20, మే 2025, మంగళవారం

ఈ స్ట్రాటజీ పేరేమిటి

బ్లాగ్ మిత్రులకు నమస్కారం ... 

చాలా కాలానికి మళ్ళీ ... 


అసలు ఎవరైనా బ్లాగ్స్ ను చూడటం లేదా బ్లాగ్స్ లో పోస్ట్ చేయడం జరుగుతుందా ... పేస్ బుక్ పాతబడిపోయి ఇంస్టాగ్రామ్  లోకి జంప్ అయ్యిపోతుంటే, వాట్సాప్ మాత్రమే కాకుండా టెలిగ్రామ్ లోకి మారిపోతోంటే ఇంకా ఈ బ్లాగ్స్ ఎవరు మైంటైన్ చేస్తున్నారు ... 

ఎవరు చుసినా, చూడక పోయినా ... డైరీ రాయడం మానతామా ? అసలు ఎవరి కోసమో డైరీ రాస్తామా ... అలాగే బ్లాగ్ కూడా ... ఇది ఇంకొకరి కోసం కాదు ... కొంతకాలం తరువాత మనల్ని  మనమే పలకరించుకోవాలనుకుంటే , మన జ్ఞాపకాల లోకి మనమే తొంగి చుడాలనిపిస్తే ... మనకోసం మనం రాసిన ... మన ఆలోచనల సమాహారం ఈ బ్లాగ్ డైరీ ... 

సరే ... ఈ రోజు ఒక ఆప్షన్ స్ట్రాటజీ ని ... పొందుపరుస్తున్నాను ... 

మాములుగా స్పాట్ ప్రైస్ నుండి దూరంగా కాల్ ఫుట్  రెండూ సెల్ చేసి, ఇన్వెస్ట్ మెంట్ ను తగ్గించడానికి (హెడ్జింగ్ కోసం కాదు), చెరో కాల్ మరియు ఫుట్ బయ్ చేస్తే ... లాంగ్ స్ట్రాడిల్ అంటారు కదా ...( స్ట్రాడేల్ నా ... స్ట్రాంగిల్ నా ?)  ఐతే నేను ఇప్పుడు చెబుతున్నది కేవలం కాల్ పై అప్లై చేసేది ... మరి దీని పేరేమిటో   మీరే నిర్ణయించాలి ... 


దీనిలో స్ట్రైక్ ప్రెస్ +100 లేదా ఎంత దూరం వీలైతే అంత ... 100 లోపు, 50 పైన ప్రీమియం వేల్యూ ... సెల్ చేస్తాం ... ప్రీమియం వేల్యూ లో 20% ప్రీమియం విలువ కల కాల్ ను బై చేస్తాం ... ఎప్పుడు ? ఎక్స్పైరీ మరుసటి రోజున ... అంటే సాధారణంగా శుక్ర వారం ... ఉదయం పొద్దున్న 9.20 తరువాత ... ఎక్స్ పైరీ తేదీ తరువాతి శుక్రవారం ముందు అన్న మాట ... దీనికి 80 వేల వరకు అవసరం అవుతుంది ... మార్కెట్ తగ్గుతూ ఉన్న , లేదా సైడ్ వేస్ లో ఉన్న లాభంలో ఉంటాము ... పెరుగుతూ సెల్ వేల్యూ స్పాట్ ప్రెస్ ను దాటితే నష్టాల్లోకి పోతాం ... ఒకవేళ ఆలా దాటేస్తే ... ఆ సెల్ వేల్యూ కన్నా ఎక్కువ కాల్ ను బయ్ చేస్తాం ... అపుడు లాభంగా మారవచ్చు లేదా నష్టాన్ని తగ్గించ వచ్చు ... 


ఈ విధంగా ఒక నెలలో నాలుగు ట్రేడ్స్ అనుకుంటే కనీసం 5% - 10|% వరకు లాభం పొందవచ్చు ... 


ఉదాహరణ :


మే 02, 2025 - 9. 20 కి ; 8 మే ఎక్సపైరీ ... ఏ టి ఎమ్ 24450 ... దీనికి 200 కలిపితే 24650 ... ప్రీమియం విలువ 102. 90  కాల్ సెల్ ... 19. 60 కాల్  బయ్ ...  మార్జిన్ 70000 ; లాభావకాశం 6200; నష్టావకాశం 24000

మే 7 మధ్యాహ్నం 3 20 కి లాభం  5,790. 00 


ఇలా ఒక రెండు నెలలు పేపర్ ట్రేడింగ్ చేయండి ... మీకే తెలుస్తుంది... 


లేదా ఏ స్టాక్ మాక్ లోనో బ్యాక్ టెస్ట్ చేసి చూడండి 


సరే ... ఉంటా మరి 


30, జనవరి 2025, గురువారం

ఊరికినే ... పలకరించడానికి

బ్లాగ్ మిత్రులకు నమస్కారం 


కొత్త సంవత్సరం ... అప్పుడే నెల పూర్తయింది.  

మా తేజస్విని   ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇప్పుడు. 

ఆప్షన్ ట్రేడింగ్ లో లాట్ సైజ్ లలో మార్పులు వచ్చాయి ... మనకు అది మంచో, చెడో సమయం గడిస్తే గాని తెలీదు ... 

కాకపోతే కనీసం 1 లక్ష దాటి ఉంటె తప్ప ఆప్షన్ ట్రేడింగ్ చేయలేము 

బ్యాంకు నిఫ్టీ అయితే ముగింపు తేదీ నెలాఖరు 

నిఫ్టీ లాట్ సైజు 25 నుండి 75

బ్యాంకు నిఫ్టీ అయితే 15 నుండి 30. 

నేనైతే ఇంకా ఈ కొత్త మార్పులొకి ప్రవేశించ లేదు ... డబ్బులుండాలి కదా. 

మరి మీరు ?


సరే  మరి ... ఉంటాను 




13, జనవరి 2024, శనివారం

సంక్రాంతి కానుక - ఈ స్ట్రాటజీ

అందరికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు 

సంక్రాంతి కానుక అంటున్నారు ... అంత గొప్పదా ఈ స్ట్రాటజీ ? అని మీరు అనవచ్చు... 

ఈ కానుక మీకు ఇచ్చేది కాదు ... నాకు వచ్చింది ... నాకు నచ్చింది ... 

అదేంటో వివరిస్తాను ... మీకు కూడా కానుక లాగానే అనిపిస్తే .. కాస్త స్పందించండి ... అంతే ... 

వివరాల్లోకి వెళితే ... 


మార్కెట్ ఎంతలో ఉందొ (రౌండ్ ఫిగర్) దానికి 1000 పాయింట్లు కలిపితే వచ్చే స్ట్రైక్ ప్రయిస్ దగ్గర ఒక కాల్ సెల్ ఆర్డర్ పెట్టండి ... ఆ స్ట్రయిక్ ప్రైస్ కి మరో 1000 పాయింట్లు కలిపితే వచ్చే విలువ దగ్గర రెండు కాల్ బయ్ ఆర్డర్ పెట్టండి ... మార్కెట్ ప్రస్తుత ధర వద్దనుండి 1000 పాయింట్లు పెరిగే లోపుగా రెండింటిని స్క్వేర్ ఆఫ్ చేసేయండి ... ముగింపు ధర ఈ వారం కాక వచ్చే వారం అయితే బెటర్ .. 

సెల్ ఆర్డర్ దాదాపు 150 -  400  రూపాయలు మధ్యలో ప్రీమియం  ... ఉండేలా ఉంటె మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ... 

ఉదాహరణకు ప్రస్తుత మార్కెట్ ధర 47709
అంటే 47800 అనుకుంటే ... దీనికి 1000 పాయింట్లు కలిపితే 48800 వద్ద 25. జనవరి కాల్ 158 సెల్ ఆర్డర్ ; 49800 వద్ద 2 కాల్ బయ్ ఆర్డర్ ; అపుడు జనవరి 25 లోపు మార్కెట్ 48800 దాటక పొతే 1100 రూపాయల లాభంలో ఉంటాం.   లేదా మధ్యలో 500 దాటినా క్లోజ్ చేసేసి, కొత్త ఆర్డర్ తీసుకున్నా పరవాలేదు ... 

సాధారణంగా శుక్రవారం 3 గంటల తరువాత ప్రారంభించి ... మరుసటి వారం శుక్రవారం లోపు ముగించ గలిగితే మంచిది.   

ఒకవేళ 48800 తొందరగా దాటిపోతే 1 బయ్ ఆర్డర్ పెట్టి ప్రాఫిట్ లేదా లాస్ బుక్ చేసేయాలి.  

ఎక్కువ రిస్క్ లేనిది ... ఎక్కువ టెన్షన్ లేనిది ... లాభం కూడా తక్కువ అయినా కనీసం నెలకు 5% వచ్చే అవకాశం ఉన్న స్ట్రాటజీ ఇది 

ట్రై చేయండి ... 

మరోసారి భోగి, సంక్రాంతి, కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు. 

జై శ్రీరామ్ 







14, ఆగస్టు 2023, సోమవారం

ఆప్షన్ ట్రేడింగ్ లో నష్టాలు వస్తున్నాయా ?

అవును ... నష్టాలు వస్తున్నాయి .... అనే వాళ్ళకి నా సమాధానం .... 

"అవును ... వస్తాయి ... నాకూ వస్తున్నాయి ... అది సర్వ సాధారణం ... " 


ఏమిటి ? కాలిందా ...??


నేనింకా పూర్తి చేయలేదు ... ప్రారంభించానంతే ... 


ప్రారంభించే ముందు అందరికి "77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు "


ఇంతకు ముందు ఏవో కొన్ని స్ట్రాటజీ ల గురించి పంచు కున్నాను ... ఇప్పుడు యు ట్యూబ్ ఆన్ చేస్తే ఎన్నో ... ఎన్నెన్నో ... ఎంతమందో , ఎన్ని రకాలో ... ఫ్రీ గా ... 


ఇప్పుడు ... ఉద్యోగం చేసుకొని, ఎప్పుడో తప్ప గమనించడం వీలు కానివారికోసం ఒక మహానుభావుడు చెప్పిన స్ట్రాటజీ ఒకటి ... మీ కోసం ... 

1. నెల ప్రారంభం లో, లేదా ముందు నెల ముగింపు తేదీ అయిపోయిన మరుసటి రోజు ... ప్రస్తుత మార్కెట్ ధర వద్ద ... ఒక కాల్ మరియు ఒక ఫుట్ సెల్ ఆర్డర్ పెట్టండి ...  ముగింపు తేదీ ఆ నెల ఆఖరుది  అయి ఉండాలి ... 

2. కాల్ మరియు ఫుట్ రెండింటి మొత్తం ఎంత ఉంటుందో అంత దూరం లో కాల్ మరియు ఫుట్ కొనుగోలు చేయండి ... (సెల్ ఆర్డర్ లో నాల్గో వంతు బయ్ ఆర్డర్ ఉండే అవకాశం ఉంది). 


3. కేవలం సెల్ ఆర్డర్ పెడితే లాస్ అన్ లిమిటెడ్ అవుతుంది ... ఇలా బై ఆర్డర్ లు పెట్టడం వల్ల లాస్ పరిమితం అవుతుంది ... దాదాపు ఆరు వేల దగ్గర అటూ .. ఇటూ గ ఉంటుంది ....  అంతేకాకుండా కేవలం సెల్ ఆర్డర్ కోసం లక్ష దాటి కావాలి ... బై ఆర్డర్ కూడా పెట్టడం వల్ల పెట్టుబడి డెబ్బయి వేల లోపు సరిపోతుంది. 

4.  ఇందులో బై ఆర్డర్ లను ముగింపు తేదీ వరకు టచ్ చేయము ... సెల్ ఆర్డర్ లను మాత్రం పెరుగు తున్న ప్రతిసారి మన రిస్క్ కెపాసిటీ బట్టి క్లోజ్ చేస్తూ ఉండాలి ... 

5. సాధారణంగా రెండు మూడు రోజుల్లో 500 రూపాయలు దాటి లాభం కనబడుతూ ఉంటుంది ... 

6. కాలక్రమేణా ప్రీమియం లలో తగ్గుదల అనే కారణంగా .. మరియు మార్కెట్ పెరుగుదల లేదా తగ్గుదల ... మరియు ఎటు కూడా కదలకుండా రేంజ్ బౌండ్ లో ఉండడం లాంటి సందర్భాలు దీనిలో లాభం పొందే అవకాశం రావడానికి కారణాలు.   

7. లాభం కనబడినప్పుడు సెల్ ఆర్డర్ క్లోజ్ చేసేసి, మరల అప్పటి మార్కెట్ ధర వద్ద కొత్త సెల్ ఆర్డర్ పెట్టడం ... లాభం వచ్చినప్పుడు క్లోజ్ చేయడం , మళ్ళీ కొత్త ఆర్డర్ అప్పటి మార్కెట్ రేట్ వద్ద తీసుకోవడం ఇలా ఎక్స్పైరీ వరకు చేస్తూ ఉండాలి ... 

8. చివరకు వచ్చే సరికి బయ్ ఆర్డర్ లు రెండు కూడా సున్నా అవడం కానీ ... ఒకదానిలో లాభం ఒకదానిలో నష్టం ఉండడం కానీ, సెల్ ఆర్డర్ లలో కాస్త నష్టం భరించవలసి ఉండటం కానీ జరుగుతుంది.  

9. ముందు వచ్చిన లాభం ... నుండి  చివరలో వచ్చిన నష్టం ... తగ్గిస్తే వచ్చేది నికర లాభం ... 

10. దీనిలో వచ్చే లాభం 5 నుండి 10 శాతం కనీసం ఉండవచ్చు.  


ఒక నెల పేపర్ ట్రేడ్ చేసి చూడండి ... బాగుంటే అప్లై చేయండి .... 


మీ దగ్గర మంచి స్ట్రాటజీ లేమైనా ఉంటే నాకు తెలియజేయండి. 


మీ 


మురళీ కృష్ణ 

986 655 2409








29, ఏప్రిల్ 2023, శనివారం

బుల్ కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ స్ట్రాటజీ

అంతా ఈ సింపుల్ స్ట్రాటజీ ని చూసే ఉంటారు ... 

దీనిలో  ఒక కాల్ సెల్ ఆర్డర్ ... రెండు కాల్ బయ్ ఆర్డర్ ... చేయాలి ... 

సెల్ ఆర్డర్ ఒక వంద రూపాయలది ఐతే , బయ్ ఆర్డర్ లు రెండు, సెల్ ఆర్డర్ లో 45% కి అటూ , ఇటూ ... 

ఎక్సపైరీ సాధ్యమైనంత దూరంలో ఐతే బెటర్ .... 

మార్కెట్ బాగా పైకి లేదా  కిందికి కదలిక ఉంటే చాలా లాభం ... 


ఉదాహరణ :

ప్రస్తుత మార్కెట్ విలువ - 43233

25 మే 2023 - ముగింపు తేదీ బ్యాంక్ నిఫ్టీ కాల్ 44600 సెల్ ఆర్డర్ విలువ ... 118 రూపాయలు 

25 మే 2023 - ముగింపు తేదీ బ్యాంక్ నిఫ్టి కాల్  45500 బయ్ ఆర్డర్  ఒక్కొక్కటీ 40 రూపాయల చొప్పున రెండు ... 

దీనికి కావలసిన పెట్టుబడి 26,000 రూపాయలు 

ఇపుడు ఎలా ఉంటుందో చూద్దాం ... 

1. మే 01 నుండి ముగింపు తేదీ వరకు మార్కెట్ 42230 దగ్గరే ఉంది పోయి ఉంటె లాభం విలువ - 35,18, 26, 40, 59, 153, 197, 246, 302, 363, 574, 648, 721, 789, 849, 946, 951 ... అంటే ప్రారంభమైన దగ్గరే మార్కెట్ నెలాఖరుకి ఉంటే 3% లాభం. 

2.   మార్కెట్ 42230 కన్నా పైకి 0. 5% పైకి ముగింపు తేదీ నాటికీ ఉంటే లాభంలో మార్పులు - : -237, -243, -236, -170, -132, -84, -27, +39, +293, +393, -9, +126, +274, +431, +857, +930, 951...   అంటే లాభం ఒక్కో రోజూ ఒక్కోలా ఉంది ... 

3 మార్కెట్ 42230 కన్నా 1% పెరిగితే ముగిపు తేదీ వరకు నష్టాల్లోనే ఉండి ముగింపు తేదికి 951 కి చేరింది.  అలాగే 1. 5% కి పెరిగితే  (-)1000 నుండి (+)943 రేంజ్ లో ఉంది ... 

4. మార్కెట్ 42230 కన్నా 5% ఎక్కువ పెరిగితే మే 01 న 2445/- ... (-)3329, (-)5066, (-)7200, (-)8000; (-)11500, (-)13102; (-)15347/-; (-)19,000/- 

5. (-)5% ఐతే 950 రూపాయలుగా ఉంటుంది 

6.అదే మార్కెట్ 42230 నుండి 47557 వరకు పొతే 29,000 లాభం ... ఇదే మార్కెట్ 38910 వరకు దిగిపోయినా 950 లాభం ... 

సో, ఒకసారి గమనించండి ... 



13, ఏప్రిల్ 2023, గురువారం

స్పందన కరవు

యు ట్యూబ్ ల కాలం ... పేస్ బుక్ ల యుగం ...  వాట్స్ యాప్ ల ప్రపంచం ... 

ఇప్పుడు బ్లాగ్ లను ఎవరు చూస్తారు ... అయినా ఏదో ఒకటి రాస్తూ ఉంటాను ... 

నిజానికి మరో ఆప్షన్ స్ట్రాటజీ వ్రాద్దామనుకున్నాను ... 

ఎవరు చూస్తారులే అని మానుకుంటున్నాను ... 

స్పందించండి ... అపుడు చూద్దాం 

3, మార్చి 2023, శుక్రవారం

మార్చి నెల మరో ట్రేడ్ ... శుభారంభం


మార్కెట్ 40800 లో ఉన్నప్పుడు కాల్ మరియు ఫుట్ సెల్ ఆర్డర్స్ ; 41500 లో కాల్ బై ఆర్డర్ ఇంకా 39900 లో ఫుట్ బై ఆర్డర్ పెడితే ఈ రోజు చివరికి మూడు వేల మూడు వందలు లాభం ... 

ముగించేద్దామా ?


2, మార్చి 2023, గురువారం

మార్చి నెలలో మొదటి ట్రేడ్ ను ఈ రోజుతో ముగించాం ...


మార్చి నెల కి సంబంధించిన కొత్త ట్రేడ్ ఫిబ్రవరి లోనే ప్రారంభించాం కదా ... కొత్తగా యాడ్ చేసిన ట్రేడ్స్ లో రూ 7245/- సంపాదించగలిగాం .  మరి రెగ్యులర్ ట్రేడ్ లో చుడండి పైన ఉన్న పట్టికను ... రూ 2228/- లాభం వచ్చింది కదా ... మొత్తానికి రూ 10,223/- చాలదా?  

పోనీ యాడ్ చేసిన ట్రేడ్స్ లేవనుకున్నా ఒక వారం లోపే రూ. 2,228/- ... సరిపెట్టుకుందాం 

దీనిని ఈ రోజుతో ముగిద్దాం ... రేపటి నుండి కొత్త ట్రేడ్ ను గమనిద్దాం 

ఉంటా మరి 

మురళీ కృష్ణ 

1, మార్చి 2023, బుధవారం

ఫిబ్రవరి ట్రేడింగ్ పూర్తయింది ... మార్చ్ ట్రేడింగ్ మొదలయ్యింది

 నమస్కారం ట్రేడింగ్ మిత్రులారా .... 


కొద్దిగా స్పందించండి ... బాగుందనో ... బాలేదనో ... అర్థం కాలేదనో లేదా దరిద్రంగా ఉందనో ... 

తెలిసిన వాళ్ళైతే ఇంతకన్నా మంచిగా లాభం రావాలంటే ఏమి చేయవచ్చో సూచించండి ... తెలియని వాళ్ళైతే ఇంకా క్లియర్ గ వ్రాయమని చెప్పండి ... ఇదేమీ డబ్బు సంపాదించడానికి ఖచ్చితమైన దారి కాదు ... ఒక నెలలో లాగా రెండో నెలలో ఉండదు .. అలాగే నెల నెలా ఉండదు.   ఏ నెలకానెల ... కొత్తగా ఉండొచ్చు ... తిక్కగా కూడా ఉండొచ్చు ... ఈ దారి మూసుకుపోయేలోగా ఎంత వీలయితే  అంత ... ఉపయోగించుకోవడానికి ప్రయత్నిద్దాం ... 

సరే ... మరి విషయం లోకి వచ్చేద్దాము ... 

ముందు నెల ట్రేడ్ 23 ఫిబ్రవరి కి ముగించాం ... నెలంతా హోల్డ్ చేస్తే ... ఏ కొత్త ట్రేడ్ చేయకుండా అదే ట్రేడ్ ను నెలంతా ఉంచితే ... కేవలం రూ 2500/- వచ్చింది ... ఒకవేళ ఫుట్ మరో లాట్ కొని ఉంటె 23 ఉదయం ... అది సాయంత్రానికి 150 పాయింట్స్ పెరగడం వల్ల ఫిబ్రవరి లాభం 6వేల 7 వందలకు పెరిగి ఉండేది 

ఇక ఫిబ్రవరి 23 వ తేదీన , మార్చ్ 23 ముగింపు తేదీ గ తీసుకుని కాల్ మరియు ఫుట్ అమ్మకం మరియు కొనుగోలు చేసాం.  


At ది money - Strike Price - 40000  - ఈ ధరవద్ద కాల్ మరియు ఫుట్ సెల్ ఆర్డర్ ప్లేస్ చేశాం 
41000 వద్ద కాల్ మరియు 39000 వద్ద ఫుట్ బయ్ ఆర్డర్ ప్లేస్ చేశాం 

కాల్ సెల్ ప్రీమియం ధర - 805; ఫుట్ - 715;
కాల్ బయ్ ప్రీమియం ధర - 350; ఫుట్ 356.75

28 ఫిబ్రవరి తేదికి ఓవర్ ఆల్ లాస్ 3684 ఉంది .  

అందుకని 345 రూపాయల కాల్ యాడ్ చేశాం 
అది కాస్త ఈ రోజుకి 446 కి పోవడంతో ప్రాఫిట్ బుక్ చేస్తే 2,525 రూపాయల లాభం వచ్చింది 
అంతే కాకుండా నిన్నటి 3684 లాస్ ఈ రోజుకి -2740 అయ్యింది. 
అంటే ఓవర్ ఆల్  ప్రాఫిట్ (-)215/-

మళ్ళీ 41300 strike price దగ్గర 291 రూపాయలకు మరో కాల్ ఆర్డర్ యాడ్ చేశాం ... అది 350కి పెరిగింది .  ప్రాఫిట్ బుక్ చేస్తే బెస్ట్ కదా ... 1470 వచ్చింది ... 

అంటే రెగ్యులర్ ట్రేడ్ ప్రాఫిట్ = (-)2454/-;  కొత్త కాల్స్ వల్ల లాభం 3995 రూపాయలు... 

అంటే  ఈ రోజుకి ఈ నెల మొత్తం లాభం 1541/- మాత్రం.. 

గమనించండి... 23 న ప్రారంభించిన ట్రేడ్ ఇది ... 28 వరకు రెగ్యులర్ ట్రేడ్ కు అదనంగా కొత్త ట్రేడ్స్ ఫిబ్రవరి 28 మరియు మార్చ్ 1 న మాత్రమే చేశాం ... 23 నుండి ప్రతి రోజూ అదనపు ట్రేడింగ్ లు జాగ్రత్తగా చేయగలిగితే ఇంకా ఎక్కువ లాభం చూడవచ్చు ... కానీ లాభం ఖచ్చితంగా వస్తుంది అనిపిస్తేనే ట్రేడ్ చేయాలి.   లేకపోతె రెగ్యులర్ ట్రేడ్ లో లాస్ కు మరికాస్త లాస్ తోడవుతుంది... 

కాస్త స్పందించండి... 

రేపు గురువారం ... వారాంతపు ముగింపు ఉంటుంది.  

ఈ రోజుకి సెలవ్ 






27, ఫిబ్రవరి 2023, సోమవారం

నెలాఖరు ముగింపు వరకు వేచివుండే కాల్ మరియు ఫుట్ అమ్మకపు వ్యూహం .. నష్ట నివారణకై కాల్ మరియు ఫుట్ కొనుగోలు తో .... (Month Ending Call and Put selling strategy with Hedging by call and put buy orders)

నెల ప్రారంభం లో లేదా 30 రోజుల ముందు వచ్చేలా ... నెలాఖరు ముగింపు తేదీ లేదా 30 రోజుల తరువాత ముగింపు తేదీ (Expiry Date Month end or after 30 Days )

కాల్ మరియు ఫుట్ At the money దగ్గర సెల్ ఆర్డర్ ప్లేస్ చేయాలి. 

కాల్ మరియు ఫుట్ అవుట్ అఫ్ మనీ మరియు ఇన్ ది మనీ వద్ద దాదాపు సెల్ ఆర్డర్ కు సగానికి వచ్చేట్లుగా బై ఆర్డర్స్ ప్లేస్ చేయాలి. 

Expiry Date వరకూ వేచి ఉండి అప్పుడు క్లోజ్ చేయాలి. 


ఫిబ్రవరి 1 న ట్రేడింగ్ ప్రారంభిస్తే 13 వ తారీకుకి  కింద చూడండి ... 4925 రూపాయల లాభం వచ్చింది 


ఈ మాత్రం లాభం ఉన్నా క్లోజ్ చేసేయ వచ్చు ... ఒకవేళ నష్టం కనిపిస్తుంటే మరో బయ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం ద్వారా నష్టం తగ్గించు కోవచ్చు లేదా లాభము గ మార్చుకోవచ్చు. 






15, ఫిబ్రవరి 2023, బుధవారం

ఆప్షన్ ట్రేడింగ్ ... లాస్ లేకుండా ....

నమస్కారం ... 

ముందు అనుకున్న విధంగా ఈ ఆప్షన్స్ గురించి మరి కొన్ని విషయాలు నాకు తెలిసినవి .... 

1. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈ టి ఎఫ్ లు కొంటె ఎంత కాలమైనా ఉంచుకోవచ్చు.   వీటి విలువ తగ్గుతూ ఉండవచ్చు ... పెరుగుతూ ఉండవచ్చు ... మంచి కంపెనీలైతే తగ్గినా తరువాత పెరిగే అవకాశం ఉంటుంది.   కాకపోతే ఇప్పుడు మంచి కంపెనీ ... తరువాతి కాలంలో నాశనం అయిపోవచ్చు.   మళ్ళీ పుంజుకోవచ్చు..  

2. మరి ఈ ఆప్షన్స్ జీవిత కాలం కేవలం ఒక వారమో , నెలో మాత్రం ఉంటుంది ... ఈ గడువులోనే అవి భయంకరంగా పెరిగి పోవచ్చు ... లేదా సున్నా అయిపోవచ్చు. 

3. ఉదాహరణకు బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ... బ్యాంక్ నిఫ్టీ పెరిగితే కాల్ ఆప్షన్ పెరుగుతుంది ... తగ్గితే ఫుట్ ఆప్షన్ పెరుగుతుంది.  ఇది సాధారణంగా జరిగేది.  కానీ ఎక్స్పైరీ డేట్ దగ్గర పడే కొద్దీ ఒకవేళ మార్కెట్ పెరగడం తగ్గడం కొంచెం కొంచెం గ ఉండటమో , ప్రారంభమైన విలువ దగ్గరే ముగించడమో జరిగితే కాల్ మరియు ఫుట్ రెండూ తగ్గుతుంటాయి.   

4. ఒక స్ట్రాటజీ ప్రకారం కాల్ ఫుట్ రెండూ నెల మొదట్లో కొని నెలాఖరు వరకు వేచి ఉంటె రెండింటిలో ఒకటి సున్నా అయిపోయేది ... అంటే సున్నా అయిపోయేది పోయినా పెరిగే దానిలో లాభం వచ్చేది ... పెట్టుబడి కూడా తక్కువ ... కాకపోతే రెండూ తగ్గడం అనేది జరిగితే ఈ బైయింగ్ స్ట్రాటజీ వర్క్ అవుట్ అవదు. 

5. ఒక వేళ పెరిగే దానిని పెరగనిచ్చి ... తగ్గుతూ ఉన్నదానికి, హెడ్జింగ్ కోసం సెల్ ఆర్డర్ పెడితే లాస్ మినిమైజ్ అవుతుంది. 

6. ఎంత తగ్గినపుడు హెడ్జింగ్ చేసుకోవాలో అనేది మన ఇష్టం... మనలాస్ భరించ గలిగే శక్తి మీద ఆధారపడుతుంది.  కాకపోతే సెల్ ఆర్డర్ కోసం పెట్టుబడి కాస్త ఎక్కువ అవసరం.   

7. ఆలా అని, డబ్బులు బాగా ఉంది ... రెండూ సెల్ ఆర్డర్ లే పెడదాం అనుకుంటే, స్టాప్ లాస్ అయినా పెట్టాలి... లేదా పెరిగే దానికి హెడ్జింగ్ కోసం బై ఆర్డర్ పెట్టాలి. 

ఇవన్నీ కాదు బాస్ ... నాకు రిస్క్ లేకుండా .... లాస్ వచ్చినా తక్కువ గాను  మరియు తక్కువ సార్లు వచ్చి, లాభావకాశాలే ఎక్కువ కావాలి అనుకుంటే నేనొక స్ట్రాటజీ అనుకుంటున్నాను ... అది ఇంకా పేపర్ ట్రేడింగ్ లోనే ఉంది ... ఈ నెలలోనే టెస్టింగ్ ప్రారంభించాను.   ఫిబ్రవరి ప్రారంభ తేదీల్లో ప్రారంభించాను.  

అది ఇప్పటి వరకు ఏ పరిస్థితిలో ఉందొ  చెబుతాను ... 


(సశేషం )




10, ఫిబ్రవరి 2023, శుక్రవారం

నెలవారీ ఆప్షన్స్ సెల్లింగ్ స్ట్రాటజీ ... బైయింగ్ హెడ్జింగ్ తోనా... లేకుండానా ? (మొదటి భాగం )

అసలీ ఆప్షన్స్ గోల ఏమిటి ? మ్యూచువల్ ఫండ్స్ అన్నారు ... వాటిలో రక రకాలు ఉన్నాయన్నారు ... స్టాక్స్ అన్నారు ... స్టాక్స్ లో ఇన్వెస్టింగ్ మంచిదా ... ట్రేడింగ్ మంచిదా అన్నారు ... తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోమన్నారు ... మంత్లీ సిప్ అన్నారు ... తరువాత ETF లు అన్నారు ... గోల్డ్ అన్నారు ... ఆప్షన్స్ అంటున్నారు ... ఫ్యూచర్స్ అంటున్నారు ... బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50, ఫిన్ నిఫ్టీ ... ఇలా ఏవేవో చెప్పినవి చెప్పకుండా ట్రై చేయమంటున్నారు.. ఒకసారి లాభం వస్తే పది సార్లు నష్టం ... పది వేలు లాభం వస్తే లక్షల్లో నష్టం ... 

ఇవన్నీ కాదు గాని ... ఆప్షన్స్ గురించి చెబుతున్నారు కాబట్టి ... ఎక్కువ టైం కేటాయించలేం ... ఎక్కువ డబ్బు పెట్టలేం ... ఎక్కువ టెన్షన్ పడలేం ... బి.పి మెషీన్లు పేలిపోతున్నాయి ... అసలు సామాన్యులకు, నాలాంటి సగటు మనుషులకు .... అర్థమయ్యేలా చెప్పండి బాస్ ... అసలు ఆప్షన్స్ ట్రేడింగ్ మాకు సరిపడుతుందా ? లేదా ? ... 

నా మటుకు నాకు సంపాదించుకున్న దానికన్నా పోగొట్టుకున్నది ఎక్కువ ... ఒక ఆరు నుండి ఎనిమిది లక్షల వరకు పోగొట్టుకుని ఉంటాను.   కానీ అనుభవం కన్నా మంచి గురువు ఎవరుంటారు.. 

అందుకని నా అనుభవాలను పంచుకుంటూ ఉంటాను ఈ బ్లాగ్ ద్వారా ... 

ముందు కింద పొందుపరచిన పంక్తులను గమనించి ... అసలు ఆప్షన్ ట్రేడింగ్ చేయాలో వద్దో మీరే నిర్ణయించుకోండి ... 

1. ఎవడో కంపెనీ పెడతాడు ... దానిని స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్ట్ అయ్యేట్టు చేస్తాడు ... తన కంపెనీ లో షేర్ లకు ధర నిర్ణయించి ఐపీవో లో పెడతాడు.   జనాలు కొనుక్కుని హోల్డ్ చేసుకొని డివిడెండ్స్ అనుభవిస్తూ ... తరువాత ఎప్పుడో అమ్మేసుకుంటాడు ... కంపెనీ లాభాలలో ఉంటె ధర పెరుగుతూ ఉంతుంది కనుక ఈ అమ్మేసుకున్నవాడు లాభం పొందుతాడు.  .... ఇక్కడి వరకు బాగానే ఉంది... దీనినే పెట్టుబడి పెట్టడం లాభం పొందడం అంటాం ... ఎప్పుడైతే ఇంటర్నెట్ సౌకర్యం పెరిగి ఆన్లైన్ లో ఇన్వెస్టింగ్, డీమ్యాట్ అకౌంట్ ద్వారా ఇన్వెస్టింగ్ ... వచ్చాయో , బ్రోకర్స్ పెరిగి ఇన్వెస్టింగ్ కాస్త ట్రేడింగ్ గ మారింది ... ఇలా ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ గురించి తెలియని వారు మధ్యవర్తుల ద్వారా స్టాక్స్ కొనాలనుకున్నప్పుడు మ్యూచవల్ ఫండ్స్ వచ్చాయి ... ఇవి అందరికి తెలిసిన విషయాలే కదా .... అంతేనా ... ఇంకా ఇవి చాలవన్నట్లు ఈ. టి. ఎఫ్ లు వచ్చేయి .  ఇలా కాదు గురు ... ఇంకా జనాల డబ్బులు దొబ్బడానికి వచ్చినవే ఈ ఆప్షన్స్ మరియు ఫ్యూచర్సూ... అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బెట్టింగ్ ల్లాంటివన్నమాట .... 

2. మరి ఈ బెట్టింగ్ లలో డబ్బులు సంపాదించడాని కై రకరకాల స్ట్రాటజీ లను ఎన్ ఎస్ ఈ ఇండియా వారే  ముద్రించారు.  మనం ఇంతకూ ముందు చదువుకున్న స్ట్రాటజీ లు ఇలాంటివే ... ఎవరో యూ ట్యూబ్స్ లో పెట్టినవే ... 

(సశేషం )









2, ఫిబ్రవరి 2023, గురువారం

బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడింగ్ ... పేపర్ ట్రేడింగ్ .... ఈ వారానికి చివరి రోజు ... తరువాతి వారానికి మొదటి రోజు


ముగింపు రోజు న కింగ్ రీసెర్చ్ ఫార్ములా లో ఈ రోజు కాల్ గానీ , ఫుట్ గానీ కొనుగోలు జరుగలేదు.   నో టెన్షన్ ... 

కానీ మురళీ కృష్ణ స్ట్రాటజీ లో కాల్ ఫుట్ రెండూ బై చేస్తాం కదా ... 




రోజు చివరికి లాస్ 40 రూపాయల వరకూ ... బ్రోకరేజ్ తో కలిపి ఇంకా ఎక్కువ ... ఒక రెండు వందలు ఉండదూ .... మరి ఇది ఇక్కడే ముగిస్తే ఇలా ... సోమవారానికి ఉంచితే ?  

అది తరువాత గమనించుదాం... 

మరి ఈ మన ఆట ప్రారంభం నుండి ఈ రోజు వరకు లాభం  
మన కింగ్ రీసెర్చ్ స్ట్రాటజీ ప్రకారం ఐతే ఎంత ? 
మురళీ కృష్ణ స్ట్రాటజీ ప్రకారం ఎంత ?

లాభపడే అవకాశం ఎంత ? ఎందులో ఎంత ? నష్టం ఛాన్స్ ఎంత ? ఎందులో ఎంత?

మీరే గమనించండి .... 


1, ఫిబ్రవరి 2023, బుధవారం

నాలుగో రోజు ... అప్షన్స్ ట్రేడింగ్ కథ ...

సాధారణంగా పేపర్ ట్రేడింగ్ నెల రోజులు కనీసం చేయాలి.  ఐతే ఈ వీక్లి ఎక్స్పైరీ అంటే రేపటి వరకు చేసి బ్లాగ్ లో పొందు పరచాలని అనుకుంటున్నాను ... ప్రతిరోజూ ఇలా బ్లాగ్ లో పొందు పరచడం అంటే కుదరదు కదా .... 


సరే ... ఈ రోజు మార్కెట్ చాల చిత్ర విచిత్రంగా ఉంది ... 

ఎప్పటి లాగానే 10 గంటల స్ట్రైక్ ప్రైస్ ... కాల్ హై ప్రైస్ బై ఆర్డర్ .... అలానే ఫుట్ ... ఇదంతా తెలుసు కదా.  ఆఖరికి కాల్ 390 రూపాయల దగ్గర కొనుగోలు జరిగింది.  అది ఆలా ఆలా ఆలా పైకి పోతూనే ఉంది 750 వరకు పై కి పోయింది ... అక్కడి నుండి కిందకు రావడం జరిగింది ... చివరకు ఎంత కిందకి వచ్చిందో తెలుసా .... 42 కి ????

అంటే ఇంకా పైకి పోతుందని ఆశించకుండా 750 లోపే మేల్కొంటే లాభం 9000 రూపాయలన్నమాట. 

అత్యాశ కు పోతే 8700 రూపాయల నష్టం మరి .... 



ఇదే సమయంలో ... నిజానికి ఈ స్ట్రాటజీ కి ముందే 9 గంటల 30 నిమిషాలకి కాల్ మరియు ఫుట్ 200 రేంజ్ లో కొని చూస్తే నిన్న రెండు అమ్ముడు పోయాయి మంచి లాభానికి.   కానీ  ఈ రోజు రెండు కూడా తగ్గుతున్నాయని రెండింటిలో సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేశాను.  కాల్ సెల్ విపరీతంగా పెరిగిపోవడం జరిగింది ... అందుకనే దానిని బాలన్స్ చేయడానికి మూడు ధరలలో కాల్  కొనుగోలు చేయడం జరిగింది.   మొత్తంగా 5000 రూపాయలు రేంజ్ లో ప్రాఫిట్ కనిపించగానే (నిజానికి 6475/-) క్లోజ్ చేసేసాను.   చివరలో చూస్తే, ఒకవేళ ఆలా క్లోజ్ చేయకుండా చివర వరకు ఉంచి నట్లైతే 17000/- లాస్ వచ్చేది.  బడ్జెట్ మహిమ అనుకుంటా .. వరుసగా ట్రేడింగ్ పట్టికలు కింద ఇచ్చాను ...  చిత్తగించండి. 







అంటే ఈ పట్టిక లో చూపిన విధంగా ... ఆ సమయానికి క్లోజ్ చేసేస్తే 6475 రూపాయల లాభం వచ్చేది.  ఆలా కాకుండా 3 గంటల 30 నిమిషాల వరకు ఉంచితే ?  కింద పట్టిక సమాధానం ... 



అదన్న మాట విషయం ... అందుకే స్టాక్ మార్కెట్ అంటే షాక్ మార్కెట్ అంటారు ... కాబట్టి వీలైన లాభం పొందాలి తప్ప మరి ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు. 






31, జనవరి 2023, మంగళవారం

మూడో రోజు ... అప్షన్స్ ట్రేడింగ్ కథ


పైన పట్టిక చూసారు కదా ... కాల్ కొనుగోలు జరగడం .... వెంటనే పెరిగి 700 దాటి పోవడం జరిగింది ... అంటే లాభం రూ . 1,725/-

ఐతే లేటుగా కొనుగోలు జరిగింది కదా  ..  9 గంటల 30 నిమిషాలకు 200 రూపాయల ప్రీమియం ధరలో కాల్ మరియు ఫుట్ రెండూ కొనుగోలు చేస్తే ఏమి జరగవచ్చో గమనించడం జరిగింది.  రెండు కూడా గంట లోపే 250 కి పోయి రూ. 2,500/- లాభాన్ని చూపించాయి.  

ఐతే కాల్ ని అమ్మేసి, ఫుట్ ని అమీ లోగ తగ్గడం జరగడంతో ఫుట్ లో ఒక సెల్ ఆర్డర్ 400 రూ. లకు చేయగా చివరికి 322. వద్ద ముగిసింది.  పెరగటం తగ్గటం జరుగుతుండడం తో మరో ఫుట్ 192 రూ లకు కొనుగోలు చేసాం .  అది 255 రూ  వద్ద ముగిసింది.  


అంటే ... 



అదీ విషయం 

30, జనవరి 2023, సోమవారం

రెండో రోజు ఆప్షన్స్ ట్రేడింగ్ కథ ....

 శుక్రవారం లాగానే ఈ రోజు కూడా హై ప్రైస్ కి కాల్ మరియు పుట్ బై ఆర్డర్ పెట్టాను 


1 గంట 40 నిమిషాలకు ఫుట్ ధర టచ్ అయ్యింది.  2 గంటల లోపే 20 పాయింట్లకు చేరి మళ్ళీ రివర్స్ అయ్యింది.  

మరి ఇంతలోగా తగ్గడం ప్రారంభమయ్యింది ఫుట్ .... 

వెంటనే ఫుట్ సెల్ ఆర్డర్ డబల్ అమౌంట్ దగ్గరగా (బై ఆర్డర్ స్ట్రైక్ ప్రైస్ కు 1000 కలపగా వచ్చిన స్ట్రైక్ ప్రైస్ దగ్గర ప్లేస్ చేసి చూసాను. (పెట్టుబడి ఎక్కువ కావాలి. 2 లక్షల వరకూ )




ఇది పేపర్ ట్రేడింగ్ కాబట్టి ... ఇలా ఐతే ఆలా అని చూపించాను   కానీ ప్రాక్టికల్ గ ఇలానే చేయగలమా అనే డౌట్ నాకు వచ్చింది.   అలాగే పెట్టుబడి ఖచ్చితంగా ఎంత కావాలో ప్రాక్టికల్ గ చూస్తేనే తెలుస్తుంది. 

మరీ రెండు గంటల వరకు వేచి చూడాలా అని కూడా అనిపించింది. 

మరోలా కూడా అనిపించింది ... 

పెరుగుతున్నది ఫుట్ అని పది గంటలకే అర్థం అయ్యింది ... అప్పుడే 503 దగ్గర బై ఆర్డర్ పెట్టి ఉంటె రెండు గంటల లోపే 970 కి చేరి పోయింది ... అంటే 467 పాయింట్లు అంటే రూ 11,000/- ప్రాఫిట్ వచ్చి ఉండేది.   


503 నుండి 970 కి పెరుగుతుందని ముందే తెలీదు కదా... ఒక వేళ 503 నుండి కిందకు రావడం ప్రారంభమైతే అప్పుడే మరో సెల్ ఆర్డర్ ప్లేస్ చేసి లాస్ ను మినిమైస్ చేయవచ్చు.   


సరే ... ఇంత గందరగోళం మధ్య ఈ రోజు పూర్తయ్యింది.  రేపు చూడాలి ఏమవుతుందో... 


కొద్దిగా తిట్టడం ద్వారా నైనా స్పందించండి. 

 



27, జనవరి 2023, శుక్రవారం

ఆప్షన్స్ కొంటూ ... పెరగకుంటే అమ్మడం ద్వారా నష్ట నివారణ

ఇంతకు ముందు చెప్పుకున్నాం ..ఆ ప్షన్స్  బైయింగ్ స్ట్రాటజీ ఒకటి.  గుర్తుందా ... సరే... ఒకసారి మననం చేసుకుందాం 


స్ట్రాటజీ నెం.1    (బై ఆర్డర్ స్ట్రాటజీ)     Intraday only


1.  బ్యాంక్ నిఫ్టీ లేదా, ఫ్యూచర్ ప్రతిరోజూ ఉదయం 10 గంటల లోపు ఎంత ఎక్కువ ధరకు పెరిగిందో గమనించాలి. (దీనినే  Strike Price అంటాం కదా )

2.  ప్రారంభమైన సమయం నుండి 10 గంటల సమయం లోపు  స్ట్రయిక్ ప్రైస్ హై ప్రైస్ ఎంత ఉంటుందో దానికి  300 కలిపిన వచ్చే ప్రైస్ ఎంత వస్తుందో దానికి సంబంధించిన కాల్ ను అప్షన్ చైన్ నుండి వాచ్ లిస్ట్ లోకి యాడ్ చేసుకోవాలి. 

3. అలాగే ప్రారంభమైన సమయం నుండి 10 గంటల సమయం లోపు  స్ట్రయిక్ ప్రైస్ హై ప్రైస్ ఎంత ఉంటుందో, దాని నుండి 300 తీసివేస్తే వచ్చే ధర వద్ద ఫుట్ ను అప్షన్ చైన్ నుండి వాచ్ లిస్ట్ లోకి యాడ్ చేసుకోవాలి. 

4. కాల్ మరియు ఫుట్ రెండింటిని ఆ రోజు 9. 15 నుండి 10 గంటల లోపు ఏదయితే ఎక్కువ ధర ఉంటుందో ఆ ధరకు కొనేట్లుగా ఆర్డర్ ప్లేస్ చెయ్యాలి (దీనినే స్టాప్ లాస్ బై ఆర్డర్ అంటారు కదా)

5. మార్కెట్ పెరిగితే కాల్ ఎగ్జిక్యూట్ అవడానికి, మార్కెట్ తగ్గితే ఫుట్ ఎగ్జిక్యూట్ అవడానికి, లేదా మార్కెట్ అక్కడికక్కడే మూవ్ అవుతుంటే ఏది కూడా ఎక్సిక్యూట్ కాకపోవడానికి అవకాశం ఉంటుంది. 

6. ఒకవేళ కాల్ ఎగ్జిక్యూట్ అయ్యిందనుకుందాం ... అయ్యాక పెరగడం ప్రారంభం అయ్యి, ఒక ఇరవై పాయింట్లు దాటిందనుకోండి ... స్టాప్ లాస్ సెల్ల్ ఆర్డర్ పెట్టేయాలి . పెరుగుతున్న కొద్దీ ఆర్డర్ వేల్యూ పెంచుకుంటూ పోవాలి.  ఉదాహరణకు 100 కు కొనింది ... 120 కి పెరిగింది అప్పుడు స్టాప్ లాస్ 100 పెట్టుకోండి.  140 కి వెళితే 120; 160 కి వెళితే 140 ఇలా అన్నమాట.  ఒకవేళ రివర్స్ ఐతే తగ్గించ కూడదు.  140 కి పెరిగినప్పుడు స్టాప్ లాస్ 120 కదా... 140 నుండి వెనకకు వచ్చిందనుకోండి ... అప్పుడు 120 కె అమ్ముకోవాల్సి వస్తుంది ... అప్పుడు 20 పాయింట్స్ లాభం పొందినట్టు.   25x 20 = 500 లాభం అన్నమాట.  

7. కాల్ ఎగ్జిక్యూట్ అయ్యినవెంటనే ఫుట్ ఆర్డర్ ను క్యాన్సిల్ చేసేయాలి. 

8. ఇదే విధంగా ఫుట్ ఎగ్జిక్యూట్ అయితే పైన చెప్పిన పద్దతి ని పాటించాలి. 

9. కాల్ మరియు ఫుట్ రెండు ఎగ్జిక్యూట్ కాకపోతే ఆ రోజు మార్కెట్ రేంజ్ బౌండ్ లో ఉన్నట్టు ... అంటే కాల్ మరియు ఫుట్ రెండు తగ్గే అవకాశాలు ఎక్కువ.  అంటే సెల్ ఆర్దర్స్ లో లాభం పొందే అవకాశం ఉన్నట్టు లెక్క.  రెండింటిలో సెల్ ఆర్డర్ పెట్టి ఒక 30% స్టాప్ లాస్ పెట్టేస్తే ఎదో ఒకదానిలో  లేదా రెండిటిలో లాభం ఉండే అవకాశం ఉంటుంది. 

10. సరే ... ఇప్పుడు కాల్ లేదా ఫుట్ రెండింటిలో ఒకటి ఎగ్జిక్యూట్ అయితే రెండో దాని క్యాన్సల్ చేసేసి.. ఎగ్జిక్యూట్ అయినా దానిని పెరుగుతున్న దారిలో స్టాప్ లాస్ సెల్ ఆర్డర్ పెట్ట మన్నాం ... ఒకవేళ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ రివర్స్ అయ్యిందనుకోండి ... ఇంతకూ ముందు ఏమి చేయాలనుకున్నాం.   వెంటనే hedging చేయడం కోసం , క్యాన్సిల్ చేసిన దానిని బై చేయాలనీ అన్నాం ..  ఐతే మార్కెట్ కిందకు పైకొ పొతే రెండింటి మధ్య తేడా ఒక వెయ్యి రూపాయల లో ఉంటుంది ... కానీ రేంజ్ బౌండ్ లో మార్కెట్ ఉంటే కాల్ మరియు ఫుట్ రెండు కూడా తగ్గిపోతాయి.  అప్పుడు హెడ్జింగ్ కాస్త పూర్తీ లాస్ గ మారుతుంది. అంటే మొత్తం పెట్టుబడి సగం కన్నా తగ్గిపోతుంది. 

అందుకనే ఒకటి కొన్నది తగ్గుతుంటే ,రెండోది కొనడం కాకుండా ... ఏదయితే రివర్స్ అవుతుందో దానిలోనే కాస్త పైకి లేదా కిందకి ఉన్న స్ట్రైక్ ప్రయిస్ దగ్గర దానికి సెల్ ఆర్డర్ పెడతాం ... 

దీని వల్ల లాస్ ఎక్కువగా ఉండదు ... కాకపోతే పెట్టుబడి సెల్ ఆర్డర్ కు ఎక్కువ ఉండాలి.  


దీనికి సంబంధించిన పేపర్ ట్రేడింగ్ ఈ రోజే స్టార్ట్ చేశాను.  




పై పట్టిక గమనించండి ... 40900 స్ట్రైక్ ప్రైస్ కి +300 - ఎంత 41200; అక్కడ కాల్ హై ప్రైస్ 652 ; కానీ అక్కడి వరకు పెరగలేదు ... అంటే ఎగ్జిక్యూట్ కాలేదు.  ఫుట్ ఎగ్జిక్యూట్ అయ్యింది ... 10 గంటలకు ఆర్డర్ పెడితే 12 గంటల ప్రాంతములో అయ్యింది ... 12 30 కి 850 దాటింది .. మనం కనీసం 830 వద్ద అమ్ముకోగలిగితే లాభం 5000 రూపాయలు దాటి వచ్చేదన్నమాట. 

పెట్టుబడి ఒక లక్ష అనుకుంటే . ఈ రోజు లాభం 5% అన్నమాట.  ఇక్కడ ఉపయోగించుకున్న మార్జిన్ కేవలం 16000 లోపు ... ఆ లెక్కలో ఐతే దాదాపు 35% లాభం ఒక్క రోజులో ... 


కానీ ఇది స్టాక్ మార్కెట్ ... కేవలం బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యి పైకి పోవడం మాత్రమే జరగదు కదా...

పైన చెప్పినట్టుగా 830 కి అమ్ముకోలేక పొతే చివరి వరకు ఉంచితే 594 కు కాల్ విలువ పడిపోయింది.  అప్పుడు 525 రూపాయల నష్టం కలిగేది.  

సరే.. ఈ రోజుకి ఇది ఇలా అయ్యింది ... మళ్ళీ సోమవారం చూద్దాం 


బై 

మీ 

మురళీ కృష్ణ 








2, సెప్టెంబర్ 2022, శుక్రవారం

ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నారా ?

బ్లాగ్ మిత్రులకు నమస్కారం...  


అసలు ఇప్పుడు బ్లాగ్స్ ఎవరు చూస్తున్నారు .... పేస్ బుక్, ఇంస్టాగ్రామ్ , లింక్డ్ ఇన్, వాట్స్ అప్, టెలిగ్రామ్, యు ట్యూబ్ ... ఇలా ఎన్నో, ఎన్నెన్నో ... అందులోకి స్టాక్ మార్కెట్ గురించి అయితే మరీను ... అందుకే చాల మంది చాల అంటే చాల విజ్ఞానం రక రకాలైన సాంఘిక మాధ్యమాల ద్వారా సంపాదించేస్తున్నారు,.  అందుకే నేను కూడా పెద్దగా బ్లాగ్ లోకి రావడం లేదు..  అయితే ఏదైనా కొత్తగా స్ట్రాటజీ తెలుసుకుంటే మాత్రం ఎవరితోనైనా పంచుకొనందే నిద్ర పట్టదు ... ఎవరికైనా చెబితే ఎదో తప్పదన్నట్టు వింటారు కానీ ... సీరియస్ నెస్ ఉండదు.   అదే బ్లాగ్ లో అయితే ... డైరీ లో వ్రాస్తున్నట్టు ... నాకు నేనే చెప్పుకున్నట్లు ఉంటుంది ... అది విజయాన్నిచ్చే స్ట్రాటజీ యా కాదా అనేది ప్రాక్టికల్ గా డబ్బు పోగొట్టుకుంటే కానీ తెలియడం లేదు ... ఐతే ఈ మధ్య ఒక రెండు లక్షలు వరకు పోగొట్టుకొని ... ఒక పాతదైన కొత్త స్ట్రాటజీ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను ... 


చెప్పానుగా ఇది పాతది ... కానీ కొత్త కొత్త ఇంట్రాడే ల మోజులో పడి ... ఈ పాతదైనా ... లో రిస్క్ స్ట్రాటజీ ని అందరూ వదిలేసారు ... 


ఇది పని చేస్తుందా లేదా అని పాత చరిత్ర లో వెదుకుదామంటే దొరకదు సరి అయిన ఇన్ఫర్మేషన్  ... అందుకని నేనే చేస్తున్న ప్రయోగం మరి కాస్త డబ్బును పోగొట్టుకుంటూ ... 


అది మరేంటి కాదు ... ప్రతినెలా  నెలాఖరు ఆప్షన్స్ ముగింపు తేదీ అయిపోగానే తరువాతి నెలాఖరు ముగింపు తేదీ కి సంబంధించిన కాల్ మరియు ఫుట్ లను నెల మొదటి రోజున అప్పటి స్ట్రైక్ ప్రెస్ ది లేదా స్ట్రైక్ ప్రైస్ కి +300 లేదా +700 లేదా +1000 చేసి కాల్ ; అదే విధంగా సేమ్ స్ట్రైక్ ప్రైస్ లేదా -300 ... -1000 చేసి ఫుట్ కొని నెలాఖరు వరకు ఉంచాలి... ఎక్సపైరి డేట్ కి ఏ ధర ఉన్న కూడా క్లోజ్ చేసేయాలి (అయిపోతుంది )


ఇలా సాధారణంగా మార్కెట్ పైకి లేదా కిందికి భయంకరంగా పోతే కాల్ లేదా ఫుట్ ఒకటి బాగా పెరిగి రెండోది జీరో అయిపోతుంది.   అప్పుడు ఖచ్చితంగా లాభం లో ఉంటాం ... ఎటొచ్చి ఒకసారి కిందకి ఒకసారి పైకి ... లేదా ఉన్నచోటనే కొంచెం కోచెమ్ గా కదలికలు ఉంటె  నష్టం భరించక తప్పదు.   


ఈ స్ట్రాటజీ కి సంబంధించినంతవరకు పేపర్ ట్రేడ్ చేశాను జులై ఆగస్ట్ నెలలకు ... లాభం కనిపించింది ...  సెప్టెంబర్ ప్రాక్టికల్ గా చేస్తున్నాను ... చూడాలి ... ఏమవుతుందో ... 


నోట్స్ చూసారుగా ... మరి ప్రాక్టికల్ గ పేపర్ ట్రేడింగ్ ఎలా ఉందొ మరోసారి చెబుతాను... 


మీ 

మురళీ కృష్ణ 


22, ఫిబ్రవరి 2022, మంగళవారం

ఎందరో మహానుభావులు చెప్పాక అచరించిన ఆప్షన్ బయ్యింగ్ స్ట్రాటజీ... తెలియనివారికోసం ... ఒకసారి ట్రై చేయండి

 


1.రూ.50000/- కనీసం డీ మ్యాట్ అకౌంట్ లో ఉండాలి.

2.ఉదయం 10 గంటల వరకూ ఆగి, అప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎంతలో ఉందో గమనించాలి.

3.ఉదాహరణకు 38000 లో ఉంటే, ఆ సమయంలో కాల్ మరియు పుట్ ఎంత ఉందో వాటిని వాచ్ లిస్ట్ లోకి యాడ్ చేసుకోవాలి.

4.ఒకవేళ ప్రీమియం ఎక్కువ అనుకుంటే, 37300 లో పుట్, 38300 లో కాల్ తీసుకోవచ్చు. 

5.ఎక్స్ పైరీ దగ్గరలోది తీసుకోవాలి.  గురువారం ఐతే తరువతి వారం ఎక్ష్ పైరీ డేట్ తీసుకోవాలి.

6.ఉదయం 10 గంటల తరువాత కాల్ మరియు పుట్ ఆర్డర్ ప్లేస్ చేయాలి ... అప్పటి ధర కాదు... 9 15 నుండి 10 వరకూ ఎక్కువ ధర (హై) ఎంత ఉంటే అంతకు స్టాప్ లాస్ బై అర్డర్ కాల్ మరియు పుట్ రెండింటిలోనూ చేయాలి.

7.సాధారణంగా ఏదో ఒకటి మాత్రమే బై అవుతుంది.  రెండొది ఇక అవ్వదు.  అప్పుడప్పుడూ అవ్వవచ్చు కూడ.

8.ఏదైతే బై అవుతుందో దానికి సెల్ ఆర్డర్ పెట్టుకోవాలి.  అదీ కూడా స్టాప్ లాస్ సెల్ ఆర్డర్ కొన్న ధరకు 20% తక్కువ పెట్టుకోవాలి.

9.కొన్న ధర రూ.500/- ఐతే స్టాప్ లాస్ సెల్ ఆర్డర్ రూ.400/- కు పెట్టాలన్న మాట.

10.ధర పెరుగుతున్న కొద్దీ స్టాప్ లాస్ ధర 20% చొప్పున లేదా మనకు అనుకూలమైనట్టు రూ.50/- చొప్పున పెంచుకుంటూ పోవాలి.

11.ఒకవేళ రిస్క్ ఎందుకు అనునుంటే మంచి ధర అనుకున్నప్పుడు అమ్మేయవచ్చు.

12.ఇలా ఒక నెల మొదట పేపర్ ట్రేడింగ్ చేసి చూడాలి. తరువాతే ఆచరణలో పెట్టాలి.

13.కాల్ మరియూ పుట్ సాధారణంగా ఒకదానికొకటి విలోమ దిశలో పెరుగుతాయి.  

14. కానీ ఒక్కొక్కసారి రెండూ తగ్గిపోయే అవకాశం ఉంది.

ఈ పద్ధతి లో కనీసం రోజుకు రూ.1000/- నుండి ఎంతైనా సంపాదించుకో వచ్చు.  స్టాప్ లాస్ పెడతాం కాబట్టి అప్పుడప్పుడూ ఎంతో కొంత లాస్ భరించవలసి రావచ్చు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కొనటం లేదా అమ్మటం ఒక్కసారికే పరిమితం చేయాలి.  స్టాప్ లాస్ హిట్ అయ్యాక పెరుగుతుందేమో అని ఆలోచించకూడదు.  అలాగే రోజులో మళ్ళీ ట్రేడ్ చేయకూడదు. ఒక్క లాట్ మాత్రమే ట్రై చేయాలి.  అలవాటైతే అప్పుడు ఎక్కువ లాట్ లు ట్రై చేయవచ్చు. ఒకరు చెప్పారని గుడ్డిగా పోకుండ మనకు మనం చెక్ చేసుకొని ప్రయత్నం చేయాలి.

పైన స్టేట్ మెంట్ లా ఒక స్టేట్ మెంట్ మొదట తయారు చేసుకొని ఒక నెలంతా చూస్తే నెలకు కనీసం 40% దాటి రిటర్న్స్ రాబట్టుకోవచ్చు.

యూ ట్యూబ్లో చాలా మంది ఈ పద్ధతిని చెప్పి ఉన్నారు.  వారు చెప్పిన దానికిది అక్షర రూపం మాత్రమే.

సో, ఇక మీ ఓపిక, మీ ఇష్టం... 

హ్యాపీ ట్రేడింగ్....

మీ 
మురళి.






14, జనవరి 2022, శుక్రవారం

చాలా కాలానికి ....

అందరికి నమస్కారం ...  

ముందుగా అందరికి భోగి, సంక్రాంతి, కనుమ మరియు ముక్కనుమ శుభాకాంక్షలు 


చాలా  కాలానికి బ్లాగ్ లోకి వచ్చాను.  చాల సంఘటనలు జరిగిపోయాయి ఈ మధ్య.  వాటిల్లో కరోనా ఒకటి.  మూడు సంవత్సరాలుగా ముప్పు తిప్పలు పెడుతోంది మనల్ని.  అయినా మనం ఏమీ నేర్చుకోవట్లేదు ... పోయిన ప్రాణాలు పోతున్నాయి ... వున్నవాళ్లు ముసుగులు వేసుకుని మామూలుగానే జీవితాన్ని గడిపేస్తున్నారు... తప్పదు కదా ! రోగంతో ప్రాణం పోతున్నదని, బ్రతికే మార్గం వదలలేము మరి.   


సరే మరి ... ఏమిటి స్టాక్ మార్కెట్ అప్ డేట్స్ ... ఈ మధ్య బోలెడన్ని యూ ట్యూబ్ ఛానల్స్ ... టెలిగ్రామ్ ఛానల్స్ ... వెబ్ సైట్స్ ... టీ వి ఛానెల్స్ ... ఫేస్ బుక్ లో కూడా వదలకుండా స్టాక్ మార్కెట్ గురించి సలహాలు ఇచ్చేస్తున్నారు.  నేను జనరల్ గా స్టాక్ మార్కెట్ గురుంచి ఈ బ్లాగ్ లో చర్చించే వాడిని.  ఇన్ని రూపాల్లో ఇంతమంది చెబుతున్నపుడు నేను చెప్పేది నథింగ్ అనిపించింది.  అంతే కాకుండా వాట్స్ యాప్, పేస్ బుక్ లలో పోస్ట్ లు పెట్టడానికి టైం లేదు ... ఇక కి బోర్డు మీద "బి ఏ ఏ జి యు ఎన్ ఎన్ ఏ ఆర్ ఏ ఏ - బాగున్నారా?" అంటూ టైపు చేయడానికి ఓపిక, సమయం ఎక్కడిది 

అంతేనా ... ఇప్పుడు బ్లాగ్స్ ఎవరు చూస్తున్నారు ... ఎవరు ఫాలొ అవుతున్నారు ... అందుకే కొద్దిగా బ్లాగ్ కు దూరం అవ్వాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు సార్ బ్లాగ్ లోకి అంటే ... రావాలని అనిపించింది ... వచ్చాను ... అంతే !


మామూలుగానే కొన్ని స్టాక్స్ కొనడం, కొద్దీ రోజులు హోల్డ్ చేయడం ... పెరుగుతుంటే అమ్మటం ... ఇలా జరుగుతూ వస్తుంది ... ఒక్క వారం క్రితమే బ్యాంకు నిఫ్టీ ఆప్షన్ ట్రేడ్ చేయడం చేస్తున్నాను ...మొదటి రోజు పది వేలు దొబ్బాయి ... మొత్తానికి వారం రోజుల్లో రికవరీ చేసుకున్నాను ... అది వేరే సంగతి ... అంతే కాదు ... మళ్ళీ ఎప్పుడో ఒక్కసారి దెబ్బ పడుతుంది ... కొద్దిరోజులు దూరంగా ఉంటాం ... తరువాత మళ్ళీ మాములే... ప్రస్తుతానికి అయితే బండి సజావుగా నడుస్తుంది ...  అంతేగా .. అంతేగా ... 


బ్యాంక్ నిఫ్టీ రన్నింగ్ వాల్యూ కన్నా ఎక్కువ దగ్గరగా ఉన్న విలువ ధరకు .. వచ్చే వారానికి సంబందించిన కాల్ ఆప్షన్ ఒక లాట్ , ఫుట్ ఆప్షన్ ... ఒక లాట్    ... అమ్మటం లేదా కొనటం చేయాలి ... అమ్మే ధర ఫిక్స్ చేయడం ... ఒకవేళ లాస్ అవుతామని డౌట్ ఉంటె ... తక్కువ లాస్ తో బయట పడటం ... తప్పదంటే మరుసటి రోజుకి ఉంచటం ... సాధ్యమైనంత వరకు అమ్ముకోవటం ... ఇది ప్రస్తుత కార్యక్రమం ... అల్ప సంతోషులం కాబట్టి ... రోజుకి రెండు మూడు వందలు వచ్చినా చాలని సంతృప్త పడుతూ గడిపేస్తున్నా .... ఇది ఇలా లాస్ వచ్చే వరకు ... లేదా డబ్బులు కాస్త అయిపోయే వరకు .... 

సరే మరి ... ఉంటా ఇక ... 


మురళి