15, ఫిబ్రవరి 2023, బుధవారం

ఆప్షన్ ట్రేడింగ్ ... లాస్ లేకుండా ....

నమస్కారం ... 

ముందు అనుకున్న విధంగా ఈ ఆప్షన్స్ గురించి మరి కొన్ని విషయాలు నాకు తెలిసినవి .... 

1. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈ టి ఎఫ్ లు కొంటె ఎంత కాలమైనా ఉంచుకోవచ్చు.   వీటి విలువ తగ్గుతూ ఉండవచ్చు ... పెరుగుతూ ఉండవచ్చు ... మంచి కంపెనీలైతే తగ్గినా తరువాత పెరిగే అవకాశం ఉంటుంది.   కాకపోతే ఇప్పుడు మంచి కంపెనీ ... తరువాతి కాలంలో నాశనం అయిపోవచ్చు.   మళ్ళీ పుంజుకోవచ్చు..  

2. మరి ఈ ఆప్షన్స్ జీవిత కాలం కేవలం ఒక వారమో , నెలో మాత్రం ఉంటుంది ... ఈ గడువులోనే అవి భయంకరంగా పెరిగి పోవచ్చు ... లేదా సున్నా అయిపోవచ్చు. 

3. ఉదాహరణకు బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ... బ్యాంక్ నిఫ్టీ పెరిగితే కాల్ ఆప్షన్ పెరుగుతుంది ... తగ్గితే ఫుట్ ఆప్షన్ పెరుగుతుంది.  ఇది సాధారణంగా జరిగేది.  కానీ ఎక్స్పైరీ డేట్ దగ్గర పడే కొద్దీ ఒకవేళ మార్కెట్ పెరగడం తగ్గడం కొంచెం కొంచెం గ ఉండటమో , ప్రారంభమైన విలువ దగ్గరే ముగించడమో జరిగితే కాల్ మరియు ఫుట్ రెండూ తగ్గుతుంటాయి.   

4. ఒక స్ట్రాటజీ ప్రకారం కాల్ ఫుట్ రెండూ నెల మొదట్లో కొని నెలాఖరు వరకు వేచి ఉంటె రెండింటిలో ఒకటి సున్నా అయిపోయేది ... అంటే సున్నా అయిపోయేది పోయినా పెరిగే దానిలో లాభం వచ్చేది ... పెట్టుబడి కూడా తక్కువ ... కాకపోతే రెండూ తగ్గడం అనేది జరిగితే ఈ బైయింగ్ స్ట్రాటజీ వర్క్ అవుట్ అవదు. 

5. ఒక వేళ పెరిగే దానిని పెరగనిచ్చి ... తగ్గుతూ ఉన్నదానికి, హెడ్జింగ్ కోసం సెల్ ఆర్డర్ పెడితే లాస్ మినిమైజ్ అవుతుంది. 

6. ఎంత తగ్గినపుడు హెడ్జింగ్ చేసుకోవాలో అనేది మన ఇష్టం... మనలాస్ భరించ గలిగే శక్తి మీద ఆధారపడుతుంది.  కాకపోతే సెల్ ఆర్డర్ కోసం పెట్టుబడి కాస్త ఎక్కువ అవసరం.   

7. ఆలా అని, డబ్బులు బాగా ఉంది ... రెండూ సెల్ ఆర్డర్ లే పెడదాం అనుకుంటే, స్టాప్ లాస్ అయినా పెట్టాలి... లేదా పెరిగే దానికి హెడ్జింగ్ కోసం బై ఆర్డర్ పెట్టాలి. 

ఇవన్నీ కాదు బాస్ ... నాకు రిస్క్ లేకుండా .... లాస్ వచ్చినా తక్కువ గాను  మరియు తక్కువ సార్లు వచ్చి, లాభావకాశాలే ఎక్కువ కావాలి అనుకుంటే నేనొక స్ట్రాటజీ అనుకుంటున్నాను ... అది ఇంకా పేపర్ ట్రేడింగ్ లోనే ఉంది ... ఈ నెలలోనే టెస్టింగ్ ప్రారంభించాను.   ఫిబ్రవరి ప్రారంభ తేదీల్లో ప్రారంభించాను.  

అది ఇప్పటి వరకు ఏ పరిస్థితిలో ఉందొ  చెబుతాను ... 


(సశేషం )




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి