13, మే 2014, మంగళవారం

నింగిలో తారలతో స్టాక్ ల చెట్ట పట్టాల్ ...

స్టాక్ మార్కెట్ ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది ... నిన్న మొన్నటి వరకూ పాతాళ లోకంలో ప్రయాణం చేసిన షేర్ లు ఇప్పుడు  నెల విడిచి సాము చేస్తున్నై ... నింగి కెగసి తారలతో సయ్యాట  లాడు తున్నాయి ... అన్ని స్టాక్ ల పరిస్తితి బాగానే ఉంది ... నా పార్టి ఫోలియో ఖాళీ అయిపోతా నంటుంది ...


అయితే డివిడెండ్ లు వచ్చే కాలం ... ఎస్ బ్యాంకు , bhel , uco బ్యాంకు స్టాక్స్ అమ్మేశాను .   వచ్చిన సొమ్ముతో కొన్ని ఆంధ్ర బ్యాంకు స్టాక్స్ కొన్నాను  ఎందుకంటె ఐదు వందల రూపాయల ఎస్ బ్యాంకు కూ , డెబ్బై రూపాయల ఆంధ్ర బ్యాంకు కూ వచ్చే డివిడెండ్ ఒకటే .  భెల్ ఎప్పుడు అమ్మేద్దమా అని చూస్తున్నాను .  uco బ్యాంకు కు డివిడెండ్ రెండు రూపాయల లోపే ... అందుకే ఒక లక్ష రూపాయల విలువ గల ఆంధ్ర బ్యాంకు స్టాక్స్ maintain చేస్తే 7 % ఇంట్రెస్ట్ డివిడెండ్ ల రూపం లో వస్తుంది ...  ఇంత లోగా బాగా పెరిగితే ఆంధ్ర బ్యాంకు అయినా అమ్మేయడమే ... ఇందులో మొహమాటాలు , సెంటి మెంట్లూ ఏమీ లేవు ....


నిన్న రూ 9790 తో  కొన్న ఆంధ్ర బ్యాంకు స్టాక్ వేల్యూ ఈ రోజు రూ 10282 అంటే 5 % ఇంట్రెస్ట్ ఒక్క రోజులో ... brokerage తీసేస్తే 3. 62 % .  కేంద్రం లో bjp వస్తుందన్న వార్త వస్తే ఇంకా పెరిగే అవకాశం ఉంది ...


చూద్దాం ... అమ్మే కాలాన్ని ఉపయోగించుకొని కొనే కాలం వరకూ వెయిట్ చేయాలి ....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి