ? కదా... తమ బిడ్డ ఏమైపోఇనా కాదు... సమాజం ఏమంటుందో అని ... భయం... అందుకే... రాజీకి వచ్చి, అమ్మాయిని పంపిస్తామని రాయబారం పంపిచారు.. మన వాడు.. మగధీరుడు కదా.. మరికాస్తా బెట్టు చేసాడు... అంతే ... ఈయన "చూడు పిన్నమ్మ.."అంటూ ఇక్కడ.. ఆమె "వస్తాడు .. నా రాజు " అంటూ అక్కడ...
నిజాని కి అతనిలో లోపం ఉందా? ఉంటే అది శారీరకమా లేక మానసికమా? ఒక వేళ దానిని దూరం చేసుకొనే అవకాశం ఉంటే దానికి ఎవరి సహకారం కావాలి.. ఇలా ఆలోచించి ఉంటే అతని బతుకు అలా అయ్యేది కాదు... ఆ అమ్మాయి సంగతి ఏమవుతుందో మరి... ఇప్పుడు వాళ్ల జీవితాలు ఏమయ్యాయో తెలీదు... నేను దూరంగా వచ్చేశాను.. మా స్నేహితునితో కాంటాక్ట్స్ కూడా లేవు.. అప్పట్లో తెలియలేదు... తరువాత పట్టించుకోలేదు.. మరో స్నేహితుని కథా అంతే దాదాపుగా... కాక పోతే ఇతను తన బాధను స్నేహితులతో పంచుకున్నాడు... ఫలితం... వాళ్లు... ఎదురుగా జాలి చూపించి వెనకనుంచి కామెంట్స్ చేసారు... "మన వాడు పాయింట్ ఫైవ్ గాడు రా" అని. కానీ తరువాత అతని సమస్య పరిశ్కారంయ్యింది ... ఇప్పుడు ఒక బిడ్డకు తండ్రి కూడా.. ఎలా అనేది కూడా నాకు ఐడియా లేదు ... ఎందుకంటె భార్య అతని దగ్గరి నుండి దూరం అయ్యే సమయానికి నేను ఊరు దాటి ఉద్యోగ రీత్యా వైజాగ్ వచ్చేసాను.. సరే.. వీటి గురించి నేను ఆలోచించింది కూడా నాకు పెళ్ళయ్యాకే... అదీ కొసమెరుపు...
ఇంకా వ్రాస్తాను... కానీ మరోసారి...
29, సెప్టెంబర్ 2009, మంగళవారం
తేజస్విని ముచ్చట్లు...
మా పాప తేజస్విని పేరు మీద బ్లాగ్ క్రియేట్ చేశాను... కాని ఎప్పుడూ మా పాప గురించి వ్రాయలేదు... ఆ మధ్య తన పుట్టిన రోజు శుభాకాంక్షలు ఫోటో తో సహా వేయడం తప్ప... నా పెళ్లి జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లో... సెప్టెంబర్ మూడు... కాని నాకు సంతానం కలిగింది సెప్టెంబర్ పదకొండు... రెండువేల ఏడు లో... అంటే పెళ్ళయిన ఎనిమిది సంవత్సరాలకు ... సంతాన భాగ్యం కలిగింది మాకు... వేరికోసిల్ అన్నారు... ఆపరేషన్ చేయించుకొన్నాను... దేవుళ్ళకు మొక్కేస్తూ, డాక్టర్స్ ను పోషిస్తూ, బంధువుల సూటి పోటి మాటలను భరిస్తూ, ఆఖరికి ఎవరివల్ల పొందగాలిగానో తెలియకుండా.. (ఐ మీన్ దేవుడు.. ఐతే ఏ దేవుడో : డాక్టర్ ఐతేఏ డాక్టరో తెలియలేదని నా ఉద్దేశ్యం) ఒక బిడ్డను పొందగలిగాను... నిజానికి నాకు అనిపించింది ఏమిటంటే దేముడు, డాక్టర్స్, వీళ్ళందరి సాయం కన్నా ఒక ముఖ్యమైన కనిపించని శక్తి సాయం తో ఏమైనా సాధించ వచ్చు... అదే మన మనస్సు... ఎస్... నేను ముఖ్యంగా మనసు తోనే సాధించగలిగాను... ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ, బంధువుల మాటలను పట్టించుకోకుండా.. ఎదురుగా ఉన్న గుడిలో వినాయకుని విగ్రహం కళ్ళల్లోకి కళ్లు పెట్టి "నేను సాధించాలి... " అని పదేపదే సెల్ఫ్ హిప్నో టైజ్ చేసుకుంటూ, ఒక కాలెండరు తయారుచేసుకుని ఛాన్స్ ఉన్న రోజుల్లోనే ప్రయత్నిస్తూ మొత్తానికి... మూడు నెలల లోపే సాధించాను... ఈ సొంత డబ్బా చదివే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించేది కాదని నాకు తెలుసు.. కాని వ్రాయాలనిపించింది ... వ్రాస్తున్నాను... ఐతే ...
ముఖమైన ఒక పొరపాటు ... నా వల్ల జరిగింది.. చాల మందికీ జరిగీ ఛాన్స్ ఉండేది... ఒకటుంది... అదేంటంటే స్పెరం టెస్ట్ చేయడానికి ఇస్తున్నప్పుడు ... అంగ స్తంభనం బాగా జరిగాక.. స్పెరం మొత్తం బాటిల్ లోకి పడేట్టు జాగ్రత్త వహించాలి... టెన్షన్ తో ప్రయత్నిస్తే అంగస్తంభన జరగక పోవచ్చు... స్పెరం లో మొదట పదే డ్రాప్స్ లోనే ఎక్కువ కణాలు ఉండే అవకాసం ఉంటుంది.. తరువాత వచ్చే డ్రాప్స్ లో కణాలు తక్కువ ఉంటాయి.. కాబట్టి ఒక్కసారి స్పెరం టెస్ట్ చేయించేసుకొని ఆపరేషన్ కు తయారవడం తప్పు... ఇంకో విషయం ఏమిటంటే సిగ్గు పడటం లాంటి వి ఇటువంటి విషయాలలో చేయవద్దు.. కనీసం రెండు మూడు సార్లు అయినా టెస్ట్ చేయించుకోవాలి...
జస్ట్ నాలాగా కొంత మంది ఉండవచ్చు అనే ఉద్దేశ్యం తో వ్రాసాను... లోపం అనే మాటను మనసు లోంచి తీసేయక పోతే శరీరం ఏ మాత్రం సహకరించదు.. ఇటువంటి విషయాలలో మనమే డాక్టర్స్ కావాలి... మనమే దేవుళ్ళ మ వ్వాలి.. కొద్దిగా ఎమోషన్ ఎక్కువైందని పిస్తే క్షమించాలి...
ఈ స్క్రిప్ట్ సరిగ్గా సహకరించడం లేదు.. మళ్ళీ మరోసారి...
మురళి.
ముఖమైన ఒక పొరపాటు ... నా వల్ల జరిగింది.. చాల మందికీ జరిగీ ఛాన్స్ ఉండేది... ఒకటుంది... అదేంటంటే స్పెరం టెస్ట్ చేయడానికి ఇస్తున్నప్పుడు ... అంగ స్తంభనం బాగా జరిగాక.. స్పెరం మొత్తం బాటిల్ లోకి పడేట్టు జాగ్రత్త వహించాలి... టెన్షన్ తో ప్రయత్నిస్తే అంగస్తంభన జరగక పోవచ్చు... స్పెరం లో మొదట పదే డ్రాప్స్ లోనే ఎక్కువ కణాలు ఉండే అవకాసం ఉంటుంది.. తరువాత వచ్చే డ్రాప్స్ లో కణాలు తక్కువ ఉంటాయి.. కాబట్టి ఒక్కసారి స్పెరం టెస్ట్ చేయించేసుకొని ఆపరేషన్ కు తయారవడం తప్పు... ఇంకో విషయం ఏమిటంటే సిగ్గు పడటం లాంటి వి ఇటువంటి విషయాలలో చేయవద్దు.. కనీసం రెండు మూడు సార్లు అయినా టెస్ట్ చేయించుకోవాలి...
జస్ట్ నాలాగా కొంత మంది ఉండవచ్చు అనే ఉద్దేశ్యం తో వ్రాసాను... లోపం అనే మాటను మనసు లోంచి తీసేయక పోతే శరీరం ఏ మాత్రం సహకరించదు.. ఇటువంటి విషయాలలో మనమే డాక్టర్స్ కావాలి... మనమే దేవుళ్ళ మ వ్వాలి.. కొద్దిగా ఎమోషన్ ఎక్కువైందని పిస్తే క్షమించాలి...
ఈ స్క్రిప్ట్ సరిగ్గా సహకరించడం లేదు.. మళ్ళీ మరోసారి...
మురళి.
24, సెప్టెంబర్ 2009, గురువారం
మనిషి మారలేదు...
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట ఒకటి ఉంటుంది "గాయం" సినిమాలో... "పాత రాతి గుహలు ... పాలరాతి గృహాలైనా , అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా... వేట అదే, వేటు అదే... నాటి కథే అంతా. నట్టడవులు నడివీధికి నడిచొచ్చిన వింత... " అలాగే "అయినా మనిషి మారలేదు" అంటూ గుండమ్మ కథ లో ఘంటసాల పాట... అంటే ఎంత అభివృద్ది చెందుతున్నా మనిషి మనస్తత్వం మారలేదు.. మారాడు.. అని అర్థం. అంటే మూలం మాత్రం మారదు, పై పైన మారినట్టు కనిపిస్తుంది అంతే... ఆదిమ మానవులు పచ్చి మాంసం తినేవారు... తరువాత కాల్చిన మాంసం తినే వారు... తరువాత ఉడక బెట్టిన "మాంసం" తినేవారు. తరువాత ఉప్పు, కారం కలిసిన "మాంసం" తినేవారు... ఇప్పుడు "మాంసం" చికెన్ అరవై ఐదు, చికెన్ చెట్టినాడు, తందూరీ చికెన్, మటన్ మొఘలై ఇలా రాసుకుంటూ పోతే "మాంసం" ఎన్ని రకాలుగా తింటున్నారో ... అంటే "మాంసం" తినే పద్ధతి ఐతే మారింది... కాని మాంసం తినడం మానలేదు... బహుశ ఇంకా పెరిగింది... అంటే పధ్ధతి మారింది.. కాని మూలం మారలేదు... ఈ మోసలకూ అది వర్తిస్తుంది... ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటె నాకు వచ్చిన కొత్త మెయిల్ చూడటం వలన... ఒక మూడు వందలు పంపించా లాంట, కొంత ఆ మైంటైన్ చేసేవాడు తీసుకొని మిగిలింది మనకన్నా ముందుగా లిస్టు లో ఉన్నా బకరా గాళ్ళకు ఇస్తారు అంట... మన పేరు పైకి పోతుందంట... మన తరువాత డబ్బు కట్టే వారి వల్ల మనకు డబ్బు వస్తుందంట... అలా నెలలో ఒక లక్ష వస్తుందంట.. పైన చెప్పిన "మారలేదు" అనే స్టోరి కీ దీనికీ సంబంధం ఏమిటి అంటారా? ఇంతకు ముందు పోస్ట్ లో డబ్బు కట్టమని "లింక్" సిస్టం వల్ల ముగ్గురు చేత కట్టించాలని, వారు ఒక్కక్కరు ముగ్గురేసి చొప్పున కట్టించితే ... అలా లింక్ పెరిగితే బోల్డంత డబ్బు వచ్చేస్తుందని... (స్టాలిన్ సినిమా గుర్తొస్తుందా..?). ఇప్పుడు అది ఆన్ లైన్ లోకి, డైవర్ట్ అయ్యింది... అదీ సంగతి... ఈ మనిషి ఎపుడు మారతాడో... కదా...
మరో మారని మనిషి... మురళి....
మరో మారని మనిషి... మురళి....
23, సెప్టెంబర్ 2009, బుధవారం
21, సెప్టెంబర్ 2009, సోమవారం
మెయిల్స్ గొడవ...
ఈ మధ్య ఇంటర్ నెట్ జాబు మెయిల్స్ గొడవ ఎక్కువైపోతోంది... ఇంకా లాటరీ లో డబ్బు వచ్చిందంటూ మెయిల్స్.... స్నేహం చేస్తామంటూ మెయిల్స్... ఇలా ఎన్నెన్నో... ఈ లాటరీ మెయిల్స్ ఇంత వరకూ నెట్ లోనే వచ్చేవి... ఈ మధ్యనే ఎస్.ఎం.ఎస్. లూ వస్తున్నాయంట... నెట్ నుండి ఫోన్స్ కు ప్రాకింది ఈ జబ్బు.. నెట్ వాడిన వాళ్ళతో పోలిస్తే ఫోన్స్ వాడే వాళ్లు ఎక్కువ కదా... ఎక్కువ మంది బుట్టలో పడే అవకాశం ఉంటుంది... చాల కాలం క్రిందట మా వూళ్ళో (పార్వతీపురం) అందవర్ సర్క్యులేషన్ అని పెట్టాడు... అండవార్ అంటే ఏమిటి? అని అడిగాం మా కుర్రాళ్ళం (అపుడు మనం జస్ట్ నిక్కర్ల నుండి ఫాంట్ లోకి మారిన వయసులో ఉన్నాం లెండి... ) అపుడు ఆ మహానుభావుడు ఆకాశం వైపు చూపించి "ఆండవర్ అంటే ఆ భగవంతుడని అర్థం" అన్నాడు... ఇంతకీ స్కీమ్ ఏమిటంటే సగం రేట్ కే అన్ని సామాన్లు దొరుకుతాయి... కాకపోతే డబ్బులు కట్టిన వారం రోజులకి వస్తువు ఇస్తారు... అందరికీ తెలుసు అందులో ఖచ్చితంగా మోసం ఉంటుందని... కాని మొదట కట్టిన వాళ్ళకి వస్తువులు దొరికే అవకాశం ఉంటుంది అనే ఆశ... తరువాత కట్టినవాడు పోతాడు... అంతే.. మరి ఏం చేయకుండా ఉరుకొనే వయసు కాదు కదా... వాళ్ళిచ్చిన పాంఫ్లెట్ ను కవర్ లో పెట్టి, ఒక ఉత్తరం వ్రాసి, (అపుడు సెల్ ఫోన్స్ లేవు కదా... కనీసం ల్యాండ్ లైన్స్ కూడా తక్కువ... మొదట ఫోన్ ఎత్తగానే "నెంబర్ ప్లీజ్" అని అడుగుతారు... మనం నెంబర్ చెప్పితే కాసేపు అయ్యాక కనెక్షన్ ఇస్తారు... అదే ఎస్.టి.డి. ఐతే ప్రొద్దున్న కాల్ బుక్ చేస్తే ఏ రాత్రికో కనెక్షన్ ఇచ్చేవాళ్ళు.. ఈ కాలం వాళ్ళకి ఇది విచిత్రంగా అనిపిస్తుంది కాని ... ఇది నిజం...) పోలీస్ స్టేషన్ అడ్రస్ వ్రాసి పంపించాము... పాపం వాడు పూర్తిగా ఆఫీసు సెట్ అప్ చేయడం కూడా చేయలేదు... పోలీస్ లు వచ్చారు... ఆండవర్ గారిని తీసుక పోయారు... ఇప్పుడంతా ఆన్ లైన్ లోనే జరిగిపోతున్నాయి... ఎలా కంప్లైంట్ చేయడం? ఎవరి మీద అని కంప్లైంట్ చేయడం? ఇలా నమ్మొద్దని "ఆన్ లైన్ - బ్లాగ్స్" లోనే హెచ్చరించడం తప్ప....
...మురళి...
...మురళి...
జోక్...
మూడు రోజులుగా ఆఫీసు పని మీద వేరే వూరు వెళ్లి వచ్చిన సుబ్బా రావు తన పాప ముద్దు ముద్దు మాటలు వింటున్నాడు... ఎదురుగా అతని భార్య రతీ దేవి వారి మాటలను ఆనందంగా వింటూంది... పాప అంటుంది... " నాన్నా!... మొన్న నువ్వు ఊరు వెళ్లి పోయాక ఎదురింటి అంకుల్ మన ఇంటికి వచ్చాడు..." "వచ్చాడా తల్లీ... నీతో ఆడుకున్నాడా?" అడిగాడు సుబ్బా రావు... "కాదు... నాన్న... సరిగ్గా విను..." అంది ఆ పాప... "సరే... సరే... చెప్పమ్మా..."
"అంకుల్ వచ్చాడు... అమ్మేమో కుర్చోమంది..."
"తరువాత?" అడిగాడు సుబ్బా రావు...
"కాఫీ.. త్రాగాడు... మాకేమో చాక్లెట్ ఇచ్చాడు..."
"తరువాత..."
"అమ్మ అంకుల్ ని మన బెడ్ రూం కాట్ మీద కుర్చోమంది..."
"తరువాత?" ఏదో అనుమానం... ఆ అడగడం లో... అందుకే ఎదురుగా ఉన్నభార్య వైపు చూస్తూ అడిగాడు...
"చెప్పమ్మా... తరువాత?"
"అమ్మ కూడా అంకుల్ ప్రక్కనే కూర్చుంది..."
ఎదురుగా ఉన్న రతి దేవి మొహంలో కలవరపాటు... సుబ్బారావు లో వుత్సుకత...
"చెప్పు తల్లీ... తరువాత ఏమైంది...?"
పాప చెప్పడం పూర్తైన మరుక్షణం ఏమవుతుందో నాన్న టెన్షన్ రతీ దేవి మొహంలో... పాప చెబుతున్న విషయం వింటూన్న కొద్దీ సుబ్బా రావు మొహం లో మారుతున్న రంగులు... ఇక భార్య పని పట్టడమే లేటు అన్నట్టు లేచి నించుని పాప చెప్పేది పూర్తిగా వినాలని , ఆగాడు...
"మరే... "
"ఆ.. చెప్పమ్మా... తరువాత?"
ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్లు ఆగింది.. పాప....
"తరువాత.. నువ్వు పక్కింటి అంటీ ... ఆడుకున్నారు... కదా... ఆ ఆట ఆడుకున్నారు...?"
"అంకుల్ వచ్చాడు... అమ్మేమో కుర్చోమంది..."
"తరువాత?" అడిగాడు సుబ్బా రావు...
"కాఫీ.. త్రాగాడు... మాకేమో చాక్లెట్ ఇచ్చాడు..."
"తరువాత..."
"అమ్మ అంకుల్ ని మన బెడ్ రూం కాట్ మీద కుర్చోమంది..."
"తరువాత?" ఏదో అనుమానం... ఆ అడగడం లో... అందుకే ఎదురుగా ఉన్నభార్య వైపు చూస్తూ అడిగాడు...
"చెప్పమ్మా... తరువాత?"
"అమ్మ కూడా అంకుల్ ప్రక్కనే కూర్చుంది..."
ఎదురుగా ఉన్న రతి దేవి మొహంలో కలవరపాటు... సుబ్బారావు లో వుత్సుకత...
"చెప్పు తల్లీ... తరువాత ఏమైంది...?"
పాప చెప్పడం పూర్తైన మరుక్షణం ఏమవుతుందో నాన్న టెన్షన్ రతీ దేవి మొహంలో... పాప చెబుతున్న విషయం వింటూన్న కొద్దీ సుబ్బా రావు మొహం లో మారుతున్న రంగులు... ఇక భార్య పని పట్టడమే లేటు అన్నట్టు లేచి నించుని పాప చెప్పేది పూర్తిగా వినాలని , ఆగాడు...
"మరే... "
"ఆ.. చెప్పమ్మా... తరువాత?"
ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్లు ఆగింది.. పాప....
"తరువాత.. నువ్వు పక్కింటి అంటీ ... ఆడుకున్నారు... కదా... ఆ ఆట ఆడుకున్నారు...?"
13, సెప్టెంబర్ 2009, ఆదివారం
కొటేషన్ జ్ఞాపకాలు...
ప్రార్థిస్తూ ఆలోచిస్తే ప్రతీది దేవుని మహిమే అనిపిస్తుంది...
పని చేస్తూ ఆలోచిస్తే ప్రతీది మానవ ప్రయత్నం వల్లే అనిపిస్తుంది...
...
విజయమా... వస్తూ శిఖరాన్ని ఎక్కిస్తావు...
పోతూ పాతాళం లోకి తోస్తావు...
నీకిది న్యాయమా...
...
మంచి తనం అణువు లాంటిది...
అది అణిగి మణిగి ఉంటుంది...
కాని.. అది బద్దలయితే ....
లోకం దద్దరిల్లుతుంది...
...
దేవుణ్ణి ప్రార్థించండి...
కాని కోర్కెలు తీర్చమని కాదు...
అన్ని అవయవాలు సక్రమంగా ఇచ్చినందుకు...
అద్భుతమైన మెదడు ఇచ్చినందుకు...
సృష్టిలో మిగిలిన జీవుల కంటే ఉన్నతమైన జన్మ నిచ్చినందుకు...
8, సెప్టెంబర్ 2009, మంగళవారం
ఈ సారి నెలకు రూ.లక్ష ఇరవై వేలు....
ఈ రోజే మరో కొత్త మెయిల్ వచ్చింది. అంటే రోజూ వస్తూ వుంటై. కానీ ఈ మెయిల్ మాత్రం మంచి ఆకర్షణీయంగా వ్రాసారు. "నో ఇన్వెస్ట్ మెంట్ " అని. సరే.. వెబ్ సైట్ ఓపెన్ చేశాను. మరింత ఆకర్షణీయంగా ఉంది... ఎక్కడా డబ్బు కట్టమని వ్రాయలేదు. "ప్రెస్ హియర్" టు రిజిస్ట్రేషన్... అన్నారు అంతే... సరే... చేశాను... వెంటనే రిప్లై .... కేవలం నాలుగు వందల రూపాయల తో రోజుకి రెండు వేల రూపాయలు... అంటే నెలకు లక్ష ఇరవై వేలు... బాగుంది కదా..
బై
మురళి.
బై
మురళి.
5, సెప్టెంబర్ 2009, శనివారం
కా బోయే ముఖ్య మంత్రి ఎవరు?
అపుడే కాంగ్రెస్స్ లో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ ప్రారంభం అయ్యింది. కొంతమంది ఆయన కొడుకే అందుకు తగిన వాడనే అభిప్రాయానికి వచ్చేసారు. మరికొందరు అతనికి ఏమి రాజకీయ అనుభవం ఉందని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాక పోతే బయటకు ప్రశ్నిస్తే ఏమవుతుందో ఏమో అని భయపడి లోలోపలే గునుస్తున్నారు. ఆఖరికి అధిష్టానం ఏమి చెప్తే అది చేస్తామని, హుస్సేన్ సాగర్ లో దూకమన్నా దూకుతామని అంటున్నారు. సామాన్య జనాలు ఇంకా ఈ మరణాన్ని జీర్ణించు కోవడమే జరగ లేదు. ఈ రాజకీయ నాయకులు ఎంత హుషారు గా ఉన్నారు? అవును మరి! చేతిలో పత్రిక ఉంది, ఒక చానల్ ఉంది... మొత్తం మీడియా చేతిలోనే ఉంది.. మీడియా చేతిలో ఉంటే ప్రభుత్వాలనే మార్చి పారేయ వచ్చు.. తిమ్మిని బమ్మిగా చేయొచ్చు... బమ్మిని తిమ్మిగా చేయ వచ్చు. ఇంతకు ముందు ఇది బాగానే నిరూపిత మయింది... అందులోకి సంవత్సారాలుగా వట వృక్షంగా వేళ్ళు పాతుకుని పోయిన ప్రముఖ పత్రికాధిపతి నే గడ గడ లాడించిన ఘనత పొందిన జగన్ గారే అందుకు సమర్ధులని నమ్మించ గలుగుతారు... మీడియా ద్వారా.. మరి మిగిలిన రాజకీయ నాయకులకు అటువండి అవకాసం లేదు.. అందువల్ల వారికి ఆ భయం ఉండడం సహజం. ఈ సమయం లో సోనియా గాంధీ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. జనరల్ గా పార్టీ పటిష్టంగా ఉండాలంటే , అసమ్మతి సెగలు లేకుండా ఉండాలంటే, మాటి మాటికి ముఖ్యమంత్రులను మార్చాల్సిన పరిస్థితి లేకుండా ఉండాలంటే , మళ్ళీ మళ్ళీ ఆంద్ర ప్రదేశ్ లో మరో పార్టీ కి రాకుండా కాంగ్రెస్స్ మాత్రమె రావాలంటే రాజ శేఖర రెడ్డి గారి లంది నాయకుడే కావాలి. మరి ఇప్పుడున్న రాజకీయ నాయకులలో ఆ లక్షణాలు ఉన్నాయా? వై. ఎస్. జగన్ కాకుండా ఇంక ఎవరైనా వస్తే ఒక్క ఈనాడు, ఆంధ్ర జ్యోతి లను మాత్రమె కాదు ... సాక్షి ని కూడా తట్టుకోగల సమర్థులై ఉండాలి.. లేదా ప్రజల్లో ఎలాగూ వై.ఎస్. రాజ శేఖర రెడ్డి కొడుకుగా సానుభూతి ఉంటుంది కాబట్టి, మీడియా చేతిలో ఉంది కాబట్టి, ఎవరైనా వ్యతిరేకిస్తే దివంగత ముఖ్య మంత్రి నే అవమానించినట్టు అవుతుందని అందరూ ఫీల్ అవుతారనే భయం ఉంటుంది కాబట్టి, ఇప్పటివరకు జరుగుతున్నవన్నీ అలాగే జరగాలను కుంటే మాత్రం జగన్ ను వారసుని గా అధిష్టానం నిర్ణయం తీసుకోవచ్చు. ఏది ఏమైనా, ఎవరు ఎన్ని విధాలుగా అనుకున్నా, కాలం అలా సాగిపోతూనే ఉంటుంది... రాజీవ్ గాంధి మరణించి నంత మాత్రాన కాంగ్రెస్స్ మూల పడిందా... మన తెలుగు వాడు ఏ సమస్య లేకుండా ప్రభుత్వాన్ని నడిపించ లేదూ...? చూద్దాం.. ఏం జరుగుతుందో...
ఈ సన్నీ ప్రొఫిట్స్ డాట్ కం గురించి తెలుసా?
ట్రేడింగ్ లో ఇంట్రా డే టిప్స్ అనీ, మిడ్ కాప్స్ టిప్స్ అని చాల రకాల ప్రకటనలు చూస్తున్నాం. నెలకు రూ.రెండు వేల నుండి, ఉన్నాయి... సన్నీ ప్రొఫిట్స్ నెలకు వంద రూపాయల నుండి, ఆరు వందల రూపాయలు ద్వారా ఇంకా రక రకాల సబ్ స్క్రిప్షన్స్ ఆఫర్ చేస్తుంది.. ఎంతవరకు వీటిని నమ్మవచ్చు? ఎవరికయినా తెలిస్తే చెప్పండి... లేకపోతే నేనే ఒక నెల చూడాల్సి ఉంటుంది... అప్పుడు నా అనుభవం అందరికీ పంచడానికి అవకాశం ఉంటుంది.. ఓ.కే. నా?
మురళి.
మురళి.
3, సెప్టెంబర్ 2009, గురువారం
వై ఎస్ ఆర్ ... ఇక లేరా?
యెంత దురదృష్టకరమైన సంఘటన ...!!! నిన్నటి వరకు గత ఆరు సంవత్సారాలుగా ప్రతిపక్షాలను గడ గడ లాడించిన, కాంగ్రెస్ లో ఐదు సంవత్సరాలు పూర్తిగా ముఖ్యమంత్రిగా నిలచిన కీర్తి గడించిన అపర భగేరథుదనిపిన్చుకున్న మన ముఖ్య మంత్రి ఈ విధంగా మరణించడం నిజంగా ఘోరం... మరణించిన ఇన్ని గంటలకు గానీ తెలియలేక పోవడం నిజంగా దారుణం... నేను ఆయన aభిమాని నేమీ కాదు... అయినా బాధగానే అనిపించే విషయమిది... నిజంగా గుండె ధైర్యం గల ఒక నాయకుడిని మన రాష్ట్రం కోల్పోయింది... ఇలాంటి సమయంలో ప్రజలంతా సంయమనం పాటించాలి...
1, సెప్టెంబర్ 2009, మంగళవారం
కొమ్మూరి వేణుగోపాల రావు నవలలో కొన్ని వాక్యాలు...
ఇది కాపీ చేసి పేస్టు చేద్దామంటే కుదరడం లేదు... ఐనా అందరికీ తెలియపరచాలనే కోరికతో వ్రాయాలని పిస్తుంది.. అంతా ఒకే సారి వ్రాయడం నాకు కుదరదు... ఆఫీసు లో టైం మిస్ యూజ్ చేసినట్లవుతుంది... ఈ రోజుకి కొన్ని వాక్యాలు...
"నువ్వసలు దేవుణ్ణి నమ్మవా?"
"దేవుడంటే నాకు అప నమ్మకం లేదు... ఈ సుందరమైన ప్రపంచం, భూమి, ఆకసం, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, శక్తివంతమైన టెలిస్కోప్ లో గోచరించే అనేక దృశ్యాలు ... ఆయన వుండే వుంటా డన్ననమ్మకాన్ని కల్గిస్తున్నై... ఏదైనా రూపంలో ఉన్నాడో, అదృశ్య రూపం లో ఉన్నాడో, కాంతి రూపంలో ఉన్నాడో , శబ్ద రూపంలో ఉన్నాడో నిర్వచించ లేను... కాని ఆయన్ని మీలాంటి రకరకాల సిద్ధాంతాలలో మునిగి తేలుతున్న గురుజి లు కాంప్లి కేట్ చేసే పధ్ధతి చూస్తె చిరాకు అనిపిస్తూ ఉంటుంది. ... "
"దేవుడున్నాడా లేదా అనే ఆలోచన విడిచిపెట్టి మనం నిర్ణయించు కున్న దాన్ని కృషి చేస్తూ వెళ్ళిపోవడం ఉత్తమం... అపుడు మనిషి లో ఆత్మా విశ్వాసం పెరుగుతుంది... ప్రతిదాని కి దేముడి మీద ఆధార పడే మనస్తత్వం పోతుంది.. "
"స్వయం కృషి ఉన్నా దేవుడి మీద నమ్మకం ఉంచడం వల్ల ఆ కృషి రాణించ డానికి అవకాసం ఉంది కదా!"
"స్వయం కృషి ఉందీ... దేవుడి మీద విపరీతంగా అమాయకంగా నమ్మకం పెట్టుకున్న వారు కలసిరాకుండా ఆ కృషి వృధా ఐ పోయిన వాళ్లు చాలామంది ఉన్నారు... ఏదో మొక్కుబడిగా భక్తిని ప్రదర్శిస్తూ అన్నీ కలసి వస్తూ పట్టిందల్లా బంగారం ఐనా వాళ్ళూ ఉన్నారు... "
"మరి పూర్వజన్మ?"
....
మిగిలిన మేటర్ మరోసారి...
ఇంకా వెంటనే చదవాలను కుంటే క్రింది లింక్ లోకి వెళ్ళండి...
మురళి
http://teluguone.com/grandalayam/kathalu/nenu/index.jsp?eno=92
"నువ్వసలు దేవుణ్ణి నమ్మవా?"
"దేవుడంటే నాకు అప నమ్మకం లేదు... ఈ సుందరమైన ప్రపంచం, భూమి, ఆకసం, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, శక్తివంతమైన టెలిస్కోప్ లో గోచరించే అనేక దృశ్యాలు ... ఆయన వుండే వుంటా డన్ననమ్మకాన్ని కల్గిస్తున్నై... ఏదైనా రూపంలో ఉన్నాడో, అదృశ్య రూపం లో ఉన్నాడో, కాంతి రూపంలో ఉన్నాడో , శబ్ద రూపంలో ఉన్నాడో నిర్వచించ లేను... కాని ఆయన్ని మీలాంటి రకరకాల సిద్ధాంతాలలో మునిగి తేలుతున్న గురుజి లు కాంప్లి కేట్ చేసే పధ్ధతి చూస్తె చిరాకు అనిపిస్తూ ఉంటుంది. ... "
"దేవుడున్నాడా లేదా అనే ఆలోచన విడిచిపెట్టి మనం నిర్ణయించు కున్న దాన్ని కృషి చేస్తూ వెళ్ళిపోవడం ఉత్తమం... అపుడు మనిషి లో ఆత్మా విశ్వాసం పెరుగుతుంది... ప్రతిదాని కి దేముడి మీద ఆధార పడే మనస్తత్వం పోతుంది.. "
"స్వయం కృషి ఉన్నా దేవుడి మీద నమ్మకం ఉంచడం వల్ల ఆ కృషి రాణించ డానికి అవకాసం ఉంది కదా!"
"స్వయం కృషి ఉందీ... దేవుడి మీద విపరీతంగా అమాయకంగా నమ్మకం పెట్టుకున్న వారు కలసిరాకుండా ఆ కృషి వృధా ఐ పోయిన వాళ్లు చాలామంది ఉన్నారు... ఏదో మొక్కుబడిగా భక్తిని ప్రదర్శిస్తూ అన్నీ కలసి వస్తూ పట్టిందల్లా బంగారం ఐనా వాళ్ళూ ఉన్నారు... "
"మరి పూర్వజన్మ?"
....
మిగిలిన మేటర్ మరోసారి...
ఇంకా వెంటనే చదవాలను కుంటే క్రింది లింక్ లోకి వెళ్ళండి...
మురళి
http://teluguone.com/grandalayam/kathalu/nenu/index.jsp?eno=92
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)